Wearable AC: ఈ ఏసీ మీరెక్కడి వెళితే అక్కడికి వస్తుంది.. ఏం టెక్నాలజీ గురూ

పోర్టబుల్‌ ఏసీ డివైజ్‌ను తీసుకొచ్చింది. స్మార్ట్‌ గ్యాడ్జెట్స్‌ తయారీలో ఎప్పుడూ ముందుండే సోనీ తాజాగా ఈ కొత్త డివైజ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. పూర్తిగా స్మార్ట్ ఫోన్‌ ఆధారంగా పనిచేసే ఈ గ్యాడ్జెట్‌ ఆటోమెటిక్‌గా టెంపరేచర్‌ను సెట్‌ చేసుకుంటుంది. ఈ డివైజ్‌ను మీ మెడ వెనక భాగంలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఉష్ణోగ్రత, తేమ ఆధారంగా ఈ గ్యాడ్జెట్ దానంతటదే పనిచేస్తుంది....

Wearable AC: ఈ ఏసీ మీరెక్కడి వెళితే అక్కడికి వస్తుంది.. ఏం టెక్నాలజీ గురూ
Sony Ac
Follow us

|

Updated on: Apr 30, 2024 | 2:26 PM

ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి ప్రతాపానికి ప్రజలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. దీంతో ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఎంత ఏసీ, కూలర్‌ అయినా గదిలో ఉంటేనే ఉపయోగపడుతుంది. మరి మనం వెళ్లిన ప్రతీ చోటుకి మనతో పాటు వచ్చే ఏసీ ఉంటే ఎలా ఉంటుంది.? ఊహించుకోవడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ! అయితే దీనిని నిజం చేసింది ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సోనీ.

పోర్టబుల్‌ ఏసీ డివైజ్‌ను తీసుకొచ్చింది. స్మార్ట్‌ గ్యాడ్జెట్స్‌ తయారీలో ఎప్పుడూ ముందుండే సోనీ తాజాగా ఈ కొత్త డివైజ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. పూర్తిగా స్మార్ట్ ఫోన్‌ ఆధారంగా పనిచేసే ఈ గ్యాడ్జెట్‌ ఆటోమెటిక్‌గా టెంపరేచర్‌ను సెట్‌ చేసుకుంటుంది. ఈ డివైజ్‌ను మీ మెడ వెనక భాగంలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఉష్ణోగ్రత, తేమ ఆధారంగా ఈ గ్యాడ్జెట్ దానంతటదే పనిచేస్తుంది. రియాన్‌ పాకెట్ 5 పేరుతో తీసుకొచ్చిన ఈ పోర్టబుల్ ఏసీని మొబైల్‌ యాప్‌ ద్వారా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు.

ఇక గ్యాడ్జెట్‌ను పక్కన పెట్టగానే దానంతట ఆదే ఆగిపోతుంది. ఇదిలా ఉంటే ఈ పోర్టబుల్ ఏసీ కేవలం వేసవిలోనే కాకుండా చలికాలంలోనూ ఉపయోగపడుతుంది. చలిలో శరీరాన్ని వెచ్చగా ఉంచేలా వేడి గాలి కూడా వస్తుంది. ఈ డివైజ్‌తో పాటు ఒక పాకెట్‌ వస్తుంది. దాంట్లో గ్యాడ్జెట్‌ను పెట్టుకుంటే సరిపోతుంది. బయటి ఉష్ణోగ్రత ఆధారంగా టెంపరేచర్‌ను అదే సెట్ చేసుకుంటుంది. ఇక ధర విషయానికొస్తే ఈ పోర్టబుల్ ఏసీ మన కరెన్సీలో రూ. 16 వేలుగా ఉంటుంది. ఇక ఈ గ్యాడ్జెట్‌ను ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే గరిష్టంగా 17 గంటలు పనిచేస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
'మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని' .. ముంబై పర్యటనపై మోడీ ట్వీట్
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది..!
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!
పుష్పరాజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నసెలబ్రిటీలు.!
చేపల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూసి షాక్
చేపల కోసం వల విసిరిన జాలరి.. ఏం చిక్కిందో చూసి షాక్
175 మందితో ప్రయాణిస్తున్న విమానం..ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీబెల్
175 మందితో ప్రయాణిస్తున్న విమానం..ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీబెల్
నేషనల్ హైవే ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్
నేషనల్ హైవే ప్రమాదాల నివారణకు స్పెషల్ యాక్షన్ ప్లాన్
టీమిండియా కోచ్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్.. విదేశీయులకు నో ఛాన్స్
టీమిండియా కోచ్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్.. విదేశీయులకు నో ఛాన్స్
యాక్షన్ ప్లస్ రచ్చ రొమాన్స్. ఇదేం సినిమారా మామ.. OTT ఆగమాగం..
యాక్షన్ ప్లస్ రచ్చ రొమాన్స్. ఇదేం సినిమారా మామ.. OTT ఆగమాగం..
కొర్టాలమ్‌ జలపాతానికి ఆకస్మిక వరద..భయంతో పరుగులు తీసిన సందర్శకులు
కొర్టాలమ్‌ జలపాతానికి ఆకస్మిక వరద..భయంతో పరుగులు తీసిన సందర్శకులు