AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Realme Narzo 70 5G: అతి తక్కువ ధరకే 5జీ ఫోన్.. ఈ ఒక్క రోజే అవకాశం.. త్వరపడండి..

తక్కువ ధరలో మంచి 5జీ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. రియల్ మీ నుంచి ఓ 5జీ ఫోన్ తక్కువ ధరకే అందుబాటులో ఉంది. పైగా ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారంలో ఆఫర్ కూడా ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. ఆ ఫోన్ ఏంటి? దానిలోని ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తో పాటు అమెజాన్ లోని ఆఫర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Realme Narzo 70 5G: అతి తక్కువ ధరకే 5జీ ఫోన్.. ఈ ఒక్క రోజే అవకాశం.. త్వరపడండి..
Realme Narzo 70 5g
Madhu
|

Updated on: Jul 11, 2024 | 11:16 AM

Share

తక్కువ ధరలో మంచి 5జీ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. రియల్ మీ నుంచి ఓ 5జీ ఫోన్ తక్కువ ధరకే అందుబాటులో ఉంది. పైగా ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారంలో ఆఫర్ కూడా ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. ఆ ఫోన్ ఏంటి? దానిలోని ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తో పాటు అమెజాన్ లోని ఆఫర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

రియల్ మీ నార్జో 70 5జీ..

రియల్ మీ నార్జో 70 5జీ ఈ ఏడాదే మార్కెట్లోకి లాంచ్ అయ్యింది. దీని ధర రూ. 15,999గా ఉంది. అయితే అమెజాన్ ప్లాట్ ఫారంలో దీనిపై రూ. 2000 తగ్గింపు లభిస్తోంది. ఈ ఆఫర్ తో రియల్ మీ నార్జో 70 5జీ ఫోన్ ను మీరు కేవలం రూ. 13,999కే సొంతం చేసుకోవచ్చు.

తగ్గింపు ఇలా..

రియల్ మీ నార్జో 70 5జీ ఫోన్ 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ పై అమెజాన్లో రూ. 2000 డిస్కౌంట్ కూపన్ అందుబాటులో ఉంది. అంటే దీనిని మీరు రూ. 13999కే కొనుగోలు చేయొచ్చు. అదే సమయంలో 8జీబీ + 128జీబీ మోడల్‌పై కూడా అదే ఆఫర్ ఉంది. రూ. 2000 తగ్గింపుతో దీనిని రూ. 14,999 కొనుగోలు చేయొచ్చు. ఈ ఆఫర్ జూలై 11వ తేదీ అర్ధరాత్రి వరకూ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అంటే గురువారం అర్ధరాత్రి లోపు దీనిని అమెజాన్ అధికారిక వెబ్ సైట్ లేదా రియల్ మీ అధికారిక వెబ్ సైట్లో కొనుగోలు చేయొచ్చు. దీనిపై నో కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంది.

రియల్ మీ నార్జో 70 5జీ స్పెసిఫికేషన్స్..

రియల్ మీ నార్జో 70 5జీ ఫోన్ 6.7-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ అమోల్డ్ స్క్రీన్ తో వస్తుంది. ఇది 2400 × 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120హెర్జ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్‌ల వరకు గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. డిస్‌ప్లే రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. గరిష్టంగా 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ను అందిస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా స్టోరేజ్ ను విస్తరించవచ్చు. ఈ 5జీ ఫోన్ 50ఎంపీ ప్రధాన కెమెరా, 2ఎంపీ డెప్త్ సెన్సార్‌తో పాటు ఎల్ఈడీ ఫ్లాష్‌ను కలిగి ఉంటుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 16ఎంపీ షూటర్ ఉంటుంది.

రియల్ మీ నార్జో 70 5జీ ఫీచర్లు..

అదనపు ఫీచర్లలో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5ఎంఎం ఆడియో జాక్, స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఫోన్ ఐపీ54 రేటింగ్‌తో దుమ్ము, స్ప్లాష్-నిరోధకతను కలిగి ఉంది. పరికరం 5000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 45వాట్ల సూపర్ వీఓఓసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో వైఫై, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..