- Telugu News Photo Gallery Technology photos Whatsapp developing a new AI Based feature for image editing
Whatsapp: వాట్సాప్ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్ కోసం..
వాట్సాప్.. ఈ యాప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ ఇదే. ఇంతలా యూజర్లను ఆకర్షిస్తూ దూసుకుపోతున్న వాట్సాప్ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఇంతకీ ఏంటీ ఫీచర్.? దీనితో కలిగే ప్రయోజనం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Mar 28, 2024 | 9:06 PM

ఈ కొత్త ఫీచర్ సహాయంతో ఎక్స్‌పాండ్, రిఫైన్, బ్యాక్‌డ్రాప్ వంటి ఆప్షన్స్‌ను అందించనున్నారు. ఈ ఫీచర్ సహాయంతో బ్యాగ్రౌండ్ ఫొటోలను మార్చుకోవచ్చు.

సాధారణంగా వాట్సాప్‌లో ఫొటోలను పంపించుకునే సమయంలో ఫిల్టర్స్ సహాయంతో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంది. అయితే తాజాగా తీసుకొస్తున్న ఫీచర్ సహాయంతో ఫొటోలను తేలికగా ఎడిట్ చేసుకోవచ్చు.

యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తున్న వాట్సాప్ తాజాగా మరో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ఏఐ ఆధారిత ఈ ఫీచర్ ఉపయోగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మార్కెట్లో ఎంత పోటీ ఉన్నా వాట్సాప్‌కు ఆదరణ తగ్గకపోవడానికి ప్రధాన కారణం ఇందులోని ఫీచర్స్.

వాట్సాప్ తీసుకొస్తున్న ఈ కొత్త ఫీచర్ సహాయంతో స్టైళ్లను మెరుగు పరచుకోవచ్చు, అలాగే ఫొటో సైజ్‌లను మార్చుకోవ్చు. ప్రస్తుతం డెవలపింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు.




