Google Gemini AI: జర జరుగు.. వచ్చేసింది మరో ‘జెమినీ’.. ఆ ఫోన్లలో కూడా వాడేయొచ్చు..

గూగుల్‌ ప్రత్యేకమైన ఏఐ అసిస్టెంట్‌ను రంగంలోకి తీసుకొచ్చింది. దీని పేరు గూగుల్‌ జెమినీ ఏఐ. ఇది వినియోగదారులకు విశేష అనుభూతిని అందిస్తోంది. ఈ క్రమంలో దీనిని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు చేసింది గూగుల్‌. ఇప్పటి వరకూ ఆండ్రాయిడ్‌ డివైజ్‌లలో ఆండ్రాయిడ్‌12 అంతకన్నా లేటెస్ట్‌ వెర్షన్లలోనే అందుబాటులో ఉండేది. అయితే ఇప్పుడు దీనిని పాత వెర్షన్లలోనూ వినియోగించుకునేందుకు వీలుగా దాని పరిధిని గూగుల్‌ విస్తరిస్తోంది.

Google Gemini AI: జర జరుగు.. వచ్చేసింది మరో ‘జెమినీ’.. ఆ ఫోన్లలో కూడా వాడేయొచ్చు..
Google Gemini AI
Follow us

|

Updated on: Apr 30, 2024 | 4:20 PM

ప్రస్తుతం మనం ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) యుగంలో ఉన్నాం. అన్ని రంగాల్లోకి ఏఐ విస్తరిస్తోంది. అన్ని దిగ్గజ కంపెనీలు తమ సొంత ఏఐ లను రూపొందిస్తున్నాయి. మొట్టమొదట వచ్చిన చాట్‌ జీపీ ఓపెన్‌ ఏఐ ఎంత సెన్సేషన్‌ సృష్టించిందో అందరికీ తెలిసిందే. దానిని అధిగమించేందుకు అన్ని టెక్‌ దిగ్గజాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. గూగుల్‌ ప్రత్యేకమైన ఏఐ అసిస్టెంట్‌ను రంగంలోకి తీసుకొచ్చింది. దీని పేరు గూగుల్‌ జెమినీ ఏఐ. ఇది వినియోగదారులకు విశేష అనుభూతిని అందిస్తోంది. ఈ క్రమంలో దీనిని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు చేసింది గూగుల్‌. ఇప్పటి వరకూ ఆండ్రాయిడ్‌ డివైజ్‌లలో ఆండ్రాయిడ్‌12 అంతకన్నా లేటెస్ట్‌ వెర్షన్లలోనే అందుబాటులో ఉండేది. అయితే ఇప్పుడు దీనిని పాత వెర్షన్లలోనూ వినియోగించుకునేందుకు వీలుగా దాని పరిధిని గూగుల్‌ విస్తరిస్తోంది. తాజా యాప్ అప్‌డేట్‌లతో, జెమిని ఇప్పుడు ఆండ్రాయిడ్ 10, ఆండ్రాయిడ్ 11లో నడుస్తున్న పరికరాలలో కూడా ఇన్‌స్టాల్ చేసుకొనే వెసులుబాటును కల్పిస్తుంది.

గూగుల్‌ జెమిని..

ఈ సంవత్సరం ప్రారంభంలో జెమిని మొదటిసారిగా ఆండ్రాయిడ్‌ కోసం పరిచయం చేశారు. ఆ సమయంలో ఇది ఆండ్రాయిడ్‌12 అంతకన్నా కొత్త వెర్షన్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఆండ్రాయిడ్ పాత వెర్షన్‌లలో కూడా జెమిని పని చేయడానికి వీలుగా గూగుల్‌ ఎటువంటి ఆర్భాటం లేకుండా కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. ఈ ‍కొత్త అప్‌డేట్, వెర్షన్ v1.0.626720042తో విడుదల చేసింది. అంటే ఆండ్రాయిడ్‌ 10 నుంచి పరికరాలను కలిగి ఉన్న వినియోగదారులు ఇప్పుడు గూగుల్‌ ప్లే స్టోర్‌ ద్వారా జెమినీని యాక్సెస్ చేయవచ్చు. దీనిలో మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ జెమినీని మీ పరికరాలలో గూగుల్‌ వాయిస్‌ అసిస్టెంట్‌కి ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చు. దీని వల్ల వినియోగదారులకు కొత్త ఏఐ ఆధారిత అనుభవాన్ని అందిస్తుంది.

ఇలా బయటపడింది..

వాస్తవానికి ఈ కొత్త అప్‌డేట్‌ తీసుకొచ్చినట్లు గూగుల్‌ ఎటువంటి ప్రచారం చేయలేదు. అయితే ఈ విషయాన్ని మొదట సుమంత దాస్ మైక్రోబ్లాగింగ్ సైట్ నుంచి ఎక్స్‌ (గతంలో ట్విట్టర్)లో హైలైట్ చేశారు. ఆ తర్వాత దీనిని ఆర్టెమ్ రుస్సాకోవ్స్కీ ధ్రువీకరించారు. ఆండ్రాయిడ్‌10లో నడుస్తున్న గూగుల్‌ పిక్సల్‌ వంటి పరికరాల్లోని వినియోగదారులు గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి యాప్‌ అప్‌డేట్ చేసిన తర్వాత జెమినిని విజయవంతంగా ఇన్‌స్టాల్ చేసి ఉపయోగిస్తున్నట్లు నివేదించారు. జెమినిని ప్రయత్నించడానికి ఆసక్తిగా ఉన్న ఆండ్రాయిడ్ వినియోగదారుల కొంతమంది వారి ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ కారణంగా అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఆ అవకాశం కలుగుతోంది. ఈ నవీకరణ కొత్త అవకాశాలను అదిస్తోంది. మీరు తాజా ఆండ్రాయిడ్ వెర్షన్ లేదా పాత వెర్షన్‌ను రన్ చేస్తున్నా, ఇప్పుడు మీరు జెమిని ఫీచర్‌, సామర్థ్యాల ప్రయోజనాన్ని పొందవచ్చు.

ఇలా తనిఖీ చేయండి..

  • మీ ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లండి.
  • “అబౌట్‌ ఫోన్‌” లేదా “సిస్టమ్” (మీ పరికరాన్ని బట్టి) నొక్కండి.
  • దానిలో “ఆండ్రాయిడ్‌ వెర్షన్” కోసం చూడండి.
  • మీరు ఆండ్రాయిడ్‌ 10, 11, లేదా 12ని చూసినట్లయితే, మీరు వెంటనే గూగుల్ ప్లే స్టోర్‌కి వెళ్లి, జెమిని యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
నటి హేమ చెప్పింది అబద్ధమా..? ఆమె మాటల్లో నిజమెంతా..?
నటి హేమ చెప్పింది అబద్ధమా..? ఆమె మాటల్లో నిజమెంతా..?
రేపటి నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత.. కారణం ఇదే!
రేపటి నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత.. కారణం ఇదే!
ప్లేఆఫ్స్‌ అంటే పూనకాలే.. కోల్‌కతా రికార్డులు ఇవే..
ప్లేఆఫ్స్‌ అంటే పూనకాలే.. కోల్‌కతా రికార్డులు ఇవే..
ప్రజలకు సజ్జనార్‌ విజ్ఞప్తి.. ఆ పేరుతో వచ్చే కాల్స్‌ని నమ్మొద్దని
ప్రజలకు సజ్జనార్‌ విజ్ఞప్తి.. ఆ పేరుతో వచ్చే కాల్స్‌ని నమ్మొద్దని
కౌంటింగ్ సెంటర్లకు 2 కిలోమీటర్ల మేర రెడ్‌ జోన్‌
కౌంటింగ్ సెంటర్లకు 2 కిలోమీటర్ల మేర రెడ్‌ జోన్‌
వచ్చే సీజన్‌లో ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడనున్న క్రిస్ గేల్!
వచ్చే సీజన్‌లో ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడనున్న క్రిస్ గేల్!
జూన్‌ 5 నుంచి 11 మధ్య తెలంగాణకు రుతుపవనాలు! రైతన్నలు ఫుల్ ఖుష్
జూన్‌ 5 నుంచి 11 మధ్య తెలంగాణకు రుతుపవనాలు! రైతన్నలు ఫుల్ ఖుష్
తొలి క్వాలిఫయర్‌కు రంగం సిద్ధం.. ఓడినా మరో ఛాన్స్..
తొలి క్వాలిఫయర్‌కు రంగం సిద్ధం.. ఓడినా మరో ఛాన్స్..
యువతలో పెరుగుతోన్న బ్రెయిన్‌ స్ట్రోక్‌.. కారణాలు ఇవే..
యువతలో పెరుగుతోన్న బ్రెయిన్‌ స్ట్రోక్‌.. కారణాలు ఇవే..
డిగ్రీ అర్హతతతో దేశ త్రివిధ దళాల్లో ఉద్యోగాలు.. UPSC ద్వారా ఎంపిక
డిగ్రీ అర్హతతతో దేశ త్రివిధ దళాల్లో ఉద్యోగాలు.. UPSC ద్వారా ఎంపిక