AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OnePlus Nord CE 4: లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఎలా ఉండనున్నాయంటే..

ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన ఫ్లూయిడ్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 93.4 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో ఈ ఫోన్‌ స్క్రీన్ సొంతం. ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో పవర్‌ ఫుల్‌ ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌ను అందించానున్నారు. 8జీబీ ర్యామ్‌తో రానున్న ఈ ఫోన్‌లో వర్చువల్‌గా ర్యామ్‌ను...

OnePlus Nord CE 4: లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఎలా ఉండనున్నాయంటే..
Oneplus Nord Ce 4
Narender Vaitla
|

Updated on: Mar 29, 2024 | 7:10 AM

Share

వన్‌ప్లస్ బ్రాండ్‌కు భారత్‌లో మంచి క్రేజ్‌ ఉన్న విషయం తెలిసిందే. మొదట్లో ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ వచ్చిన వన్‌ప్లస్‌ ఆ తర్వాత బడ్జెట్‌, మిడ్ రేంజ్‌ బడ్జెట్‌లో ఫోన్‌లను లాంచ్‌ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో మిడ్ రేంజ్‌ బడ్జెట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు వన్‌ప్లస్ సన్నాహాలు చేస్తోంది. వన్‌ప్లస్ నార్డ్‌ సీఈ 4 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తోంది. ఏప్రిల్‌ 1వ తేదీన భారత్‌లో లాంచ్‌ కానున్న ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన ఫ్లూయిడ్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 93.4 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో ఈ ఫోన్‌ స్క్రీన్ సొంతం. ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో పవర్‌ ఫుల్‌ ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌ను అందించానున్నారు. 8జీబీ ర్యామ్‌తో రానున్న ఈ ఫోన్‌లో వర్చువల్‌గా ర్యామ్‌ను మరో 8 జీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇందులోని ప్రాసెసర్‌ మల్టీ టాస్కింగ్‌కు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ఒకేసారి 15 యాప్‌లు ఓపెన్‌ చేసి కూడా వాటిని యాక్సెస్ చేసకోవచ్చు. ఇక ఈ ఫోన్‌లో 100 వాట్స్‌ సూపర్ వూక్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5500 ఎమ్‌ఏహెచ్‌తో కూడిన పవర్‌ఫుల్‌ బ్యాటరీని ఇవ్వనున్నారు. ఈ ఫోన్‌ కేవలం 29 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జ్‌ పూర్తవుతుందని కంపెనీ చెబుతోంది.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించనున్నారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో కూడిన 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ-600 ప్రైమరీ సెన్సార్‌ను అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఇపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేయనుంది. ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌ బేస్ వేరియంట్ ధర రూ. 25వేలుగా ఉండొచ్చని అంచనా. ఏప్రిల్‌ 1వ తేదీన దీనిపై క్లారిటీ రానుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు