AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bsnl Recharge: డేటా ప్రియులుకు బీఎస్ఎన్ఎల్ గుడ్ న్యూస్.. 320 జీబీ డేటాతో నయా రీచార్జ్ ప్లాన్ ప్రకటన

ప్రైవేట్ కంపెనీలు అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలు అధికంగా ఉండడంతో జూలైలో చాలా మంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్‌కు మారారు. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా అన్ని టెలికాం సర్కిళ్లలో 4జీ సేవలను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో 4జీ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో డేటా ప్రియులను ఆకట్టుకునేలా సరికొత్త రీచార్జ్ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది.

Bsnl Recharge: డేటా ప్రియులుకు బీఎస్ఎన్ఎల్ గుడ్ న్యూస్.. 320 జీబీ డేటాతో నయా రీచార్జ్ ప్లాన్ ప్రకటన
Bsnl
Nikhil
|

Updated on: Aug 17, 2024 | 4:30 PM

Share

భారతదేశంలో ఇటీవల టెలికాం కంపెనీలు ధరల పెరుగుదలను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ప్రజలు చౌకైన రీచార్జ్ ప్లాన్స్ కోసం బీఎస్ఎన్ఎల్‌ను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ కూడా తన వినియోగదారుల కోసం అనేక కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను విడుదల చేసింది. వ్యాలిడిటీ పెంపుతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్, సరసమైన డేటా ఎంపిక చేసుకునే అనేక ప్రయోజనాలు ఉండేలా రీచార్జ్ ప్లాన్స్‌ను రిలీజ్ చేస్తుంది. ప్రైవేట్ కంపెనీలు అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలు అధికంగా ఉండడంతో జూలైలో చాలా మంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్‌కు మారారు. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా అన్ని టెలికాం సర్కిళ్లలో 4జీ సేవలను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో 4జీ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో డేటా ప్రియులను ఆకట్టుకునేలా సరికొత్త రీచార్జ్ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ నయా రీచార్జ్ ప్లాన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

రూ. 997 రీఛార్జ్ ప్లాన్

బీఎస్ఎన్ఎల్ రూ. 997 రీఛార్జ్ ప్లాన్ 160 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ ద్వారా 320 జీబీ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో రోజుకు 2 జీబీ హై-స్పీడ్ డేటా, 100 ఉచిత రోజువారీ ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. అదనంగా వినియోగదారులు ఏదైనా నెట్‌వర్క్‌లో ఉచిత అపరిమిత వాయిస్ కాలింగ్‌ను ఆశ్వాదించవచ్చు. అలాగే దేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ హార్డీ గేమ్స్, జింగ్ మ్యూజిక్, బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్‌కు ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది. 

బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను లాంచ్ చేయడమే కాకుండా 5జీ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.  ప్రస్తుతం 4 జీ సర్వీసెస్ కోసం అన్ని టెలికాం సర్కిల్‌లలో అనేక కొత్త మొబైల్ టవర్‌లను ఏర్పాటు చేసింది. ఇప్పటిక 5జీ నెట్‌వర్క్ కోసం పరీక్షలు చేస్తుంది. అయితే బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను ఎంటీఎన్ఎల్ వినియోగదారులు కూడా పొందవచ్చని ఇటీవల బీఎస్ఎన్ఎల్ బోర్డు మీటింగ్‌లో పేర్కొన్నారు. ముఖ్యంగా ఢిల్లీ, ముంబైలోని ఎంటీఎన్ఎల్ వినియోగదారులు త్వరలో 4జీ సేవలను ఆశ్వాదించవచ్చు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి