AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio Plans: సరికొత్త రీచార్జ్ ప్లాన్ ప్రకటించిన జియో.. డైలీ డేటాతో పాటు స్విగ్గీ వన్ లైన్ సబ్‌స్క్రిప్షన్

జియో రూ. 866 ధరతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ సరికొత్త ప్లాన్‌లో స్విగ్గీ వన్ లైట్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఆఫర్ చేస్తుంది. వినియోగదారులు ఈ యాప్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేసినప్పుడు వారు ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు. జియో ప్రతినిధులు చెబుతున్న ప్రకారం  ఈ ప్లాన్ ద్వారా జియో ప్రీపెయిడ్ కస్టమర్‌లు నిరంతరాయంగా కమ్యూనికేషన్‌ను పొందవచ్చు.

Jio Plans: సరికొత్త రీచార్జ్ ప్లాన్ ప్రకటించిన జియో.. డైలీ డేటాతో పాటు స్విగ్గీ వన్ లైన్ సబ్‌స్క్రిప్షన్
Jio
Nikhil
|

Updated on: Mar 28, 2024 | 5:15 PM

Share

టెలికాం రంగంలో పెరిగిన పోటీ నేపథ్యంలో కొత్త కస్టమర్లను ఆకర్షించే లక్ష్యంతో రిలయన్స్ జియో రూ. 866 ధరతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ సరికొత్త ప్లాన్‌లో స్విగ్గీ వన్ లైట్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఆఫర్ చేస్తుంది. వినియోగదారులు ఈ యాప్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేసినప్పుడు వారు ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు. జియో ప్రతినిధులు చెబుతున్న ప్రకారం  ఈ ప్లాన్ ద్వారా జియో ప్రీపెయిడ్ కస్టమర్‌లు నిరంతరాయంగా కమ్యూనికేషన్‌ను పొందవచ్చు. ఆహారం, కిరాణా సామగ్రి, మరిన్నింటి కోసం స్విగ్గీకు సంబంధించిన ఆన్-డిమాండ్ ఉచిత డెలివరీకి యాక్సెస్ పొందవచ్చు. జియో సరికొత్త ప్లాన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

జియో రూ.866 ప్లాన్ ప్రయోజనాలు

  • జియో కొత్త రూ. 866 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రతిరోజూ 2 జీబీ 5జీ  డేటాను అందిస్తుంది.
  • డేటాతో పాటు కొత్త ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్ ప్రయోజనాలను పొందవచ్చు. 
  • జియో రూ.866 ప్లాన్ 84 రోజుల వాలిడిటీని అందిస్తుంది.
  • జియోకు సంబంధించిన స్వాగత ఆఫర్‌లో భాగంగా వినియోగదారులు అపరిమిత 5G డేటాను కూడా పొంవచ్చు. 
  • ఈ ప్లాన్ ద్వారా మూడు నెలల స్విగ్గీ వన్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. సాధారణంగా స్విగ్గీ వన్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌ విలువ రూ. 600. కొత్త రూ. 866 ప్రీపెయిడ్ ప్లాన్‌తో దీన్ని ఉచితంగా పొందవచ్చు. 
  • స్విగ్గీ వన్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌ ద్వారా రూ. 149 కంటే ఎక్కువ ఆహార ఆర్డర్‌ల కోసం వినియోగదారులు 10 ఉచిత హోమ్ డెలివరీలను ఆస్వాదించవచ్చు.
  • ఇన్‌స్టామార్ట్ రూ. 199 కంటే ఎక్కువ ఆర్డర్‌ల కోసం వినియోగదారులు 10 ఉచిత హోమ్ డెలివరీలను కూడా పొందవచ్చు.
  • రద్దీ సమయాల్లో కూడా ఆహారం, ఇన్‌స్టామార్ట్ డెలివరీలు రెండింటికీ అదనపు ఛార్జీలు ఉండవు.
  • ముఖ్యంగా 20,000 కంటే ఎక్కువ రెస్టారెంట్‌లలో వారి సాధారణ ఆఫర్‌ల పైన 30 శాతం వరకు అదనపు తగ్గింపులను పొందవచ్చు.
  • రూ. 60 కంటే ఎక్కువ ఉన్న జెనీ డెలివరీలు 10 శాతం తగ్గింపుతో వస్తాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్