Youtube: మీరు యూట్యూబ్‌ చూస్తారా.? అయితే ఈ ట్రిక్స్‌ గురించి తెలుసుకోవాల్సిందే.

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ ఏదైనా ఉంది ఉంటే అది కచ్చితంగా యూట్యూబ్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ చిన్న అవసరానికి యూట్యూబ్ ఓపెన్‌ చేసే రోజులు వచ్చేశాయ్‌. వంటకం గురించి తెలుసుకోవాలన్నా.? కారు రిపేర్‌ గురించి తెలుసుకోవాలన్నా.? ఇలా ప్రతీ దానికి యూట్యూబ్‌ ఓపెన్‌ చేయాల్సిందే..

Youtube: మీరు యూట్యూబ్‌ చూస్తారా.? అయితే ఈ ట్రిక్స్‌ గురించి తెలుసుకోవాల్సిందే.
Youtube
Follow us

|

Updated on: Jul 11, 2024 | 2:53 PM

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ ఏదైనా ఉంది ఉంటే అది కచ్చితంగా యూట్యూబ్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ చిన్న అవసరానికి యూట్యూబ్ ఓపెన్‌ చేసే రోజులు వచ్చేశాయ్‌. వంటకం గురించి తెలుసుకోవాలన్నా.? కారు రిపేర్‌ గురించి తెలుసుకోవాలన్నా.? ఇలా ప్రతీ దానికి యూట్యూబ్‌ ఓపెన్‌ చేయాల్సిందే. ఇక మరీ ముఖ్యంగా షార్ట్స్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత యూట్యూబ్‌లో గంటలతరబడి ఉపయోగిస్తున్నారు.

మనలో ప్రతీ ఒక్కరూ కచ్చితంగా రోజులో కొంత సమయమైనా యూట్యూబ్‌లో గడపాల్సిందే. అయితే మీరు ప్రతీ రోజూ ఉపయోగించే యూట్యూబ్‌లో మీకు తెలియని కొన్ని ట్రిక్స్‌ ఉన్నాయని మీకు తెలుసా.? ఇంతకీ ఆ ట్రిక్స్‌ ఏంటి.? వాటి ఉపయోగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* సాధారణంగా యూట్యూబ్‌లో షార్ట్స్‌ ఓపెన్‌ చేసి ఏదో కాసేపు చూసి వదిలేద్దాం అనుంకుటాం. అయితే అందులో వచ్చే కంటెంట్‌కి అట్రాక్ట్‌ అయ్యి గంటలకొద్దీ సమయం స్పెండ్‌ చేస్తూనే ఉంటాం. అయితే దీనికి చెక్‌ పెట్టేందుకు ఓ ట్రిక్‌ అందుబాటులో ఉంది. షార్ట్స్‌ ఆటోమెటిక్‌గా ఆగిపోయేలా ఓ సెట్టింగ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా యూట్యూబ్‌లోకి వెళ్లి సెట్టింగ్స్‌లో జనరల్ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. అనంతరం ‘రిమైండ్‌ మీ టు టేక్‌ బ్రేక్‌’ అనే ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకొని టైమర్‌ను సెట్ చేసుకోవాలి. దీంతో మీరు సెట్‌ చేసుకున్న సమయానికి షార్ట్స్‌ ఆటోమెటిక్‌ బ్రేక్‌ తీసుకోండి చాలు అనే నోటిఫికేషన్‌ వచ్చేస్తుంది.

* ఇక యూట్యూబ్‌లో ఉన్న మరో ట్రిక్‌ విషయానికొస్తే.. మనం వీడియో చూస్తున్న సమయంలో నేరుగా యాప్‌ నుంచి బయటకు వచ్చేస్తే వీడియో క్లోజ్‌ అవుతుంది. వీడియో మళ్లీ మొదటి నుంచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా వీడియో బ్యాగ్రౌండ్‌లో ప్లే అయ్యే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ముందుగా క్రోమ్‌లో యూట్యూబ్‌ ఓపెన్‌ చేయాలి. అనంతరం పైన రైట్ సైడ్ కనిపించే త్రీ డాట్స్‌పై క్లిక్‌ చేసి,డెస్క్‌ టాప్‌ సైట్‌ను సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది.

* సాధారణంగా మనం యూట్యూబ్‌లో వీడియో ఓపెన్‌ చేయగానే వీడియోను ఫుల్ స్క్రీన్‌లో చూడ్డానికి స్క్రీన్‌ను ఎన్‌లార్జ్‌ చేయాల్సి ఉంటుంది. అయితే వీడియో ఆటోమెటిక్‌గా ఫుల్‌ స్క్రీన్‌లో చూడ్డానికి ఓ ట్రిక్‌ అందుబాటులో ఉంది. ఇందుకోసం ముందుగా యూట్యూబ్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి జూమ్‌ టూ ఫిల్‌ స్క్రీన్‌ అనే ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. దీంతో ఆటోమెటిక్‌గా వీడియో జూమ్‌లోనే ప్లే అవుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..