Digital Literacy: ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత.. కనీసం ఈ-మెయిల్ అటాచ్‌మెంట్ పంపలేరా..?

తెలంగాణలోని 50 శాతానికి పైగా యువత అటాచ్‌మెంట్‌తో కూడిన ఇమెయిల్‌ను పంపలేరని ఇటీవల ఓ నివేదిక షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. అలాగే కేవలం 14.27 శాతం మంది యువత మాత్రమే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఎలక్ట్రానిక్ ప్రెజెంటేషన్‌ను సృష్టించగలరని ఇటీవల విడుదల చేసిన ఇండియా ఎంప్లాయ్‌మెంట్ రిపోర్ట్ 2024 వెల్లడించింది. తెలంగాణలో యువత 2021 నాటికి 9.9 మిలియన్లుగా అంచనా వేశారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ (ఐహెచ్‌డీ) సంయుక్తంగా ప్రచురించిన ఈ నివేదిక దేశంలోని 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు  ఉన్న యువతకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) నైపుణ్యాలను కొలుస్తుంది.

Digital Literacy: ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత.. కనీసం ఈ-మెయిల్ అటాచ్‌మెంట్ పంపలేరా..?
Mobile
Follow us

|

Updated on: Mar 29, 2024 | 6:55 PM

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ భారతదేశంలోని ప్రముఖ టెక్ హబ్‌లలో ఒకటిగా ఉంది. టెక్నాలజీను అందిపుచ్చుకుని ప్రపంచ దేశాలను హైదరాబాద్‌ను ఆకర్షిస్తుంది. అయితే తెలంగాణలోని 50 శాతానికి పైగా యువత అటాచ్‌మెంట్‌తో కూడిన ఇమెయిల్‌ను పంపలేరని ఇటీవల ఓ నివేదిక షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. అలాగే కేవలం 14.27 శాతం మంది యువత మాత్రమే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఎలక్ట్రానిక్ ప్రెజెంటేషన్‌ను సృష్టించగలరని ఇటీవల విడుదల చేసిన ఇండియా ఎంప్లాయ్‌మెంట్ రిపోర్ట్ 2024 వెల్లడించింది. తెలంగాణలో యువత 2021 నాటికి 9.9 మిలియన్లుగా అంచనా వేశారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ (ఐహెచ్‌డీ) సంయుక్తంగా ప్రచురించిన ఈ నివేదిక దేశంలోని 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు  ఉన్న యువతకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) నైపుణ్యాలను కొలుస్తుంది. తెలంగాణతో పోల్చితే మిగతా దక్షిణాది రాష్ట్రాలు మెరుగ్గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా ఎంప్లాయ్‌మెంట్ రిపోర్ట్ 2024కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

అటాచ్‌మెంట్‌లతో కూడిన ఈ-మెయిల్‌లను పంపే సామర్థ్యం ఉన్న వారిలో 73.34 శాతం మంది కేరళ యువత అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత 55.33 శాతంతో తమిళనాడు నిలిచింది. జాతీయంగా అయితే సంఖ్యలు ఆకట్టుకోలేకపోయాయి. దాదాపు నాలుగింట మూడొంతుల మంది యువత అటాచ్ చేసిన ఫైల్‌తో ఈ-మెయిల్ పంపలేకపోయారు. అయితే 90 శాతం కంటే ఎక్కువ మంది స్ప్రెడ్‌షీట్‌లలో సూత్రాలను ఉపయోగించలేరని తేలింది. అలాగే ప్రెజెంటేషన్ సాఫ్ట్‌వేర్‌తో పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌లు చేయలేరు లేదా ప్రత్యేకమైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని ఉపయోగించి కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను రాయలేరని నివేదిక తేల్చింది. అయితే దిగువన అస్సాం, ఉత్తరప్రదేశ్, బీహార్ ఉన్నాయి. ఈ శాతాలు వరుసగా 13.55 శాతం, 14.31శాతం, 14.66 శాతంగా ఉన్నాయి.

తెలంగాణలో పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్లు, ఎంఎస్ ఎక్సెల్ వినియోగం విషయానికి వస్తే కచ్చితంగా సమస్యగా ఉందని నివేదికలో తేలింది. ఈ అంశాలను పాఠశాల పాఠ్యాంశాల్లో భాగంగా చేస్తే తప్ప ఈ పరిస్థితి మారదని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే, చాలా పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్ ఉన్నప్పటికీ సబ్జెక్టును బోధించడానికి నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు లేరని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్ అన్నారు. కంప్యూటర్ల వినియోగంలో పట్టణ ప్రాంత పిల్లల కంటే గ్రామీణ విద్యార్థులు చాలా వెనుకబడి ఉన్నారని ఆయన సూచించారు . తెలంగాణలోని 53.83 శాతం మంది యువత ఫైల్, ఫోల్డర్‌ను కాపీ లేదా మూవ్ చేయగలరని, 50.4 శాతం మంది పత్రంలో సమాచారాన్ని టూల్స్ కాపీ, పేస్ట్ చేయగలరని నివేదికలో తేలింది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..