ఐ ఫోన్‌ 11 సిరీస్‌ ఫీచర్స్‌

ప్రపంచ టెక్‌ దిగ్గజం ఆపిల్‌ ఐ ఫోన్‌ 11  సిరీస్‌ను లాంచ్‌ చేసింది. ఐ ఫోన్ 11, ఐ ఫోన్ 11 ప్రో, 11 ప్రో మాక్స్‌లను కాలిఫోర్నియా సంస్థ ప్రధాన కార్యాలయంలో స్టీవ్ జాబ్స్ ధియేటర్‌లో ఆవిష్కరించారు. తక్కువ వెలుగులోనూ స్పష్టంగా చిత్రాలు తీయగలిగే మెషిన్ లెర్నింగ్ సాంకేతికతను ఐ ఫోన్ 11 ప్రో, ప్రో మాక్స్‌లో అమర్చారు. అత్యంత శక్తివంతమైన ఏ 13 బయోనిక్‌ సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఈ ఫోన్ల ప్రత్యేకతని సంస్థ […]

  • Pardhasaradhi Peri
  • Publish Date - 8:21 pm, Wed, 18 September 19
ఐ ఫోన్‌ 11 సిరీస్‌ ఫీచర్స్‌

ప్రపంచ టెక్‌ దిగ్గజం ఆపిల్‌ ఐ ఫోన్‌ 11  సిరీస్‌ను లాంచ్‌ చేసింది. ఐ ఫోన్ 11, ఐ ఫోన్ 11 ప్రో, 11 ప్రో మాక్స్‌లను కాలిఫోర్నియా సంస్థ ప్రధాన కార్యాలయంలో స్టీవ్ జాబ్స్ ధియేటర్‌లో ఆవిష్కరించారు. తక్కువ వెలుగులోనూ స్పష్టంగా చిత్రాలు తీయగలిగే మెషిన్ లెర్నింగ్ సాంకేతికతను ఐ ఫోన్ 11 ప్రో, ప్రో మాక్స్‌లో అమర్చారు. అత్యంత శక్తివంతమైన ఏ 13 బయోనిక్‌ సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఈ ఫోన్ల ప్రత్యేకతని సంస్థ తెలిపింది.

ఐఫోన్‌ 11  6.1అంగుళాల లిక్విడ్‌ రెటీనా డిస్‌ప్లేతో.. బ్లాక్‌, గ్రీన్‌, ఎల్లో, పర్పుల్‌, వైట్‌, రెడ్‌ ఇలా ఆరు రంగుల్లో అందుబాటులో ఉంది.  స్పెషల్‌ ఆడియో, డాల్బీ అట్మోస్‌ ఫీచర్‌,స్లో మోషన్‌ సెల్ఫీస్‌,
ఇరువైపులా 12 మెగా పిక్సెల్‌ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా,
ఐ ఫోన్‌ టెన్‌ ఆర్‌ కంటే మరో గంట అదనంగా పనిచేసే బ్యాటరీ,
ఏ 13 బయోనిక్‌ చిప్‌ వంటి ప్రత్యేకతలున్నాయి.
ఐఫోన్‌ 11-64 జీబీ ధర 699 డాలర్ల నుంచి మొదలవుతుంది. ఐఫోన్11 ధర రూ.64 వేల నుంచి ప్రారంభం కానుంది.

ఐ ఫోన్‌ 11 ప్రో 5.8 అంగుళాల సూర్‌ రెటీనా అత్యంత ధృడమైన స్క్రీన్ కలిగి, మిడ్‌ నైట్‌ గ్రీన్‌ స్పేస్‌ గ్రే, సిల్వర్‌ వైట్‌ గోల్డ్‌ కలర్స్‌లో అందుబాటులో ఉంది.వెనుకవైపు సింగిల్‌ పీస్‌ గ్లాస్‌, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌, వెనుకవైపు 3 కెమెరాలు అమర్చారు. డాల్బీ అట్మోస్‌ సౌండ్‌,
సెకనుకు లక్ష కోట్ల ఆపరేషన్లు జరిపే సీపీయూ, 40 శాతం తక్కువ విద్యుత్‌ వినియోగం,
ఐ ఫోన్ 10 కంటే 4 గంటలు బ్యాటరీ పవర్ అదనం. ఐఫోన్‌ 11 ప్రో-128 జీబీ ధర 999 డాలర్ల నుంచి మొదలవుతుంది. ఐఫోన్ 11ప్రో  ధర రూ.99 వేల 900 ఉండనున్నట్లు తెలిపింది ఆపిల్.

ఐ ఫోన్ 11 ప్రో max- 6.5 అంగుళాల తెర, ఐ ఫోన్ 10 మాక్స్ కంటే 5 గంటలు అదనంగా వచ్చే బ్యాటరీ, వెనుక 3 కెమెరాలు, ఒకేసారి 3 విభిన్న ఫోటోలు తీసే సౌకర్యం, కనురెప్పల మధ్య చోటు చూపే సామర్ధ్యం దీని సొంతం. ఐ ఫోన్ 11 ప్రో మాక్స్ -128 జిబీ 1099 డాలర్లుగా ప్రకటించింది.
ఈనెల 13 నుంచి  బుకింగ్‌ మొదలైన ఐ ఫోన్లు 20 నుంచి అమ్మకాలు ప్రారంభిస్తామని యాపిల్ సంస్థ వెల్లడించింది.