Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Pixel Phones: ఆ గూగుల్ ఫోన్లపై తగ్గింపుల జాతర.. ఒక్కో ఫోన్‌పై ఎంత తగ్గిందంటే..?

భారతదేశంలోని స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ లాంచ్ గురించి గూగుల్ గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే కొత్త సిరీస్ లాంచ్ సందర్భంగా పాత సిరీస్ గూగుల్ ఫోన్లపై మతిపోయే ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా అమ్మకాల్లో ఆకట్టుకుంటున్న గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ఫోన్లను ధరలను సవరించింది.

Google Pixel Phones: ఆ గూగుల్ ఫోన్లపై తగ్గింపుల జాతర.. ఒక్కో ఫోన్‌పై ఎంత తగ్గిందంటే..?
Google Pixel
Follow us
Srinu

|

Updated on: Aug 17, 2024 | 3:49 PM

భారతదేశంలోని స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ లాంచ్ గురించి గూగుల్ గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే కొత్త సిరీస్ లాంచ్ సందర్భంగా పాత సిరీస్ గూగుల్ ఫోన్లపై మతిపోయే ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా అమ్మకాల్లో ఆకట్టుకుంటున్న గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ఫోన్లను ధరలను సవరించింది. పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో, పిక్సెల్ 8ఏ, పిక్సెల్ 7ఏ స్మార్ట్‌ఫోన్‌లకు ధరలు సవరించింది. రూ. 1,13,999 ధరతో ఉన్న 256 జీబీ పిక్సెల్ 8 ప్రో ధర రూ.106,999గా ఫిక్స్ చేసింది. ఈ నేపథ్యంలో గూగుల్ ఫోన్ల ధరల సవరణ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

గూగుల్ పిక్సెల్ 8 ప్రో 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు దాని ప్రారంభ ధర రూ. 106,999 నుండి రూ.99,999కు తగ్గించారు. ఈ ఏడాది మేలో విడుదల చేసిన పిక్సెల్ 8ఏ స్మార్ట్‌ఫోన్ ధర కూడా తగ్గించారు. పిక్సెల్ 8ఏ 128 జీబీ రూ. 52,999గా ఉండగా రూ.49,999కు తగ్గించారు. పిక్సెల్ 7ఏ 128 జీబీ వేరియంట్ ధరను రూ. 43,999 నుంచి  రూ. 41,999కు తగ్గించారు. ఆగస్ట్ 13న కొత్త గూగుల్ పిక్సెల్ 9 సిరీస్‌ను ప్రారంభించిన తర్వాత గూగుల్ ఈ మోడల్ ధర తగ్గింపులను ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. పిక్సెల్ 9, పిక్సెల్9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ మోడల్స్ గూగుల్ రిలీజ్ చేసింది. ఇప్పటికే ఈ మోడల్స్ ప్రీ ఆర్డర్లను గూగుల్ యాక్సెప్ట్ చేస్తుంది. 

ఫ్లిప్‌కార్ట్‌లో రెండు గూగుల్ స్మార్ట్‌ఫోన్‌లపై గూగుల్ వెల్‌కమ్ ఆఫర్లను అందిస్తుంది. ముఖ్యంగా ఈఎంఐ లావాదేవీలపై తగ్గింపులను అందిస్తుంది. పిక్సెల్ 9 ప్రీ-ఆర్డర్ చేసే కస్టమర్‌లు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు, ఈఎంఐ లావాదేవీలపై రూ.4,000 తగ్గింపును పొందవచ్చు. అయితే పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ రూ. 10,000 తగ్గింపు వర్తిస్తుంది. అదనంగా గూగుల్ పిక్సెల్ బడ్స్ ప్రో వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లను రూ.7,999 తగ్గింపు ధరతో స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్‌తో అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి ప్రీ-ఆర్డర్‌లపై 12 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ అందిస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి