Amazon Sale: కొత్త ఫోన్లపై సరికొత్త ఆఫర్స్.. ఫోన్ కొనేవారికి ఇదే సరైన సమయం..

సామ్సంగ్, మోటోరోలా, వన్ ప్లస్, షియోమి, ఇతర ప్రముఖ బ్రాండ్ల కొత్త స్మార్ట్ ఫోన్లు ఈ సేల్ లో విడుదల కానున్నాయి. వీటిపై ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటించారు. డెలివరీ, నో-కాస్ట్ ఈఎమ్ఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్లు తదితర వాటితో లభ్యమవుతాయి. అమెజాన్ ప్రైమ్ డే సేల్ జూలై 16న ప్రారంభమై 17 వరకూ కొనసాగుతుంది. ప్రైమ్ సభ్యుల కోసం ఫ్యాషన్ నుంచి స్మార్ట్‌ఫోన్ల వరకూ ప్రతిదానిపై గొప్ప తగ్గింపులను అందిస్తుంది.

Amazon Sale: కొత్త ఫోన్లపై సరికొత్త ఆఫర్స్.. ఫోన్ కొనేవారికి ఇదే సరైన సమయం..
Amazon Prime Day Sale
Follow us

|

Updated on: Jul 11, 2024 | 3:47 PM

కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి అద్భుతమైన అవకాశం. వివిధ కంపెనీలు కొత్తగా విడుదల చేసే ఫోన్లు మీకు అందుబాటులోకి రానున్నాయి. దీనికి అమెజాన్ వేదిక కాబోతోంది. జూలై 16, 17 తేదీలలో అమెజాన్ ప్రైమ్ డే సేల్ జరుగుతుంది. ప్రైమ్ మెంబర్ల కోసం ప్రత్యేక తగ్గింపులతో స్మార్ట్ ఫోన్లు, వివిధ ఉత్పత్తుల విక్రయాలు జరుగుతాయి. టాప్ బ్రాండ్ల నుంచి కొత్తగా ప్రారంభించిన స్మార్ట్‌ఫోన్లు కూడా ఈ సేల్ లో లభిస్తాయి. ప్రైమ్ డే సందర్భంగా అమెజాన్ వెబ్ సైట్లో ఇవన్నీ అందుబాటులో ఉంటాయి.

జూలై 16, 17 తేదీలలో..

సామ్సంగ్, మోటోరోలా, వన్ ప్లస్, షియోమి, ఇతర ప్రముఖ బ్రాండ్ల కొత్త స్మార్ట్ ఫోన్లు ఈ సేల్ లో విడుదల కానున్నాయి. వీటిపై ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటించారు. డెలివరీ, నో-కాస్ట్ ఈఎమ్ఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్లు తదితర వాటితో లభ్యమవుతాయి. అమెజాన్ ప్రైమ్ డే సేల్ జూలై 16న ప్రారంభమై 17 వరకూ కొనసాగుతుంది. ప్రైమ్ సభ్యుల కోసం ఫ్యాషన్ నుంచి స్మార్ట్‌ఫోన్ల వరకూ ప్రతిదానిపై గొప్ప తగ్గింపులను అందిస్తుంది.

కొత్త ఫోన్ల విడుదల..

అమెజాన్ సేల్ లో అనేక స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయడంతో పాటు అమ్మకానికి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ ఫోన్ల వివరాలు, ప్రత్యేకతలను తెలుసుకుందాం.

సామ్సంగ్ గెలాక్సీ ఎం35.. ఈ ఫోన్ ను జూలై 17వ తేదీన లాంచ్ చేయనున్నారు. ప్రైమ్ డే లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ లో అసాధారణ కెమెరా, మంచి డిస్‌ప్లే, సాధారణ ఓఎస్ అప్‌గ్రేడ్‌లతో కూడిన సాఫ్ట్‌వేర్‌ ఏర్పాటు చేశారు. సామ్సంగ్ నుంచి వెలువడిన ఫోన్లలో ఇది కూడా ఒక బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు.

ఐక్యూ జెడ్9 లైట్ 5జీ.. ఈ ఫోన్ కూడా జూలై 17వ తేదీన విడుదల కానుంది. ప్రైమ్ డేలో కొనుగోలు దారులకు అందుబాటులోకి వస్తుంది. పనితీరు విషయంలో మరింత మెరుగ్గా ఉంటుంది. ఈ 5జీ ఫోన్ లో నాణ్యమైన హార్డ్‌వేర్‌ టెక్నాలజీ ఉంది.

మోటోరోలా రాజ్ర్ 50 అల్ట్రా.. అందమైన డిజైన్ తో ఆకట్టుకునే ఈ ఫోన్ ఖాతాదారులకు అందుబాటులోకి రానుంది. మోటో ఏఐ ఫీచర్లతో అద్భుతంగా పనిచేస్తుంది. రోజువారీ పనులను అత్యంత వేగంగా, చాలా సులభంగా చేసుకోవచ్చు. ఈ ఫోన్ ధర రూ.89,999. అయితే రూ. 10 వేల తగ్గింపుతో పొందవచ్చు. ఇందుకోసం జూలై 10వ తేదీ నుంచి ప్రీ రిజర్వ్ చేసుకోవాలి.

వన్ ప్లస్ నోర్డ్ సీఈ 4లైట్ 5జీ.. అమోలెడ్ డిస్ ప్లే, ఆరెంజ్ రంగులో ఈ ఫోన్ ఆకట్టుకుంటోంది. ఫాస్ చార్జింగ్ తదితర అదనపు ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రైమ్ డే సందర్భంగా అమెజాన్.ఇన్ లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది.

రెడ్ మీ 13 5జీ.. ఎంట్రీ-లెవల్ 5జీ స్మార్ట్‌ఫోన్లలో రెడ్ మీ 13 5జీ బెస్ట్ అని చెప్పవచ్చు. ఆకట్టుకునే డిజైన్, నాణ్యమైన డిస్‌ప్లేతో మెరుగైన పనితీరుతో లభిస్తుంది. ప్రైమ్ డే సందర్భంగా కొత్త ఆర్చిడ్ పింక్ వేరియంట్‌లో అందుబాటులో రానుంది.

హానర్ 200 సిరీస్.. ఫోటోగ్రఫీ ఔత్సాహికులకు హానర్ 200 సిరీస్ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. మంచి కెమెరా సామర్థ్యం, ఇంటెలిజెంట్ ఏఐ సాఫ్ట్‌వేర్‌ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఫోన్ ను జూలై 18న లాంచ్ చేయనున్నారు. ప్రైమ్ డే సందర్భంగా అందుబాటులో ఉంటుంది.

లావా బ్లేజ్ ఎక్స్.. మెరుగైన పనితీరు, డిజైన్ కలిగిన ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ఫోన్ బాగుంటుంది. అద్భుతమైన డిజైన్, మంచి పనితీరు, చక్కని డిస్‌ప్లే దీని ప్రత్యేకతలు. జూలై 10న లాంచ్ అయిన ఈ ఫోన్ ను ప్రైమ్ డే లో అందుబాటులో ఉంటుంది. అలాగే రియల్ మీ జీటీ 6టీ, వన్ ప్లస్ 12ఆర్ 5జీ ఫోన్లు కూడా అందుబాటులో ఉంటాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఆర్మీ.. ఈ ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్..
ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఆర్మీ.. ఈ ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్..
ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా
ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా
తెరపైకి సరికొత్త చర్చ.. ఆ పార్టీలో మొదలైన ప్రోటోకాల్ రచ్చ..
తెరపైకి సరికొత్త చర్చ.. ఆ పార్టీలో మొదలైన ప్రోటోకాల్ రచ్చ..
చూడ ముచ్చటైన డిజైన్‌తో సీఎమ్‌ఎఫ్‌ ఇయర్‌ బడ్స్‌..
చూడ ముచ్చటైన డిజైన్‌తో సీఎమ్‌ఎఫ్‌ ఇయర్‌ బడ్స్‌..
ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణం.. పట్టు తప్పితే అంతే సంగతులు..
ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణం.. పట్టు తప్పితే అంతే సంగతులు..
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. పంత్ ఔట్?
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. పంత్ ఔట్?
కాంగ్రెస్ గూటికి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి..
కాంగ్రెస్ గూటికి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి..
Controversy:వివాదస్పదమైన టీమిండియా మాజీ క్రికెటర్ల స్టెప్పులు..
Controversy:వివాదస్పదమైన టీమిండియా మాజీ క్రికెటర్ల స్టెప్పులు..
ఢిల్లీలో ఘనంగా జగన్నాథుని రథోత్సవం.. పాల్గొన్న కేంద్ర మంత్రులు..
ఢిల్లీలో ఘనంగా జగన్నాథుని రథోత్సవం.. పాల్గొన్న కేంద్ర మంత్రులు..
కూతురు శిక్షణ కోసం కారు, భూమిని అమ్మేసిన తండ్రి.. కట్‌చేస్తే
కూతురు శిక్షణ కోసం కారు, భూమిని అమ్మేసిన తండ్రి.. కట్‌చేస్తే