Smartwatches: తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లతో స్మార్ట్ వాచ్‌లు.. వీటిని ఓ లుక్కేయండి.. !

జనాలు అనువైన బడ్జెట్లో ఉండే స్మార్ట్ వాచ్ ల కోసం వెతుకుతున్నారు. స్టైలిష్ డిజైన్, అధిక పనితీరుతో పాటు మంచి ఫీచర్లు ఉండేలా చూసుకుంటున్నారు. సాధారణంగా అలాంటి స్మార్ట్ వాచ్ ల ధరలు ఎక్కువగానే ఉంటాయి. అయితే కొన్ని బ్రాండ్లు మాత్రం అద్భుతమైన ఫీచర్లను అనువైన ధరలోనే అందిస్తున్నాయి. అటువంటి బ్రాండ్లలో ఫైర్ బోల్ట్ ఒకటి.

Smartwatches: తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లతో స్మార్ట్ వాచ్‌లు.. వీటిని ఓ లుక్కేయండి.. !
Smartwatch
Follow us
Madhu

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 20, 2023 | 3:08 PM

ప్రస్తుత దైనందిన జీవితంలో స్మార్ట్ వాచ్ కూడా భాగమైపోయాయి. చేతిలో స్మార్ట్ ఫోన్ మాదిరిగానే ప్రతి ఒక్కరి మణికట్టుకు స్మార్ట్ వాచ్ ఉంటోంది. వీటిల్లో అత్యాధునిక ఫీచర్లు, హెల్త్, ఫిట్ నెస్ ట్రాకర్లు వినియోగదారులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. అయితే కొన్ని స్మార్ట్ వాచ్ ల ధరలు అధికంగా ఉంటున్నాయి. దీంతో జనాలు అనువైన బడ్జెట్లో ఉండే స్మార్ట్ వాచ్ ల కోసం వెతుకుతున్నారు. స్టైలిష్ డిజైన్, అధిక పనితీరుతో పాటు మంచి ఫీచర్లు ఉండేలా చూసుకుంటున్నారు. సాధారణంగా అలాంటి స్మార్ట్ వాచ్ ల ధరలు ఎక్కువగానే ఉంటాయి. అయితే కొన్ని బ్రాండ్లు మాత్రం అద్భుతమైన ఫీచర్లను అనువైన ధరలోనే అందిస్తున్నాయి. అటువంటి బ్రాండ్లలో ఫైర్ బోల్ట్ ఒకటి. ఈ బ్రాండ్ నుంచి రూ. 2000 అంతకంటే తక్కువ ధరకే విభిన్న రకాల స్మార్ట్ వాచ్ లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

ఫైర్-బోల్ట్ కొత్తగా వోగ్ లార్జ్ స్మార్ట్ వాచ్‌..

ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ వాచ్. దీనిలో 2.05 అంగుళాల, 428*518 పిక్సెల్ రిజల్యూషన్‌తో డిస్‌ప్లే ఉంటుంది. ఆల్ వేస్ ఆన్ డిస్ ప్లే ఉంటుంది. స్టెయిన్‌లెస్ స్టీల్ మెష్ స్ట్రాప్ తో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.500 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లు, ఎన్ఎఫ్సీ యాక్సెస్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఐపీ68 రెసిస్టెన్స్‌తో వస్తుంది. నావిగేషన్ కోసం రౌండేబుల్ క్రౌన్, బహుళ స్పోర్ట్స్ మోడ్‌లు ఉంటాయి. 260 ఎంఏహెచ్ బ్యాటరీ ఒకే చార్జ్‌పై 6 రోజులు పనిచేస్తుంది. ఈ వాచ్, మ్యూజిక్ ప్లేయర్ ని సమర్థంగా నిర్విర్తిస్తుంది. దీని ధర ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్లో రూ. 1999గా ఉంది.

ఫైర్-బోల్ట్ ఫినిక్స్ అల్ట్రా లగ్జరీ స్టెయిన్‌లెస్ స్టీల్, బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్..

సరసమైన ధరలో లభించే బెస్ట్ స్మార్ట్ వాచ్ లలో ఇదీ ఒకటి. అద్భుతమైన టీఎఫ్టీ కలర్ ఫుల్ టచ్ స్క్రీన్, 240*240 పిక్సెల్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఇది సొగసైన, స్టైలిష్ డిస్‌ప్లేను అందిస్తుంది. 320 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ను అందిస్తుంది. స్టెయిన్‌లెస్ స్టీల్ మాగ్నెటిక్ క్లోజర్ పట్టీలతో మన్నికైన మెటల్ బాడీని కలిగి ఉంటుంది. బ్లూటూత్ కాలింగ్ సౌలభ్యాన్ని అందిస్తుంది. దానితో పాటు 7 రోజుల వరకు అద్భుతమైన బ్యాటరీ జీవితకాలం ఉంటుంది. 120+ స్పోర్ట్స్ మోడ్‌లు, ఏఐ వాయిస్ అసిస్టెంట్, మణికట్టుపై గేమింగ్‌ కు అవకాశం ఇస్తుంది. నోటిఫికేషన్‌లను వాచ్ లో చూడొచ్చు. సంగీతాన్ని నియంత్రించొచ్చు. దీని ధర అమెజాన్లో రూ. 1,999గా ఉంది.

