అది తప్పుడు కథనం…. ఎకనామిక్స్ టైమ్స్ లో వచ్చిన వార్తను కొట్టి పారేసిన అదానీ గ్రూప్

నాలుగు లిస్టెడ్ సంస్థల్లో తమ మూడు అకౌంట్లను నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ యునైటెడ్ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్ ) స్తంభింపజేసిందంటూ వచ్చిన వార్తను అదానీ గ్రూప్ కొట్టిపారేసింది. అది తప్పుడుదంటూ క్లారిటీ ఇచ్చింది.

అది తప్పుడు కథనం.... ఎకనామిక్స్ టైమ్స్ లో వచ్చిన వార్తను కొట్టి పారేసిన అదానీ గ్రూప్
Adani Group Rejects Report On Fpi Account Freeze
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Jun 14, 2021 | 6:39 PM

నాలుగు లిస్టెడ్ సంస్థల్లో తమ మూడు అకౌంట్లను నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ యునైటెడ్ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్ ) స్తంభింపజేసిందంటూ వచ్చిన వార్తను అదానీ గ్రూప్ కొట్టిపారేసింది. అది తప్పుడుదంటూ క్లారిటీ ఇచ్చింది. అల్బులా ఇన్వెస్ట్ మెంట్ ఫండ్, క్రెస్టా ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ల ఎఫ్ సి ఐ అకౌంట్లను ఈ సంస్థ ఫ్రీజ్ చేసినట్టు ఎకనామిక్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. అదానీ ఎంటర్ ప్రైజస్, అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్, ట్రాన్స్ మిషన్ లిమిటెడ్, అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థల్లో రూ.43,500 కోట్ల మేర విలువ గల షేర్లను ఈ మూడు సంస్థలు కలిగి ఉన్నాయని ఈ వార్త పేర్కొంది. అదానీ గ్రూప్ కంపెనీల్లో ప్రైస్ మానిప్యులేషన్ (అవకతవకలు) జరిగాయా అన్న విషయాన్ని కనుగొనేందుకు సెబీ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిందని కూడా ఇందులో తెలిపారు. అయితే ఈ కథనంపై అదానీ ఎంటర్ ప్రైజస్ ఓ స్టేట్ మెంట్ విడుదల చేస్తూ…ఈ కథనాన్ని తోసిపుచ్చింది. ఇది పూర్తిగా తప్పుడుదని, పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించడానికేనని పేర్కొంది. తమ గ్రూపునకు చెందిన అనేకమంది ఇన్వెస్టర్లకు ఈ విధమైన వార్తలు తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయని తెలిపింది. ముఖ్యంగా మైనారిటీ ఇన్వెస్టర్లపై ఇది పెను ప్రభావాన్ని చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిధులకు సంబంధించిన డీ మాట్ అకౌంట్ స్టేటస్ ను పరిశీలించాలని తాము రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ ఫర్ ఏజంటును కోరామని వారి లిఖితపూర్వక కన్ఫర్మేషన్ ఈ నెల 14 న ఈ-మెయిల్ ద్వారా అందిందని వివరించింది.

ఈ ఫండ్స్ ఉన్న డీ మాట్ అకౌంట్ లో సంస్థకు సంబంధించిన షేర్లు ఏవీ స్తంభించలేదని తేలినట్టు స్పష్టం చేసింది. కాగా-ఎకనామిక్ టైమ్స్ లో కథనం ప్రచురితం కాగానే స్టాక్ మార్కెట్ లో లిస్టెడ్ అదానీ కంపెనీల షేర్లు చాలావరకు పతనమయ్యాయి. ట్రేడ్ విడుదలైన గంటలోనే ఇలా జరిగింది. కానీ ట్రేడింగ్ ముగుస్తున్న సమయంలో షేర్లు కొంతవరకు పుంజుకున్నాయి. అదానీ గ్రూపు కంపెనీల్లో…… వచ్చే కొన్ని వారాల్లో ఇన్వెస్ట్ చేయడంలో అప్రమత్తంగా ఉండాలంటూ ఇన్వెస్ట్రర్లను..ఎనలిస్టులు హెచ్చరించారు.

మరిన్ని ఇక్కడ చూడండి:  పేదల కోసం ఇప్పటి వరుకు 14 లక్షల రూపాయాలు ఖర్చుపెట్టా..సోహెల్ ఎమోషనల్ వర్డ్స్: Syed Sohel video.

 భారత్ నుండి బాంగ్లాదేశ్ కు 100 కి.మి నడిచి వెళ్లిన పులి..రేడియో కాలర్ ద్వారా తెలుసుకున్న అధికారులు :Tiger Viral Video.

షార్ట్ ఫిల్మ్‌లో యాక్ట్‌ చేయనున్న నాని..!ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిన వైనం :nani act in shortfilm video.

Kaushal Manda funny dance video:బేటీతో కౌశల్ మంద ఫన్నీ డ్యాన్స్‌. నెట్టింట వైరల్ గా మారిన వీడియో..

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!