AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget Friendly 5G Phones : అందుబాటు ధరల్లో ఉన్న 5జీ స్మార్ట్ ఫోన్లు ఇవే.. మీరూ ఓ లుక్కెయ్యండి

ఇప్పటికే కొన్ని నగరాల్లో టెలికాం ఆపరేటర్లు 5 జీ నెట్ వర్క్‌ను అందిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం 5 జీ ఫోన్లపై మార్కెట్‌లో క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా టెలికాం ఆపరేటర్లు 4జీ ధరలకే 5 జీ సేవలను అందించడంతో మరింత ప్రాచుర్యం పెరిగింది.

Budget Friendly 5G Phones : అందుబాటు ధరల్లో ఉన్న 5జీ స్మార్ట్ ఫోన్లు ఇవే.. మీరూ ఓ లుక్కెయ్యండి
Smartphones
Nikhil
|

Updated on: Mar 29, 2023 | 5:00 PM

Share

5 జీ అనేది స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో ఓ కొత్త ట్రెండ్. ప్రతి ఫోన్‌లో కచ్చితంగా 5జీ టెక్నాలజీ ఉండేలా స్మార్ట్ ఫోన్ తయారీదారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని నగరాల్లో టెలికాం ఆపరేటర్లు 5 జీ నెట్ వర్క్‌ను అందిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం 5 జీ ఫోన్లపై మార్కెట్‌లో క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా టెలికాం ఆపరేటర్లు 4జీ ధరలకే 5 జీ సేవలను అందించడంతో మరింత ప్రాచుర్యం పెరిగింది. అయితే ఇప్పటికే ఫోన్స్ ఉన్న వారు 5జీ అధునాతన స్పీడ్‌కను అందుకోడానికి తక్కువ ధరల్లో అందుబాటులో ఉండే 5 జీ ఫోన్ల గురించి చెక్ చేస్తున్నారు. కాబట్టి భారత్‌లో బడ్జెట్ ధరల్లో అందుబాటులో ఉండే 5 జీ ఫోన్స్‌పై ఓ లుక్కేద్దాం.

రెడ్‌మీ నోట్ 11 టీ 5జీ

ఈ ఫోన్ 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. మీడియా టెక్ డైమన్సిటీ 810 చిప్ సెట్ ప్రాసెసర్‌తో వచ్చే ఈ ఫోన్ స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా 4 జీబీ ర్యామ్ ఈ ఫోన్ ప్రత్యేకత. అలాగే 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఎక్కువ సేపు ఫోన్ పని చేస్తుంది. అలాగే 48 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా వల్ల ఫొటో లవర్స్ ఈ ఫోన్ అధికంగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఈ ఫోన్ రూ.18000 ధరలో అందుబాటులో ఉంటుంది. 

పోకో ఎం4 ప్రో

6.67 అంగుళాల ఫుల్ డిస్‌ప్లేతో వచ్చే ఈ ఫోన్లో మీడియా టెక్ డైమెన్సిటీ 810 చిప్ సెట్‌తో వస్తుంది. అలాగే 6 జీబీ ర్యామ్‌తో వచ్చే ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అలాగే 48 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకత. ఈ ఫోన్ రూ.13,000 ధరలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

సామ్‌సంగ్ ఎఫ్ 23

6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్ ప్లేతో వచ్చే ఈ ఫోన్‌లో మీడియా టెక్ డైమెన్సిటీ 700 చిప్ సెట్ ప్రాసెసర్‌తో వస్తుంది. అలాగే 6 జీబీ ర్యామ్ తో పాటు 5000 ఎంఏహెచ్ బ్యాటర్ ఈ ఫోన్ ప్రత్యేకత. అలాగే 48 ఎంపీ ప్రైమరీ కెమెరాతో 13 ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఫొటో లవర్స్ ఈ ఫోన్ విపరీతంగా ఆకట్టుకుంటుందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. అన్ని తగ్గింపులతో కలిపి ఈ ఫోన్ రూ.14,000 ధరకు అందుబాటులో ఉంటుంది. 

మోటోరోలా మోటో జీ 71 5జీ

6.4 అంగుళాల ఎమో ఎల్‌ఈడీ డిస్‌ప్లేతో వచ్చే ఈ ఫోన్‌లో స్నాప్ డ్రాగన్ 690 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే  ఈ ఫోన్‌లో వచ్చే 6 జీబీ ర్యామ్ వల్ల ఈ ఫోన్ చాలా స్పీడ్‌గా పని చేస్తుంది. అలాగే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వల్ల ఎక్కువ సేపు చార్జింగ్ చింత లేకుండా ఉంటుంది. అలాగే 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా వినియోగదారులను ఆకట్టుకుంటాయి. ఈ ఫోన్ అన్ని తగ్గింపులతో రూ.15,000 ధరకు వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది 

రెడ్‌మీ 11 ప్రైమ్ 5జీ

6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వచ్చే ఈ ఫోన్లో మీడియా టెక్ 810 ప్రాసెసర్‌తో వస్తుంది. అలాగే 4 జీబీ ర్యామ్‌తో పాటు 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. అలాగే 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్‌కు ఉన్న అదనపు ప్రత్యేకతలు. ఈ ఫోన్ రూ.13,000కు వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!