ఇవి కూడా చదవండి

ఫైర్ బోల్ట్ టాక్ 2 బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్..

దీనిలో స్పష్టమైన 1.28 అంగుళాల 240*240 పిక్సెల్ రిజల్యూషన్ కలిగిన స్మార్ట్ వాచ్ వస్తుంది. 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో టీఎఫ్టీ ఎల్సీడీ ఫుల్ టచ్ డిస్ప్లే వస్తుంది. ఈ వాచ్ 2డీ హై హార్డ్‌నెస్ గ్లాస్ నుంచి సూపర్ ప్రొటెక్షన్‌తో విజువల్ ట్రీట్‌ను అందిస్తుంది. బ్లూటూత్ కాలింగ్‌తో ఫీచర్ ఉంటుంది. ఒకే ఛార్జ్‌తో బ్లూటూత్ కాలింగ్ కాలింగ్ అయితే మూడు రోజుల వరకు బ్లూటూత్ లేకుండా అయితే ఎనిమిది రోజుల బ్యాటరీ లైఫ్ ఉంటుంది. డ్యూయల్-బటన్ సాంకేతికత సామర్థ్యాన్ని పెంచుతుంది. అయితే అంతర్నిర్మిత మైక్, స్పీకర్ హెచ్డీ కాలింగ్, సంగీత ఆనందాన్ని అనుమతిస్తుంది. 60 స్పోర్ట్స్ మోడ్‌లు, హెల్త్ ట్రాకింగ్, వాయిస్ అసిస్టెంట్‌తో వస్తుంది. దీని ధర అమెజాన్లో రూ. 1,299గా ఉంది.

ఫైర్-బోల్ట్ ఫీనిక్స్ ప్రో బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్..

దీనిలో 1.39 అంగుళాల టీఎఫ్టీ కలర్ ఫుల్ టచ్ స్క్రీన్ 240*240 పిక్సెల్ హై రిజల్యూషన్ వస్తుంది. అబ్బురపరిచే 280 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను అందిస్తుంది. గరిష్టంగా ఏడు రోజుల బ్యాటరీ జీవితం (బ్లూటూత్ కాలింగ్ లేకుండా), బ్లూటూత్ కాలింగ్‌తో నాలుగు రోజులు అందిస్తుంది. మెటల్ బాడీ మన్నికను అందించడమే కాకుండా గ్లోస్ ఫినిషింగ్‌ను అందిస్తుంది. 120+ స్పోర్ట్స్ మోడ్‌లు, హెల్త్ ట్రాకింగ్, ప్రత్యేకమైన బ్రీత్ ఫంక్షన్‌తో మీ ఫిట్‌నెస్ ప్రయాణాన్ని ట్రాక్ చేయొచ్చు. స్మార్ట్‌ఫోన్ నోటిఫికేషన్‌లతో కనెక్ట్ అయి ఉండొచ్చు. సంగీతాన్ని నియంత్రించొచ్చు. ఏఐ వాయిస్ అసిస్టెంట్ ఒకే ట్యాప్‌తో పనులను సులభతరం చేస్తుంది. ఈ వాచ్ ధర అమెజాన్ సైట్లో రూ. 1199గా ఉంది.

ఫైర్-బోల్ట్ ఆస్టరాయిడ్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే స్మార్ట్ వాచ్..

ఇది 466*466 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో శక్తివంతమైన విజువల్స్‌ను అందిస్తుంది. పగటి పూట సూర్యకాంతిలో కూడా అద్భుతమైన దృశ్యమానతను అందిస్తుంది. 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో సూపర్ అమోల్డ్ డిస్ప్లేను ఇది కలిగి ఉంటుంది. ఎల్లప్పుడూ ఆన్ డిస్‌ప్లే ఫీచర్ కూడా ఉంటుంది. హృదయ స్పందన రేటు, నిద్ర ట్రాకింగ్‌తో సహా కచ్చితమైన ఆరోగ్య పర్యవేక్షణ మీ శ్రేయస్సును నిర్ధారిస్తుంది. 123 స్పోర్ట్స్ మోడ్‌లు ఉంటాయి. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్, నోటిఫికేషన్లు, వాయిస్ సహాయంతో నియంత్రణ వంటి ఫీచర్లు ఉంటాయి. దీని ధర అమెజాన్లో రూ. 1499గా ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..