Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Most Popular Apps: యాప్.. సూపర్ హిట్.. ప్రపంచంలో అత్యధిక మంది వినియోగిస్తున్న యాప్‌లు ఇవే.. 

గూగుల్ ప్లే స్టోర్లో గానీ, లేదా ఐఓఎస్ స్టోర్ లో గానీ లక్షలాది యాప్స్ మనకు కనిపిస్తాయి. ప్రతి రంగానికి సంబంధించిన యాప్స్ కుప్పలు తెప్పలుగా ఉంటాయి. అయితే వీటిల్లో కొన్ని యాప్స్ మాత్రం దాదాపు అన్ని ఫోన్లలో కనిపిస్తాయి. అవి లేని ఫోన్లు ఉండవంటే అతిశయోక్తి కాదేమో! అటువంటి మోస్ట్ పాపులర్ యాప్స్ ఏంటి? అత్యధిక డౌన్ లోడ్లతో ప్రతి మొబైల్ లోనూ కనిపించే యాప్స్ ఏంటి? తెలుసుకుందాం రండి.

Most Popular Apps: యాప్.. సూపర్ హిట్.. ప్రపంచంలో అత్యధిక మంది వినియోగిస్తున్న యాప్‌లు ఇవే.. 
Apps
Follow us
Madhu

|

Updated on: Aug 22, 2023 | 5:00 PM

ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చాక ప్రపంచ గతి పూర్తిగా మారిపోయింది. ప్రతి ఒక్కటి యాప్ ల రూపంలో ఫోన్లో ఇమిడి పోతోంది. ఆటలు, పాటలు, గేమ్స్, సోషల్ మీడియా ఇలా ఒకటేమిటి సర్వం అరచేతిలో ఇమిడిపోతోంది. గూగుల్ ప్లే స్టోర్లో గానీ, లేదా ఐఓఎస్ స్టోర్ లో గానీ లక్షలాది యాప్స్ మనకు కనిపిస్తాయి. ప్రతి రంగానికి సంబంధించిన యాప్స్ కుప్పలు తెప్పలుగా ఉంటాయి. అయితే వీటిల్లో కొన్ని యాప్స్ మాత్రం దాదాపు అన్ని ఫోన్లలో కనిపిస్తాయి. అవి లేని ఫోన్లు ఉండవంటే అతిశయోక్తి కాదేమో! అటువంటి మోస్ట్ పాపులర్ యాప్స్ ఏంటి? అత్యధిక డౌన్ లోడ్లతో ప్రతి మొబైల్ లోనూ కనిపించే యాప్స్ ఏంటి? తెలుసుకుందాం రండి. ప్రపంచంలోని అత్యధిక మొబైల్ యూజర్లు వినియోగించే టాప్ 10 యాప్ లను మీకు తెలియజేస్తున్నాం ఓ లుక్కేసేయండి..

కింగ్ ఆఫ్ యాప్స్ టిక్ టాక్.. వరుసగా మూడో ఏడాది కూడా టిక్ టాక్ ప్రపచంలోనే అత్యధిక డౌన్ లోడ్లు సాధించిన యాప్ గా ఘనత సాధించింది. అయితే ఈ యాప్ పై మన దేశం బ్యాన్ విధించిని విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రపంచ మార్కెట్లో ఈ యాప్ నకు తిరుగలేదు.

రీల్స్‌తో డౌన్‌లోడ్ల జాతర ఇన్‌స్టాగ్రామ్.. టిక్ టాప్ తర్వాత డౌన్ లోడ్లలో ప్రభంజనం సృష్టిస్తోన్న మరో యాప్ ఇన్‌స్టాగ్రామ్. దీనిలోని రీల్స్, స్టోరీస్ నెటిజనులను విపరీతంగా ఆకర్షిస్తోంది. మెటా యాజమాన్యంలో నడిచే ఈ యాప్ వినియోగదారులను తన రీల్స్, స్టోరీలతో కట్టిపడేస్తోంది.

