Vivo Y53s: ఆగస్టు 9న విడుదల కానున్న వివో వై 53ఎస్ ఫోన్.. ధర ఎంతంటే?

వివో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో విడుదల చేసేందుకు సిద్ధమైంది. వివో వై 53 ఎస్ పేరుతో రానున్న ఈ ఫోన్‌ను ఆగస్టు 9న సోమవారం లాంచ్ చేస్తున్నట్లు వివో సంస్థ తెలిపింది. ఈ ఫోన్ తొలుత గత నెలలో వియత్నాంలో విడుదల అయింది.

Vivo Y53s: ఆగస్టు 9న విడుదల కానున్న వివో వై 53ఎస్ ఫోన్.. ధర ఎంతంటే?
Vivo Y53s
Follow us
Venkata Chari

|

Updated on: Aug 07, 2021 | 5:29 AM

Vivo Y53s: వివో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో విడుదల చేసేందుకు సిద్ధమైంది. వివో వై 53 ఎస్ పేరుతో రానున్న ఈ ఫోన్‌ను ఆగస్టు 9న సోమవారం లాంచ్ చేస్తున్నట్లు వివో సంస్థ తెలిపింది. ఈ ఫోన్ తొలుత గత నెలలో వియత్నాంలో విడుదల అయింది. ఇది వాటర్‌డ్రాప్-స్టైల్ డిస్ప్లే నాచ్‌తోపాటు ట్రిపుల్-రియర్ కెమెరాలతో విడుదల కానుంది. వివో వై 53 ఎస్‌లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 128 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ అందించారు. బేస్ మోడల్‌తో పాటు, వివో వై53ఎస్‌లో 5G వేరియంట్ కూడా ఉంది. అయితే కంపెనీ ప్రస్తుతం ఈ మోడల్‌ను భారతదేశంలో లాంచ్ చేయడంలేదు. కేవలం 4G ఆప్షన్‌తోనే ఇండియాలో రిలీజ్ చేయనుంది.

వివో వై 53 ఎస్ ధర (అంచనా) వివో వై53ఎస్ ప్రైస్ ధరలు ఇంకా విడుదల కాలేదు. కానీ, నెట్టింట్లో మాత్రం వీటి ధరలు హల్‌చల్ చేస్తున్నాయి. 8జీబీ ర్యామ్+ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 22,990గా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ డీప్ సీ బ్లూ, ఫెంటాస్టిక్ రెయిన్‌బో కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉండనున్నాయి.

వివో వై 53 ఎస్ స్పెసిఫికేషన్‌లు వియత్నాంలో విడుదలైన మోడల్‌లో ఉన్న ఫీచర్లే ఇందులో ఉండనున్నట్లు తెలుస్తోంది. వివో వై 53 ఎస్ ఆండ్రాయిడ్ 11 ఆధారంగా తయారు చేసిన ఫన్‌టచ్ ఓఎస్ 11.1 పై పనిచేయనుంది. ఇందులో 6.58-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,080×2,400 పిక్సెల్స్) డిస్‌ప్లేను కలిగి ఉంది. 60Hz రిఫ్రెష్ రేట్‌ కలిగి ఉంది. 8 జీబీ ర్యామ్‌తో పాటు ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో జీ 80 సోసి ప్రాసెసర్‌తో పనిచేయనుంది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ అందించారు. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ ఉన్నాయి.

వివో వై 53 ఎస్ ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు. 128జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తోపాటు 4G LTE, Wi-Fi, బ్లూటూత్ v5.0, USB టైప్-సీ పోర్ట్‌ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ సైడ్‌కు అందించారు. 35W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీతో అలరించనుంది. ఈ ఫోన్ బరువు 190 గ్రాములుగా ఉంది.

Also Read: Telegram Group Calling: ఇప్పుడు టెలిగ్రామ్ యాప్ ద్వారా ఒకేసారి వెయ్యిమందితో మాట్లాడొచ్చు!

Car Care in Rain: వర్షంలో కారు అద్దంపై నీరు నిలిచిపోతోందా? ఇలా చేసి చూడండి..