Brain Tunnels: మెదడులో ‘రహస్య సొరంగాలు’.. పరిశోధనల ద్వారా గుర్తించిన శాస్త్రవేత్తలు

Brain Tunnels: మానవ మెదడులో కూడా 'రహస్య టన్నెల్స్' ఉన్నాయి. వీటిని 2018 లో మాత్రమే కనుగొన్నారు వైద్య నిపుణులు. అయితే వాటి..

Brain Tunnels: మెదడులో 'రహస్య సొరంగాలు'.. పరిశోధనల ద్వారా గుర్తించిన శాస్త్రవేత్తలు
Follow us

| Edited By: Narender Vaitla

Updated on: Mar 21, 2022 | 7:42 AM

Brain Tunnels: మానవ మెదడులో కూడా ‘రహస్య టన్నెల్స్’ ఉన్నాయి. వీటిని 2018 లో ఎలుకలు, మానవునిలో మాత్రమే కనుగొన్నారు శాస్త్రవేత్తలు. అయితే వాటి పని ఏమిటో ఇప్పుడు తెరపైకి వచ్చింది. వీటిని సీక్రెట్ టన్నెల్స్ (Secret Tunnels) అని పిలుస్తారు. ఈ సొరంగాలు మెదడు (Brain)ను పుర్రెతో అనుసంధానించడానికి పని చేస్తాయి. దీనిపై బోస్టన్‌లోని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్, హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధనలు చేశాయి. పరిశోధనలో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మెదడులో ఉండే ఈ రహస్య సొరంగాలు చాలా రకాలుగా పనిచేస్తాయని వీటిని కనుగొన్న పరిశోధకులు చెబుతున్నారు. ఉదాహరణకు శరీరంలోని వ్యాధులతో పోరాడే రోగనిరోధక కణాలు, ఎముక మజ్జ కణాలు శరీరంలో ప్రసరణను సులభతరం చేస్తాయి. మెదడులో ఏ రకమైన సమస్య వచ్చినా, వీటి వల్ల ప్రత్యేక రసాయనం చేరి ఉపశమనం కలిగిస్తుంది.

మెదడులో ప్రసరించే రోగనిరోధక కణాలను న్యూట్రోఫిల్స్ అంటారు. అయితే అవి మెదడులో ఎలా తిరుగుతాయి అనేది శాస్త్రవేత్తలలో పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి, శాస్త్రవేత్తలు దానిపై పరిశోధన ప్రారంభించారు. సైన్స్ అలర్ట్ నివేదిక ప్రకారం.. శరీరంలో ఏదైనా తప్పు జరిగినప్పుడు లేదా గాయం సంభవించినప్పుడు ఈ న్యూట్రోఫిల్స్ మొదట సక్రియం అవుతాయి. అవి మెదడులో ఎక్కడ తిరుగుతాయో తెలుసుకోవడానికి, శాస్త్రవేత్తలు ఫ్లోరోసెంట్ రంగులో న్యూట్రోఫిల్స్‌కు రంగు వేశారు. ఇది వారి సర్క్యులేషన్ రూట్‌ని వెల్లడించింది. మెదడులోని ప్రత్యేక మార్గం ద్వారా ఈ కణాలు బయటకు వస్తాయని నివేదికలో వెల్లడైంది.

మానవులలో రహస్య సొరంగాల పనిని అర్థం చేసుకోవడానికి, శాస్త్రవేత్తలు రోగిలో నొప్పి, వాపు, మెదడు స్ట్రోక్, మెనింజైటిస్ పరిస్థితిని సృష్టించారు. అటువంటి పరిస్థితిలో ప్రతి పరిస్థితిలో ప్రతిసారీ ఈ రహస్య సొరంగాల ద్వారా శరీరంలో న్యూట్రోఫిల్స్ ప్రసరించడం కనిపించింది. ఇలా శాస్త్రవేత్తలు నిర్వహించిన పలు పరిశోధనల ద్వారా మానవుని మెదడులో రహస్య టన్నెల్స్ ఉంటాయని గుర్తించారు.

సాధారణంగా ఎర్ర రక్తకణాళు పుర్రె లోపలి నుంచి ఎముక మజ్జ వరకు ఈ మార్గాల ద్వారా ప్రవహిస్తాయి. కానీ స్ట్రోక్‌ విషయంలో అవి మజ్జ నుంచి మెదడుకు వ్యతిరేక దిశలో న్యూట్రోఫిల్స్‌ను రవాణా చేయడానికి సమీకరించబడ్డాయి. అయితే ఇది ఎలుకలలో గుర్తించారు. మానవులకు ఇలాంటివి ఏమైనా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి పరిశోధకులు శస్త్రచికిత్స నుంచి మానవ పుర్రెపై పరిశోధన నిర్వహించారు. ఈ పరిశోధనలకు సంబంధించిన అంశాలు నేచర్‌ న్యూరోసైన్స్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.

ఇవి కూడా చదవండి:

Curry Leaves: కూరలో కరివేపాకు అని తీసిపారేస్తున్నారా.. అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే

Specialised Fibre: శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ.. మీ హార్ట్‌ రేట్‌ తెలుసుకోవాలా.. అయితే ఈ డ్రస్‌ వేసుకోండి