AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp Hack: ఇలాంటి తప్పులు చేస్తున్నారా.. ఒక్క ఫోన్ కాల్‌తో మీ వాట్సాప్‌ అకౌంట్ హ్యాక్ అయ్యే ఛాన్స్..

ప్రజలను ట్రాప్ చేయడానికి హ్యాకర్లు వివిధ పద్ధతులను ఉపయోగిస్తుంటారు. వాట్సాప్‌ను హ్యాక్ చేయడానికి కూడా అలాంటి ఓ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. వాట్సాప్‌ని హ్యాకర్లు ఎలా హ్యాక్ చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

WhatsApp Hack: ఇలాంటి తప్పులు చేస్తున్నారా.. ఒక్క ఫోన్ కాల్‌తో మీ వాట్సాప్‌ అకౌంట్ హ్యాక్ అయ్యే ఛాన్స్..
Venkata Chari
|

Updated on: May 28, 2022 | 10:30 AM

Share

ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్‌(smartphone)ల డిమాండ్‌ పెరగడంతో మోసాలు చేసే విధానం కూడా మారిపోయింది. సైబర్ నేరగాళ్లు(Cyber Criminal) ప్రజలను ట్రాప్ చేయడానికి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్నారు. ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్‌కు ఉన్న ఆదరణ నేపథ్యంలో మోసాలు కొత్త స్కామ్‌ను ప్రారంభించాయి. నివేదికల ప్రకారం, సైబర్ ప్రపంచంలో కొత్త వాట్సాప్(WhatsApp) మోసం జరుగుతోంది. దీని సహాయంతో హ్యాకర్లు మీ వాట్సాప్ ఖాతాను హ్యాక్ చేయవచ్చు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ట్రిక్ సాధారణం.. కానీ, చాలా ప్రమాదకరం..

ఇవి కూడా చదవండి

క్లౌడ్‌సెక్‌.కామ్‌ సీఈవో రాహుల్‌ శశి ఈ విషయాన్ని వెల్లడించారు. వాట్సాప్ యూజర్ల ఖాతాను హ్యాక్ చేసేందుకు కొత్త ఓటీపీ మోసం జరుగుతోందని రాహుల్ చెప్పుకొచ్చారు. శశి ప్రకారం, సైబర్ నేరగాళ్లు వినియోగదారుల ఖాతాలను హ్యాక్ చేయడానికి ఒక సాధారణ ట్రిక్ ఉపయోగిస్తున్నారు.

కస్టమర్ కేర్ నంబర్లతో..

రాహుల్ తెలిపిన వివరాల ప్రకారం, హ్యాకర్లు వ్యక్తులకు ఫోన్ చేసి **67* లేదా *405* డయల్ చేయమని అడుగుతున్నారు. ఒక వినియోగదారు ఈ నంబర్‌లను డయల్ చేసిన వెంటనే, వినియోగదారుడి WhatsApp ఖాతా ఆటోమెటిక్‌గా లాగ్ అవుట్ అవుంతుంది. దీంతో హ్యాకర్లు దానిపై పూర్తి నియంత్రణను పొందుతారు. నంబర్‌ని డయల్ చేయడం ద్వారా హ్యాకర్‌లు ఎలా నియంత్రణ పొందుతారు అని మీరు ఆలోచిస్తున్నారా? అక్కడికే వస్తున్నాం..

అసలు మ్యాటర్ ఏమిటంటే?

వాస్తవానికి వినియోగదారులు డయల్ చేస్తున్న నంబర్ జియో, ఎయిర్‌టెల్ సేవలకు సంబంధించినదని శశి పేర్కొన్నారు. ఇది కాల్ ఫార్వార్డింగ్ కోసం ఉపయోగించేందుకు వాడే నంబర్. ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు, ఏదైనా నంబర్‌కు ఫార్వార్డ్ చేసే ఈ ట్రిక్‌లో హ్యాకర్లు వినియోగదారులను ట్రాప్ చేస్తున్నారు.

మరోవైపు, హ్యాకర్లు WhatsApp రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభిస్తారు. ఫోన్ కాల్ ద్వారా OTP ఎంపికను ఎంచుకుంటారు. ఆ సమయంలో వినియోగదారుల ఫోన్ బిజీగా ఉన్నందున, హ్యాకర్ నంబర్‌కు (కాల్ ద్వారా) OTP వస్తుంది. వారు మీ ఖాతాను యాక్సెస్ చేసేందుకు అనుమతి పొందనున్నారు.

ఈ ట్రిక్ ప్రపంచవ్యాప్తంగా పని చేస్తుంది. ఎందుకంటే అన్ని టెలికాం ఆపరేటర్లు ఒకటి లేదా రెండు నంబర్లను అందిస్తారు. మీరు వాట్సాప్‌కు లాగిన్ అయినప్పుడల్లా, వినియోగదారు ధృవీకరణ కోసం రిజిస్టర్ నంబర్‌పై OTP వస్తుందని గుర్తుంచుకోండి. ఇందులో, SMSలో 6 అంకెల OTP ఉంటుంది. ఇది ధృవీకరణ కోసం ఉపయోగిస్తారు. SMSతో పాటు, మీరు కాల్‌లో OTP కోడ్‌ను కూడా రిసీవ్ చేసుకుంటారు.