Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సిమ్ కార్డుతో పనిలేదు QR కోడ్‌ని స్కాన్ చేస్తే చాలు.. E-Simతో మాట్లాడేయొచ్చు.. ఎలా అంటారా..

QR based E-Sim: టెక్నాలజీ వేగంగా మారుతోంది. ఈ గంటలో ఉన్నది మరో గంటలో కనిపించడం లేదు. అంతవేగంగా మార్పులు జరుగుతున్నాయి. మనం నిత్యం వెంటపెట్టుకుని తిరిగే స్మార్ట్‌ఫోన్‌లో సిమ్ లేకుంటే పని చేయదు. ఇ-సిమ్ టెక్నాలజీ నెమ్మదిగా ప్రాచుర్యం పొందుతోంది. ప్రజలు భద్రత పరంగా దీనిని అవలంబిస్తున్నారు. త్వరలో మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఈ-సిమ్‌కు సంబంధించిన ప్రత్యేక ఫీచర్‌ను కూడా పొందుతారు. ఇది ఇక గతం.. సిమ్ కార్డులేకుండానే జస్ట్ క్యూఆర్ కోడ్‌తో కనెక్ట్ కావొచ్చు. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం..

సిమ్ కార్డుతో పనిలేదు QR కోడ్‌ని స్కాన్ చేస్తే చాలు.. E-Simతో మాట్లాడేయొచ్చు.. ఎలా అంటారా..
eSIM
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 22, 2023 | 4:05 PM

గూగుల్ రాబోయే కాలంలో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో అద్భుతమైన ఫీచర్‌ను అందించబోతోంది. ఆ తర్వాత ఆండ్రాయిడ్ వినియోగదారులు తమ ఇ-సిమ్ కార్డ్‌ను ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్‌కి సులభంగా ట్రాన్స్‌ఫర్ చేయగలుగుతారు. మీరు QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా మీ SIMని కొత్త ఫోన్‌కి ట్రాన్స్‌ఫర్ చేయగలుగుతారు. అంటే మీకు ఏంటో తెలుసా.. ఇప్పటి వరకు మనం ఒక ఫోన్ నుంచి మరో ఫోన్‌లోకి సిమ్ కార్డు మార్చుకోవల్సి వచ్చేంది. ఇక ముందు అంతలా ఇబ్బంది పడాల్సిన పనిలేదు. QR కోడ్‌ని స్కాన్ చేస్తే చాలు ఒక ఫోన్ నుంచి మరో ఫోన్‌లోకి మొత్తం మారిపోతుంది.

ప్రస్తుతం, E-Sim సపోర్ట్ చేస్తున్న ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఇప్పటి వరకు భారతదేశంలో విక్రయించబడలేదు. అయితే భవిష్యత్తులో ప్రజల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని.. కంపెనీ ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్‌లో తీసుకురాబోతోంది. ఆపిల్ ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఈ-సిమ్ కార్డ్ సేవలను అందిస్తోంది. టెక్నాలజీ వేగంగా మారుతోంది. ఈ గంటలో ఉన్నది మరో గంటలో కనిపించడం లేదు. అంతవేగంగా మార్పులు జరుగుతున్నాయి. మనం నిత్యం వెంటపెట్టుకుని తిరిగే స్మార్ట్‌ఫోన్‌లో సిమ్ లేకుంటే పని చేయదు.

యాపిల్ తన తాజా పరికరాలలో ఈ సిమ్ కార్డుకు సపోర్ట్ చేస్తోంది. కంపెనీ iOSలో ఒక ఫీచర్‌ను అందించింది. దీని సహాయంతో ఐఓఎస్ వినియోగదారులు రెండు ఐఫోన్‌ల మధ్య సిమ్ కార్డ్‌ను సులభంగా ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. ఇప్పుడు ఆండ్రాయిడ్ కూడా అదే లైన్‌లో పనిచేస్తోంది. అయితే, మీరు ఈ ఫీచర్‌ని ఆండ్రాయిడ్‌లో వేరే విధంగా పొందుతారు. కంపెనీ ఈ ఫీచర్‌ని ప్లేస్టోర్‌లో ఎక్కడో ఏర్పాటు చేస్తోంది. వినియోగదారులు QR కోడ్‌ని స్కాన్ చేయాలి.. ఆ తర్వాత వారు SIM కార్డ్‌ను ట్రాన్స్‌ఫర్ చేయగలుగుతారు. ప్రస్తుతానికి, ఈ ఫీచర్ అసలు ఎక్కడ ఉంటుంది.. మొత్తం ప్రక్రియ ఎలా జరుగుతుందనే విషయాలు వెల్లడించలేదు.

మొదటి పిక్సెల్ ఫోన్‌లో ఫీచర్లను..

గూగుల్ ఈ క్యూఆర్ సపోర్టుతో పనిచేసే ఈ-సిమ్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌ను ముందుగా Pixel పరికరాలకు అందించగలదని తాజాగా అందుతున్న సమాచారం. వాస్తవానికి, ఈ కంపెనీ చాలాసార్లు పిక్సెల్ పరికరాల కోసం కొత్త ఫీచర్‌లను విడుదల చేస్తుంది. తర్వాత అవి ఇతర కస్టమర్‌లకు అందుబాటులో ఉంటాయి. మొత్తంమీద, రెండు ఆండ్రాయిడ్ పరికరాల మధ్య e-SIMని ట్రాన్స్‌ఫర్ చేయడానికి ప్రస్తుతం ఎటువంటి ఎంపిక లేనందున ఈ నవీకరణ ఉపయోగకరంగా ఉంటుంది.

గూగుల్ జీమెయిల్‌లో ఈ ఫీచర్..

వెబ్ వెర్షన్ మాదిరిగానే, గూగుల్ జీమెయిల్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌లలో ట్రాన్స్‌ఫర్  ఫీచర్‌ను అందించబోతోంది. ఈ ఫీచర్ కింద, వినియోగదారులు తమకు ఇష్టమైన భాషలో మెయిల్‌ను అర్థం చేసుకోగలుగుతారు. వినియోగదారు సెట్ చేసిన ప్రాథమిక భాష కాకుండా వేరే భాషలో మెయిల్ వచ్చినట్లయితే, మెయిల్‌ను అనువదించడానికి పాప్-అప్ స్క్రీన్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు 100 కంటే ఎక్కువ భాషల్లో అందుబాటులో ఉన్న మీకు ఇష్టమైన భాషలో మెయిల్ చదవవచ్చు.

మరిన్ని టెక్నాలజీ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి