Warning For Android Users: ఆండ్రాయిడ్ వినియోగదారులకు హెచ్చరిక.. ఆ పని చేయకపోతే మీ డేటా గోవిందా..!

తాజాగా ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్‌టీ-ఐఎన్) 12, వీ12ఎల్, వీ31, వీ14 కంటే ముందున్న ఆండ్రాయిడ్ వెర్షన్‌లలో అధిక రిస్క్‌ను గుర్తించినట్లు పేర్కొంది. ముఖ్యంగా ఆయా వెర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నవారు జాగ్రత్త పడాలని హెచ్చరించింది. ముఖ్యంగా ఆ వెర్షన్ ఉన్న ఫోన్ నుంచి హ్యాకర్లు ఎలివేటెడ్ అధికారాలను పొందడంతో సున్నితమైన సమాచారాన్ని పొందే అవకాశం ఉందని గుర్తించింది.

Warning For Android Users: ఆండ్రాయిడ్ వినియోగదారులకు హెచ్చరిక.. ఆ పని చేయకపోతే మీ డేటా గోవిందా..!
Android
Follow us

|

Updated on: Jul 11, 2024 | 4:45 PM

ఇటీవలకాలంలో స్మార్ట్ ఫోన్స్ వినియోగించే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ముఖ్యంగా భారతదేశంలో ఎక్కువ మంది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో వచ్చే స్మార్ట్ ఫోన్లను వాడుతున్నారు. తాజాగా ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్‌టీ-ఐఎన్) 12, వీ12ఎల్, వీ31, వీ14 కంటే ముందున్న ఆండ్రాయిడ్ వెర్షన్‌లలో అధిక రిస్క్‌ను గుర్తించినట్లు పేర్కొంది. ముఖ్యంగా ఆయా వెర్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నవారు జాగ్రత్త పడాలని హెచ్చరించింది. ముఖ్యంగా ఆ వెర్షన్ ఉన్న ఫోన్ నుంచి హ్యాకర్లు ఎలివేటెడ్ అధికారాలను పొందడంతో సున్నితమైన సమాచారాన్ని పొందే అవకాశం ఉందని గుర్తించింది. నిర్దేశిత వెర్షన్ల కంటే ముందు వెర్షన్లతో ఉన్న ఫోన్లను హ్యాకర్లు ఫోన్ హ్యాక్ చేసుకుని డేటా తస్కరించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సీఈఆర్‌టీ తాజా హెచ్చరికల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫ్రేమ్‌వర్క్, సిస్టమ్, గూగుల్ ప్లే సిస్టమ్ అప్‌డేట్‌లు, కెర్నల్, ఆర్మ్ కాంపోనెంట్‌లు, మీడియాటెక్ కాంపోనెంట్‌లు, ఇమాజినేషన్ టెక్నాలజీస్, క్వాల్‌కామ్ కాంపోనెంట్‌లు, క్వాల్‌కామ్ క్లోజ్ సోర్స్ కాంపోనెంట్‌లలో లోపాల కారణంగా ఈ సమస్య వచ్చిందని సైబర్‌సెక్యూరిటీ ఏజెన్సీ పేర్కొంది. ఆర్మ్, మీడియాటెక్, ఇమాజినేషన్ టెక్నాలజీస్, క్వాల్‌కామ్‌ల కాంపోనెంట్‌లలో కూడా లాగ్ ఉంది. అందువల్ల మీ ఫోన్‌ను ఆండ్రాయిడ్ తాజా వెర్షన్‌తో రన్ అవుతుందని నిర్ధారించుకోవాలని సీఈఆర్‌టీ పేర్కొంది. సిస్టమ్ అప్‌డేట్‌ల కోసం క్రమం తప్పకుండా తనిఖీ చేసిన, వాటిని వెంటనే ఇన్‌స్టాల్ చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఈ సమస్య నుంచి రక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను ఓ సారి చూద్దాం.

ఆటోమేటిక్ అప్‌డేట్‌లు

మీ ఫోన్‌లో ఆటోమేటిక్ అప్‌డేట్‌లను ప్రారంభించాలి. ఇలా చేస్తే కొత్త అప్‌డేట్‌లో సెక్యూరిటీ సమస్యలు సమసిపోతాయి.  ఆటోమెటిక్ అప్‌డేట్ వల్ల ఫోన్ తాజా అప్‌డేట్స్‌ను వెంటనే పొందుతుంది. 

ఇవి కూడా చదవండి

ట్రస్టెడ్ యాప్స్

గూగుల్ ప్లే స్టోర్ వంటి ట్రస్టెడ్ యాప్ స్టోర్ ద్వారా మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్ చేయాలి. తెలియని లేదా థర్డ్-పార్టీ సిస్టమ్స్‌ నుంచి యాప్‌లను ఇన్‌స్టాల్ చేయకూడదు. ఎందుకంటే అవి హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను కలిగి ఉండవచ్చు.

యాప్ అనుమతులు

మీ యాప్‌లకు మంజూరు చేయబడిన అనుమతులను క్రమం తప్పకుండా సమీక్షించండి. సున్నితమైన సమాచారం లేదా అనవసరమైన అనుమతులకు యాక్సెస్ అభ్యర్థిస్తున్న యాప్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. యాప్ ఫంక్షన్‌కు అధికంగా లేదా అసంబద్ధంగా అనిపించే అనుమతులను ఉపసంహరించుకోవడం ఉత్తమం.

భద్రతా సాఫ్ట్‌వేర్‌

మీ ఫోన్‌లో ప్రసిద్ధ భద్రతా సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయడం మంచిది. ఈ యాప్‌లు హానికరమైన కార్యకలాపాలను గుర్తించడంతో వాటిని నిరోధించడం ద్వారా అదనపు రక్షణను అందిస్తాయి. 

తెలియని లింక్‌లపై క్లిక్స్

అయాచిత సందేశాలు, ఈ-మెయిల్‌లు లేదా లింక్‌లు, ముఖ్యంగా వ్యక్తిగత సమాచారం లేదా ఆధారాల కోసం అడిగే వాటిపై జాగ్రత్తగా ఉండాలి. ఫిషింగ్ దాడులు హ్యాకర్లు హానిని ఉపయోగించుకోవడానికి ఉపయోగించే సాధారణ పద్ధతులని నిపుణులు పేర్కొంటున్నారు .

రెగ్యులర్ బ్యాకప్‌లు

మీ డేటాను ఎప్పటికప్పుడు బ్యాకప్ చేయడం మంచిది. మీ ఫోన్ అనుకోకుండా డెడ్ అయినా బ్యాకప్ పొందడం సులభం అవుతుంది. బ్యాకప్ కలిగి ఉండటం వల్ల మీరు మీ సమాచారం సేఫ్‌గా ఉంటుంది. 

ఫ్యాక్టరీ రీసెట్

మీ ఫోన్‌ను ఎవరైనా హ్యాక్ చేస్తున్నారని అనుమానంగా ఉంటే మీరు మీ ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. ఇది ఏదైనా మాల్వేర్‌తో సహా మీ పరికరంలోని మొత్తం డేటాను తొలగిస్తుంది. అయితే ముందుగా ముఖ్యమైన డేటాను బ్యాకప్ చేయాలని గుర్తుంచుకోవాలి. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్
యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్
హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్
హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్
ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..
ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..
భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ
భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ
ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో
ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!
పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!
మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!
రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!
రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!
లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.
లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.
'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!
'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!
రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!
రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!
గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్
గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్
25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం
25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం