Chandrayaan 3 Landing: జాబిల్లికి అత్యంత చేరువలో విక్రమ్.. ఇస్రో విడుదల చేసిన వీడియో ఇదే..
టెన్షన్.. టెన్షన్.. నెల రోజులకు పైగా ఒకటే టెన్షన్.. ఇప్పుడది చివరి అంకానికి చేరుకోవడంతో టెరిఫిక్‌గా మారింది. అదే.. చంద్రయాన్-3 ప్రయోగం.. జాబిల్లికి మరింత చేరువైన విక్రం ల్యాండర్.. మరికొద్ది గంటల్లో ల్యాండ్ కానుండడంతో దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ప్రపంచ దేశాలు వెయ్యి కళ్లతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇంతకీ.. విక్రం ల్యాండర్ ఎప్పుడు, ఎలా ల్యాండ్ కానుంది?.. చంద్రయాన్-3 ప్రయోగం చివరి అంకంపై ఇస్రో ఏమంటోంది?.. ఇస్రో తాజాగా ఓ విడియోను కూడా విడుదల చేసింది..

ఇప్పుడు అందరి దృష్టి చంద్రయాన్-3 మీదే.. చంద్రయాన్-3 ప్రయోగంలో అత్యంత కీలక దశ.. చంద్రుడిపై పరిశోధనలకు రోదసిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 లక్ష్యం దిశగా చివరి అంకానికి చేరుకుంది. జాబిల్లికి కూతవేటు దూరంలోనే ఉన్న చంద్రయాన్ విక్రం ల్యాండర్.. మరికొద్ది గంటల్లో చంద్రుడిపై ల్యాండ్ కాబోతోంది. అపరూప ఘట్టాన్ని ఆవిష్కరించేందుకు ఇస్రో ఏర్పాట్లు చేసింది. దానిలో భాగంగా.. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ చంద్రుడికి మరింత చేరువైంది. అయితే.. జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యే క్రమంలో చివరి 17 నిమిషాలు అత్యంత కీలకమన్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ప్రస్తుతం ల్యాండింగ్ మాడ్యూల్‌ను నిరంతరం తనిఖీ చేస్తూ.. నిర్దేశిత ల్యాండింగ్ ప్రదేశంలో దిగేందుకు సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్నట్లు ఇస్రో తెలిపింది. సూర్యుడి వెలుగు రాగానే సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. రేపు సాయంత్రం సుమారు 5.45 గంటల తర్వాత ల్యాండింగ్ ప్రక్రియ మొదలుకానున్నట్లు అంచనా వేస్తున్నారు.
ఆగస్టు 23న భారతదేశం చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్‌కు ముందు, దాని ల్యాండర్‌లో అమర్చిన కెమెరా చంద్రుని చిత్రాలను తీసింది. ఇస్రో ‘ల్యాండర్ ఇమేజర్ కెమెరా 4’ నుండి తీసిన చిత్రాలను చిన్న వీడియో ద్వారా ట్వీట్ చేయడం ద్వారా విడుదల చేసింది.
వీడియోలో, చంద్రుని ఉపరితలం చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అందులో చాలా చోట్ల క్రేటర్స్ (గుంటలు) కూడా కనిపిస్తాయి. ఇస్రో అందించిన వివరాల ప్రకారం, ఈ చిత్రాలు ఆదివారం (ఆగస్టు 20, 2023) తీయబడ్డాయి.
ల్యాండర్ ఇమేజర్ కెమెరా నుండి చంద్రుని వీడియో 4..
…. and The moon as captured by the Lander Imager Camera 4 on August 20, 2023.#Chandrayaan_3 #Ch3 pic.twitter.com/yPejjLdOSS
— ISRO (@isro) August 22, 2023
దక్షిణ ధృవం వద్ద చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్‌పై ప్రపంచం మొత్తం దృష్టి ..
చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అవుతుంది. ఇది భారతదేశం మూడవ చంద్ర మిషన్, దీని మీద ప్రపంచం మొత్తం దృష్టి కేంద్రీకరించబడింది ఎందుకంటే అంతకుముందు ఆగస్టు 20 ఆదివారం రష్యా చంద్ర మిషన్ ‘లూనా-25’ ప్రమాదం కారణంగా విఫలమైంది. అతను కూడా దక్షిణ ధ్రువంలో దిగవలసి వచ్చింది. చంద్రుని ఈ భాగాన్ని ఇప్పటివరకు ఏ దేశం చేరుకోలేకపోయింది. చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతమైతే, దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ పరంగా ఈ ఘనత సాధించిన మొదటి దేశంగా భారత్ అవుతుంది.
మరిన్ని టెక్నాలజీ న్యూస్ కోసం