AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Airtel 5G: 5జీ ట్ర‌య‌ల్స్ మొదలు పెట్టిన ఎయిర్‌టెల్‌.. ఇంట‌ర్‌నెట్ స్పీడ్ ఎంతో తెలుసా? సెక‌న్ల‌లో సినిమా డౌన్‌లోడ్‌..

Airtel 5G: కేంద్ర ప్ర‌భుత్వం దేశంలోని టెలికాం కంపెనీల‌కు 5జీ నెట్‌వ‌ర్క్ ట్రయ‌ల్స్ నిర్వ‌హించుకోమ‌ని అనుమ‌తులు ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ అవ‌కాశాన్ని దేశంలో తొలిసారి ఉప‌యోగించుకుంది ప్ర‌ముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌...

Airtel 5G: 5జీ ట్ర‌య‌ల్స్ మొదలు పెట్టిన ఎయిర్‌టెల్‌.. ఇంట‌ర్‌నెట్ స్పీడ్ ఎంతో తెలుసా? సెక‌న్ల‌లో సినిమా డౌన్‌లోడ్‌..
Airtel 5g Trail
Narender Vaitla
|

Updated on: Jun 15, 2021 | 6:02 AM

Share

Airtel 5G: కేంద్ర ప్ర‌భుత్వం దేశంలోని టెలికాం కంపెనీల‌కు 5జీ నెట్‌వ‌ర్క్ ట్రయ‌ల్స్ నిర్వ‌హించుకోమ‌ని అనుమ‌తులు ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ అవ‌కాశాన్ని దేశంలో తొలిసారి ఉప‌యోగించుకుంది ప్ర‌ముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌. టెలికాం విభాగం అనుమ‌తిచ్చిన నెల రోజుల్లోనే ట్ర‌య‌ల్స్ ప్రారంభించ‌డం విశేషం. ఇందులో భాగంగానే తాజాగా 5జీ నెట్‌వ‌ర్క్‌ను గుర్గావ్‌లోని సైబర్ హబ్ ప్రాంతంలో 3500 మెగా హెర్ట్జ్ మిడిల్ బ్యాండ్ స్పెక్ట్రంలో పరీక్షించింది.

ఈ ట్ర‌య‌ల్స్ సంద‌ర్భంగా ఎయిర్‌టెల్ 5జీ ఏకంగా 1 జీబీపీఎస్ వేగాన్ని అందుకున్న‌ట్లు తెలిసింది. అంటే ఇక‌పై ఒక సినిమాను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే కేవ‌లం కొన్ని సెక‌న్లు స‌రిపోతుంద‌న్న‌మాట‌. ఇదిలా ఉంటే.. ఎయిర్‌టెల్ 5జీ ట్రయల్స్ కోసం ఎరిక్సన్ 5జీ నెట్‌వర్క్ గేర్‌తో కలిసి పనిచేస్తోంది. ఇక ఎయిర్‌టెల్ ముంబ‌యిలో సైతం.. ఎయిర్‌టెల్‌ పరీక్షలు నిర్వహించనుంది. ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, దిల్లీ టెలికాం సర్కిళ్లలో 5జీ ట్రయల్స్‌ నిర్వహణకు డాట్‌ ఎయిర్‌టెల్‌కు అనుమతిచ్చింది. 5జీ టెస్ట్ కోసం ఎయిర్‌టెల్ ఎరిక్స‌న్‌తో జ‌ట్టుక‌ట్ట‌గా.. జియో 5జీ సొంతంగా అభివృద్ధి చేసిన టెక్నాల‌జీని ఉప‌యోగించుకుంది. దేశంలో 5జీ ట్ర‌య‌ల్స్ మ‌రో 6 నెల‌ల‌పాటు కొన‌సాగ‌నున్నాయి.

Also Read: అది తప్పుడు కథనం…. ఎకనామిక్స్ టైమ్స్ లో వచ్చిన వార్తను కొట్టి పారేసిన అదానీ గ్రూప్

Filing Income Tax Returns: ఈసారి ఆదాయపు పన్ను దాఖలు చేసేటప్పుడు ఈ నాలుగు అంశాలను తప్పకుండా గుర్తుంచుకోండి..

Deceased Client : మరణించిన ఖాతాదారుడి ఖాతాను కంటిన్యూ చేయొచ్చా..! లేదా మూసివేయాలా.. ఆర్బీఐ ఏం చెబుతుంది..