Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malicious Apps: అలర్ట్.. అలర్ట్.. మీ ఫోన్లో ఈ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి.. లేకుంటే అంతే సంగతులు..

ప్రపంచంలోనే అతిపెద్ద యాప్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటైన గూగుల్ ప్లే స్టోర్ కఠిన నిబంధనలు తీసుకొస్తోంది. గూగుల్ ప్లే స్టోర్ దాదాపు 3 మిలియన్ యాప్‌లు, గేమ్‌లను కలిగి ఉంది. ఇంత పెద్ద ప్లాట్ ఫారంలో వినియోగదారుల భద్రతకు కాపాడటం చాలా ముఖ్యం. అందుకే సరికొత్త విధానాలను, నిబంధనలు విధించింది. వాటిని ఉల్లంఘించిన యాప్ లను ప్లే స్టోర్ నుంచి తొలగిస్తోంది.

Malicious Apps: అలర్ట్.. అలర్ట్.. మీ ఫోన్లో ఈ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి.. లేకుంటే అంతే సంగతులు..
Mobile Apps
Follow us
Madhu

|

Updated on: Aug 22, 2023 | 5:30 PM

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న యాప్ లతో వినియోగదారులు వ్యక్తిగత భద్రత ప్రమాదంలో పడుతోంది. చాలా యాప్ లు వ్యక్తుల డేటాను చోరీ చేసి, నేరాలకు ఊతం ఇస్తున్నాయి. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద యాప్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటైన గూగుల్ ప్లే స్టోర్ కఠిన నిబంధనలు తీసుకొస్తోంది. గూగుల్ ప్లే స్టోర్ దాదాపు 3 మిలియన్ యాప్‌లు గేమ్‌లను కలిగి ఉంది. ఇంత పెద్ద ప్లాట్ ఫారంలో వినియోగదారుల భద్రతకు పెద్ద పీట వేస్తూ సరికొత్త విధానాలను, నిబంధనలు విధించింది. వాటిని ఉల్లంఘించిన యాప్ లను, వినియోగదారుల ఫోన్లకు హానికలిగించే యాప్లను ప్లే స్టోర్ నుంచి తొలగిస్తోంది. ఇలా ఇటీవల 43 హానికరమైన యాప్‌లను గూగుల్ తొలగించింది. ఆ యాప్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఎందుకు తొలగించిందంటే..

సెర్చ్ ఇంజిన్ దిగ్గజం తన ప్లే స్టోర్ నుంచి 43 హానికరమైన యాప్‌లను తొలగించింది. అవి వినియోగదారుల ఫోన్లు ఆఫ్‌లో ఉన్నప్పుడు కూడా ప్రకటనలను లోడ్ చేస్తున్నట్లు గుర్తించింది. మొత్తం 2.5 మిలియన్ల సార్లు డౌన్‌లోడ్ చేసుకున్న యాప్‌లు వినియోగదారు ఫోన్ ఆఫ్‌లో ఉన్నప్పుడు కూడా మొబైల్ డేటా వినియోగించుకుంటున్నట్లు నిర్ధారించి, వాటిని ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఈ యాప్‌లను మొదటగా మెకాఫీ(McAfee)లోని మొబైల్ పరిశోధన బృందం గుర్తించింది. అవి ప్లే స్టోర్ పాలసీలను ఉల్లంఘించాయని గూగుల్ కు నివేదించింది . దీంతో చాలా యాప్‌లు అప్పటి నుంచి ప్లే స్టోర్ తొలగించారు. అయితే కొన్ని యాప్లను వాటి డెవలపర్లు అప్‌డేట్ చేశారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించిన యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకున్న యూజర్లు వెంటనే వాటిని డిలీట్ చేయాలని మెకాఫీ కోరుతోంది.

మెకాఫీ చెబుతోందిదే..

ఇటీవల, మెకాఫీ తన మొబైల్ పరిశోధన బృందం గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ అయిన యాప్‌లను అధ్యయనం చేసిందని మెకాఫీ తన బ్లాగ్ పోస్టులో తెలిపింది.. దీనిలో మొబైల్ స్క్రీన్ ఆఫ్‌లో ఉన్నప్పుడు ఈ యాప్‌లు ప్రకటనలను లోడ్ చేస్తున్నాయని గుర్తించింది. ఇది మొదట్లో వినియోగదారులకు సౌకర్యవంతంగా అనిపించవచ్చని పేర్కొంది. అయితే, ఇది ప్రకటనలు ఎలా ప్రదర్శించబడాలి అనే విషయంలో గూగుల్ ప్లే డెవలపర్ విధానాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమేనని స్ఫష్టం చేసింది. ఇది అదృశ్య ప్రకటనల కోసం చెల్లించే ప్రకటనదారులను మాత్రమే కాకుండా, బ్యాటరీని హరించడం, డేటాను వినియోగించడం, క్లిక్కర్ ప్రవర్తన వల్ల వినియోగదారు ప్రొఫైలింగ్‌కు అంతరాయం కలిగించడం వంటి సంభావ్య ప్రమాదాలను కూడా కలిగిస్తుందని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

తొలగించిన యాప్ లు ఏవంటే..

ప్లే స్టోర్ నుంచి తొలగించిన యాప్‌ల జాబితాలో టీవీ/డీఎండీ ప్లేయర్స్, మ్యూజిక్ డౌన్‌లోడర్స్, న్యూస్ అండ్ క్యాలెండర్ యాప్స్, జిహోసాఫ్ట్ మొబైల్ రికవరీ యాప్, న్యూ లైవ్, లైవ్ మ్యూజిక్ వంటివి ఉన్నాయి. మీరు మీ ఆండ్రాయిడ్ ఫోన్లో 43 యాప్‌లలో ఏదైనా ఇన్‌స్టాల్ చేసి ఉంటే, మీరు వాటిని వెంటనే తొలగించాలి. మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసే యాప్‌ల గురించి జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. విశ్వసనీయ డెవలపర్‌ల నుంచి మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడం అవసరం. ఇన్‌స్టాల్ చేసే ముందు జాగ్రత్తగా పర్మిషన్లను పరిశీలించండి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

IPL 2025 Points Table: తొలి ఓటమితో ఆర్‌సీబీకి బిగ్ షాక్..
IPL 2025 Points Table: తొలి ఓటమితో ఆర్‌సీబీకి బిగ్ షాక్..
RCB vs GT: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..
RCB vs GT: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..
శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!
శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!
కోహ్లీ అహాన్ని దెబ్బ తీసిన రోహిత్ మాజీ ఫ్రెండ్.. అసలెవరీ అర్షద్?
కోహ్లీ అహాన్ని దెబ్బ తీసిన రోహిత్ మాజీ ఫ్రెండ్.. అసలెవరీ అర్షద్?
Video: 105 మీటర్ల సిక్స్‌‌తో సిరాజ్‌ హార్ట్ బ్రేక్ చేసిన సాల్ట్
Video: 105 మీటర్ల సిక్స్‌‌తో సిరాజ్‌ హార్ట్ బ్రేక్ చేసిన సాల్ట్
అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..!
అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..!
తండ్రి కానున్న స్టార్ కమెడియన్.. అట్టహాసంగా భార్య సీమంతం.. ఫొటోస్
తండ్రి కానున్న స్టార్ కమెడియన్.. అట్టహాసంగా భార్య సీమంతం.. ఫొటోస్
కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ ప్లేయర్లు
కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ ప్లేయర్లు
ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు..!
ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు..!
చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?
చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?