అంతరిక్ష కేంద్రంలో చిట్టెలుకలు… ఎలా వచ్చాయబ్బా ?జపాన్ శాస్త్రజ్ఞుల ‘ఆరేళ్ళ సృష్టి’ !
అంతరిక్ష కేంద్రంలో ఆరోగ్యంగా ఉన్న చిట్టెలుకలను చూసి జపాన్ శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోయారు. తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. ఈ కేంద్రంలో నిల్వ చేసిన ఎలుకల వీర్యం (స్పెర్మ్) తో హెల్దీ ఎలుక పిల్లలు పుట్టడం విశేషం. పైగా ఇది ఫ్రీజ్...
అంతరిక్ష కేంద్రంలో ఆరోగ్యంగా ఉన్న చిట్టెలుకలను చూసి జపాన్ శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోయారు. తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. ఈ కేంద్రంలో నిల్వ చేసిన ఎలుకల వీర్యం (స్పెర్మ్) తో హెల్దీ ఎలుక పిల్లలు పుట్టడం విశేషం. పైగా ఇది ఫ్రీజ్ (ఎండిపోయినఁ) స్పెర్మ్…..సుమారు ఆరేళ్లుగా హైలెవెల్స్ లో కాస్మిక్ రేడియేషన్ (అణుధార్మికత) గురైన వీర్యమిదని, ఈ రేడియేషన్ ప్రభావం కారణంగా ఇవి పుట్టాయని రీసెర్చర్లు తెలిపారు. వీటిని ముద్దుగా ‘స్పేస్ పప్స్’ గా అభివర్ణిస్తున్నారు. అంతరిక్ష కేంద్రంలో ఎండిన రూపంలో ఉన్న ఎలుకల వీర్యాన్ని తిరిగి భూమి మీదికి తెచ్చి..రీహైడ్రేట్ చేయగానే ఎలాంటి జన్యుపరమైన లోపాలు లేకుండా 168 చిన్న ఎలుకలు పుట్టాయని తెరుహికో వాకాయమా అనే శాస్త్రజ్ఞుడు తెలిపారు. అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో ఎండినా వీర్యం ద్వారా పుట్టిన వాటికి. ఈ భూమిపై పుట్టినవాటికి మధ్య పెద్దగా తేడా లేదని ఆయన చెప్పారు. ఇవన్నీ నార్మల్ అఫియరెన్స్ గా ఉన్నాయని పేర్కొన్నారు. తాము వీటి మధ్య పెద్ద తేడా ఉంటాయని భావించామని,,కానీ అలా జరగలేదన్నారు. పైగా వీటి జన్యువులు కూడా ఇంచుమించు ఒకేవిధంగా ఉన్నాయని ఆయన చెప్పారు. 2013 లో వాకాయమా ..ఈయన సహచరులు మూడు బాక్సులను తెచ్చి ఒక్కోదానిలో ఎలుకల వీర్యానికి సంబంధించిన ఎండిపోయిన ఏంప్యూల్స్ (ముక్కలవంటివాటిని) వీటిలో అమర్చి వీటిని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు పంపారు. అక్కడి దీర్ఘకాల రేడియేషన్ కారణంగా వీటి డీఎన్ఏ దెబ్బ తింటుందా అన్నదానిని విశ్లేషించారు.
మొదట 9 నెలల తరువాత కొన్ని బాక్సులను, ఆ తరువాత రెండేళ్ల అనంతరం ..చివరకు ఆరేళ్ళ తరువాత వీటిని భూమిపైకి తెచ్చి రీహైడ్రేట్ చేయగా వందలాది ఎలుకలు పుట్టినట్టు ఆయన తెలిపారు.. భవిష్యత్తులో అంతరిక్ష కేంద్ట్రంలో దీర్ఘకాలంపాటు ఉండవలసి వచ్చినప్పుడు మానవ వ్యోమగాములపై కలిగే ప్రభావాన్ని కొంతవరకు అంచనా వేయగలిగామని, ఎక్కువ స్థాయిలో ఉన్న రేడియేషన్ చూపగల ప్రభావాన్ని మదింపు చేశామని వాకయమా చెప్పారు. అయితే ఇంకా పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: బ్రహ్మంగారి మఠంలో కొట్లాటలు మఠం పర్సన్ ఇన్‌ఛార్జిగా శంకర్ బాలాజీకి బాధ్యతలు :Brahmamgari Matam Issue LIVE Video.
సంచయితకు హైకోర్టు షాక్ ..అశోక్ గజపతిరాజును పునర్నియమించాలని ఆదేశం:MANSAS Trust Live Video.
పేదల కోసం ఇప్పటి వరుకు 14 లక్షల రూపాయాలు ఖర్చుపెట్టా..సోహెల్ ఎమోషనల్ వర్డ్స్: Syed Sohel video.