AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vivo T3 Ultra: యూజర్లను ఆకర్షిస్తున్న వివో నయా ఫోన్.. ఫీచర్లు అదిరిపోయాయంతే..!

భారతదేశంలో ఇటీవల కాలంలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో వరుసగా సరికొత్త ఫోన్లను లాంచ్ చేస్తుంది. ముఖ్యంగా ఇటీవల రిలీజ్ చేసిన వివో టీ-3 అల్ట్రా యూజర్లను అమితంగా ఆకర్షిస్తుంది. ఫోన్ వాడుతున్న వారు మంచి రివ్యూలను ఇస్తున్నారు. కెమెరాతో పాటు ఫీచర్లపరంగా ఈ ఫోన్ అనువుగా ఉంటుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Vivo T3 Ultra: యూజర్లను ఆకర్షిస్తున్న వివో నయా ఫోన్.. ఫీచర్లు అదిరిపోయాయంతే..!
Vivo T3 Ultra
Nikhil
|

Updated on: Oct 10, 2024 | 3:47 PM

Share

భారతదేశంలో ఇటీవల కాలంలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో వరుసగా సరికొత్త ఫోన్లను లాంచ్ చేస్తుంది. ముఖ్యంగా ఇటీవల రిలీజ్ చేసిన వివో టీ-3 అల్ట్రా యూజర్లను అమితంగా ఆకర్షిస్తుంది. ఫోన్ వాడుతున్న వారు మంచి రివ్యూలను ఇస్తున్నారు. కెమెరాతో పాటు ఫీచర్లపరంగా ఈ ఫోన్ అనువుగా ఉంటుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొన్ని ఫీచర్లు యూజర్లు సహనాన్ని పరీక్షిస్తాయని చెబుతున్నారు. వివో టీ-3 అల్ట్రా ఫోన్ ఫీచర్లు వివో వీ 40తో సరిసమానంగా ఉన్నాయని పేర్కొంటున్నారు.  డైమెన్షన్ 9200+ చిప్‌సెట్‌తో వచ్చే వివో టీ3 అల్ట్రా ధర రూ. 28,999 ఉంటే వీ40 సిరీస్ ధర రూ. 34,999. కాబట్టి ధర పరంగా వివో టీ-3 అల్ట్రా మెరుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వివో టీ-3 అల్ట్రా ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

వివో టీ-3 అల్ట్రా మినిమలిస్టిక్ డిజైన్‌తో ఆకట్టుకుంటుందని యూజర్లు చెబుతున్నారు. ఈ ఫోన్ చూడగానే ఓ ప్రీమియం ఫోన్ చూసినంత అనుభూతి కలుగుతుందని వివరిస్తున్నారు. ఫ్రాస్ట్ గ్రీన్ కలర్ వేరియంట్ అయితే వేరు లెవెల్ అని పేర్కొంటున్నారు. అయితే ఈ ఫోన్‌ను కచ్చితంగా కంపెనీ అందించే కేస్ ద్వారా వాడాలని లేకపోతే జారిపోయే ప్రమాదం ఉందని యూజర్లు చెబుతున్నారు. ఈ ఫోన్ ఐపీ 68 రేటింగ్‌‌తో వస్తుంది. 6.78 అంగుళాల కర్వ్‌డ్ ఎమో ఎల్ఈడీ డిస్‌ప్లే గేమింగ్ ప్రియులతో పాటు ఎక్కువగా వీడియోలను స్ట్రీమింగ్ చేసే వారిని ఆకట్టుకుంటుంది. 4500 నిట్స్ బ్రైట్‌నెస్ అమితమైన వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. ఆరా లైట్ ఫీచర్ మహిళలను అమితంగా ఆకర్షస్తుంది. ఈ ఫోన్‌లో వచ్చే సింగిల్ స్పీకర్ మంచి రేంజ్‌తో స్పష్టమైన ఆడియోను అందిస్తుంది.

వివో టీ3 అల్ట్రా ఫన్ టచ్ ఓఎస్ 14 ఆధారంగా పని చేస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పని చేస్తుంది. తాజా అప్‌డేట్స్ ప్రకారం వివో రెండు సంవత్సరాల ఓఎస్ అప్‌డేట్స్‌ను, మూడు సంవత్సరాల భద్రతా నవీకరణలను వాగ్దానం చేసింది.  బ్యాటరీ లైఫ్ విషయానికొస్తే వివో టీ 3 అల్ట్రా 5500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. గేమర్స్‌తో పాటు అధికంగా ఫోన్ యూజ్ చేసే వారికి బ్యాటరీ పనితీరు ఆకట్టుకుంటుంది. వివో టీ3 అల్ట్రా కొన్ని ఆకట్టుకునే కెమెరా సాంకేతికతతో వస్తుంది. ముఖ్యంగా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తో 50 ఎంపీ కెమెరా ఆకట్టుకుంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
15 ఏళ్లకే అంతా కుళ్లుకునేలా చేశావ్: వైభవ్‌ను హెచ్చరించిన దిగ్గజం
15 ఏళ్లకే అంతా కుళ్లుకునేలా చేశావ్: వైభవ్‌ను హెచ్చరించిన దిగ్గజం
జెర్రిపోతు పాముకు తాచుపాము విషం పనిచేయదా?
జెర్రిపోతు పాముకు తాచుపాము విషం పనిచేయదా?
ఆసియా రిలేస్‌లో భారత్‌కు స్వర్ణం.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
ఆసియా రిలేస్‌లో భారత్‌కు స్వర్ణం.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
పౌరసత్వానికి ప్రూఫ్‌గా పాస్‌పోర్ట్ ఉపయోగపడదా..? కేంద్రం క్లారిటీ
పౌరసత్వానికి ప్రూఫ్‌గా పాస్‌పోర్ట్ ఉపయోగపడదా..? కేంద్రం క్లారిటీ
టీ20 వరల్డ్ కప్ వేళ పాక్ జట్టులో రచ్చ రచ్చ
టీ20 వరల్డ్ కప్ వేళ పాక్ జట్టులో రచ్చ రచ్చ
రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్!
రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్!
లిఫ్ట్‌లో అద్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా? 99 శాతం మందికి తెలియదు..!
లిఫ్ట్‌లో అద్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా? 99 శాతం మందికి తెలియదు..!
AP POLYCET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. సీటు పొందాలంటే ఇలా చేయండి
AP POLYCET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. సీటు పొందాలంటే ఇలా చేయండి
కెనడా ప్లేయర్ కాలు విరగ్గొట్టిన ఖతార్ ప్లేయర్ పై నిషేధం
కెనడా ప్లేయర్ కాలు విరగ్గొట్టిన ఖతార్ ప్లేయర్ పై నిషేధం
నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోవాల్సిందే.. హెల్తీ ‘బెల్లం రవ్వ లడ్డు
నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోవాల్సిందే.. హెల్తీ ‘బెల్లం రవ్వ లడ్డు