Twitter: ట్విట్టర్ లో కొత్త ఫీచర్.. ఇక నిర్భయంగా ప్రైవేట్ ట్వీట్లు.. అందరికీ అందుబాటులోకి..

ప్పటివరకు ట్విట్టర్ లో మనం ఏం ట్విట్ చేసినా.. అందరికీ కనిపిస్తుంది. దానిని ఎవరైనా రీట్వీట్ చేయ్యొచ్చు. కాని ట్విట్టర్ వినియోగదారులకు ఆసంస్థ ఓ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

Twitter: ట్విట్టర్ లో కొత్త ఫీచర్.. ఇక నిర్భయంగా ప్రైవేట్ ట్వీట్లు.. అందరికీ అందుబాటులోకి..
Twitter
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 31, 2022 | 6:17 PM

Twitter: ఇప్పటివరకు ట్విట్టర్ లో మనం ఏం ట్విట్ చేసినా.. అందరికీ కనిపిస్తుంది. దానిని ఎవరైనా రీట్వీట్ చేయ్యొచ్చు. కాని ట్విట్టర్ వినియోగదారులకు ఆసంస్థ ఓ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ట్విట్టర్ సర్కిల్ ఫీచర్ పేరుతో దీనిని అందరికి అందుబాటులోకి తెచ్చింది. ఇక నుంచి ఎవరైనా ఎంపిక చేసినా వారితో 150 మందికి మించకుండా ఓ గ్రూప్ ను ఏర్పాటుచేసుకోవచ్చు. అందులో చేసే ట్వీట్లు గ్రూపులో వారికి మినహా మిగిలిన వారికి కనబడవు. దీంతో ఎవరైనా ఇతరులకు తెలియకుండా పరమిత సంఖ్యలో తమ స్నేహితులు లేదా ఎంపిక చేసుకున్న వ్యక్తులకు మాత్రమే తెలిసేలా ప్రయివేటు ట్వీట్లు చేసే వెసులుబాటు కలిగింది. ఈసరికొత్త ట్విట్టర్ సర్కిల్ ఫీచర్ ఇన్ స్టాగ్రామ్ లోని క్లోజ్ ఫ్రెండ్స్ ఫీచర్ ను పోలిఉంది.

మేనెలలోనే ట్విట్టర్ ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికి కొంత మంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంచింది. వినియోగదారుల అభిప్రయాలను తెలుసుకున్న తర్వాత ప్రస్తుతం అందరికీ ఈఫీచర్ అందుబాటులో ఉన్నట్లు ట్విట్టర్ సంస్థ ప్రకటించింది. ఈసర్కిల్ క్రియేట్ చేసేటప్పుడు మనకు కావల్సిన వినియోగదారులకు జోడించి గ్రూపుగా క్రియేట్ చేయవచ్చు. అయితే ఈసర్కిల్ లో చేసిన ట్వీట్లను రీట్వీట్ చేసే అవకాశం ఉండదు. ట్విట్టర్ వినియోగదారుల ప్రైవసీని దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేసిన వ్యక్తుల మధ్య సమాచారం బహిర్గతం కాకుండా ఉండేందుకు రీట్వీట్ చేసే వీలులేకుండా కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. కొత్త ఫీచర్ ద్వారా ఏదైనా ట్వీట్ చేస్తే అధి కేవలం ఆసర్కిల్ లో ఉన్నవారికి మాత్రమే కన్పిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం చూడండి..