Vivo T3 5G: వివో నుంచి మరో బడ్జెట్ ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్స్ అరాచకం అంతే..
నెట్టింట వైరల్ అవుతోన్న సమాచారం ఆధారంగా వివో టీ3 5జీ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారని తెలుస్తోంది. అలాగే ఇందులో పంచ్-హోల్ సెటప్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారని తెలుస్తోంది. డిస్‌ప్లే విషయానికొస్తే ఇందులో హెచ్‌డీ+ రిజల్యూషన్‌తో కూడిన స్క్రీన్‌ను ఇవ్వనున్నారు. 120హెచ్‌జెడ్...

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని ఈ ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. వివో టీ3 5జీ పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. అయితే కంపెనీ ఇప్పటి వరకు ఈ ఫోన్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే నెట్టింట మాత్రం ఈ ఫోన్ ఫీచర్లు, ధరకు సంబంధించిన కొన్ని లీక్స్ వైరల్ అవుతున్నాయి. వీటి ఆధారంగా ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
నెట్టింట వైరల్ అవుతోన్న సమాచారం ఆధారంగా వివో టీ3 5జీ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారని తెలుస్తోంది. అలాగే ఇందులో పంచ్-హోల్ సెటప్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారని తెలుస్తోంది. డిస్‌ప్లే విషయానికొస్తే ఇందులో హెచ్‌డీ+ రిజల్యూషన్‌తో కూడిన స్క్రీన్‌ను ఇవ్వనున్నారు. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను ఇవ్వనున్నారని తెలుస్తోంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్‌లో శక్తివంతమైన MediaTek Dimensity 7200 ప్రాసెసర్‌ను ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వివోట్ టీ3 5జీ ఫోన్‌ను 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో తీసుకురానున్నారని సమాచారం. అలాగే ఇందులో అదనంగా ఎక్స్‌టెండెడ్ RAM 3.0 ఫీచర్‌ను ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో ర్యామ్‌ను వర్చువల్‌గా 8 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉండనున్నట్లు సమాచారం. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. రెయిర్ కెమెరాలో భాగంగా సెటప్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50MP సోనీ IMX882 సెన్సార్ కెమెరాను ఇవ్వనున్నారి సమాచారం.
ఈ కెమెరాతో సులభంగా 4కే రిజల్యూషన్‌తో కూడిన వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చని సమాచారం. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారని తెలుస్తోంది. అలాగే ఇందులో 44 వాట్స్ ఫ్లాష్‌ఛార్జ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించనున్నారని తెలుస్తోంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో పాటు IP54 డస్ట్ సపోర్ట్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ధర విషయానికొస్తే రూ. 20,000లోపు ఉండొచ్చని సమాచారం.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..