ఇవి కూడా చదవండి

వన్నెతగ్గని ఫేస్ బుక్.. ఇప్పటికీ ఫేస్ బుక్ వాడతున్నవారు ఉన్నారా? అని చాలా మంది ఆశ్చర్యపోతారు. కానీ నిజమే సోషల్ మీడియా ప్లాట్ ఫారంలో ఫేస్ బుక్ ఇప్పటికీ తన టాప్ పొజిషన్ ను కాపాడుకుంటూనే ఉంది. ప్రపంచంలోనే ఎక్కువ డౌన్ లోడ్ అవుతున్న యాప్లలో ఇది కూడా ఒకటి.

వాట్సాప్ కమ్యూనికేషన్ కా అడ్డా.. ప్రపంచ వ్యాప్తంగా సమచార మార్పిడికి విరివిగా వినియోగిస్తున్న ఏకైనా మాధ్యమం వాట్సాప్. వాట్సాప్ ద్వారా వినియోగదారులు మెసేజ్ లు, ఫొటోలు, వీడియోలు, వాయిస్ మెసేజ్ లు పంపుతుంటారు.

వీడియో ఎడిటింగ్ క్యాప్ కట్.. టిక్ టాప్ యాప్ పాపులారిటీ పెరగడం ఈ యాప్ నకు కూడా కలిసివచ్చింది. దీని ద్వారా షార్ట్ వీడియోను ఎడిట్ చేయడం చాలా సులభం. అందువల్ల టిక్ టాక్ వినియోగదారులందరూ కూడా దాదాపు ఈ క్యాప్ కట్ వీడియో ఎడిటింగ్ యాప్ ను వినియోగిస్తున్నారు. ఇతర షార్ట్ వీడియో ప్లాట్ ఫారం వినియోగదారులకు కూడా దీనిని విరివిగానే వినియోగిస్తున్నారు.

వేగంగా విస్తరిస్తున్న టెలిగ్రామ్.. అత్యధిక ప్రైవసీ ఉండే మెసేజింగ్ యాప్ ఇది. ఇటీవల కాలంలో దీని వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది. పెద్ద సైజుల్లో ఫైల్స్ పంపుకోడానికి అనుమతి ఉండటంతో అధికంగా వినియోగదారులు డౌన్ లోడ్ చేస్తున్నారు.

పుంజుకుంటున్న స్నాప్ చాట్.. మల్టీమీడియా మెసేజింగ్ యాప్ అయిన స్నాప్ చాట్ డిసప్పియరింగ్ మెసేజెస్, అగ్యూమెంటెడ్ రియాలిటీ ఫీచర్లకు పెట్టింది పేరు. దీనిని కూడా వినియోగదారులు అధికంగానే డౌన్ లోడ్ చేస్తున్నారు.

తనదైన ముద్ర వేస్తున్న స్పాటిఫై.. మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ అయిన స్పాటిఫై కూడా గ్లోబల్ వైడ్ గా తన వినియోగదారులను పెంచుకుంటోంది. దీనిలో హై క్వాలిటీతో కూడిన సాంగ్స్ తో పాటు, ఆకర్షణీయమైన ఫీచర్లు, పెద్ద సంఖ్యలో పాటల లైబ్రెరీ డౌన్ లోడ్లు పెరిగేలా చేస్తోంది.

అత్యద్భుత ఆఫర్ల కోసం టెమూ.. చైనా ఆధారిత ఆన్ లైన్ షాపింగ్ యాప్ ఇది. దీనిలో కనీవినీ ఎరుగని ఆఫర్లు అందిస్తుంది. అనేక రకాల ఉత్పత్తులపై ప్రత్యేక మైన డిస్కౌంట్లు ఉంటాయి. ఇటీవల కాలంలో దీనికి వినియోగదారుల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వస్తుండటంతో డౌన్ లోడ్లు పెరుగుతున్నాయి.

మెటా నుంచి మరో స్టార్ మెసెంజర్.. మెటా యాజమాన్యం నుంచి వస్తున్న మరో యాప్ మెసెంజర్ ఇది. ఇది ఫేస్ బుక్ తో అనుసంధానంగా పనిచేస్తుంది. ప్రత్యేకించి మెసేజెస్ కోసం, చాటింగ్ చేయడానికి ఇది ఉపకరిస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..