AC: స్ల్పిట్ ఏసీ, విండో ఏసీ.. ఈ రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసా.?

స్ల్పిట్ ఏసీలో ప్రధానంగా రెండు యూనిట్లు ఉంటాయి. వీటిలో ఒకటి గదిలో లోపల ఉంటే, మరొకటి బయట ఉంటుంది. దీంట్లో ఎవాపరేటర్, బ్లోయర్, క్యాపిలరీ ట్యూబ్, ఎయిర్‌ఫిల్టర్, కూలింగ్ కాయిల్స్ ఉంటాయి. ఈ యూనిట్‌ను మొత్తంగా ఎవాపరేటర్‌గా పిలుస్తారు ఇది గదిలోపల ఉంటుంది. ఇక బయట ఉండే విభాగంలో కంప్రెజర్, మోటార్, ఫ్యాన్...

AC: స్ల్పిట్ ఏసీ, విండో ఏసీ.. ఈ రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసా.?
Ac
Follow us

|

Updated on: Apr 30, 2024 | 8:12 PM

దంచికొడుతోన్న ఎండల నుంచి ఉపశమనం కోసం ప్రజలు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. కొందరు ఎయిర్‌ కూలర్స్‌ను కొనుగోలు చేస్తుంటే మరి కొందరు ఏసీలను కొంటున్నారు. అయితే ఏసీ కొనుగోలు చేసే సమయంలో ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఇదిలా ఉంటే ఏసీల్లో రెండు ప్రధాన రకాల ఏసీలు అందుబదటులో ఉంటాయి. వీటిలో ప్రధానమైనవి స్ల్పిట్ ఏసీ, విండో ఏసీలు. ఇంతకి ఈ రెండు ఏసీల మధ్య తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

స్ల్పిట్ ఏసీలో ప్రధానంగా రెండు యూనిట్లు ఉంటాయి. వీటిలో ఒకటి గదిలో లోపల ఉంటే, మరొకటి బయట ఉంటుంది. దీంట్లో ఎవాపరేటర్, బ్లోయర్, క్యాపిలరీ ట్యూబ్, ఎయిర్‌ఫిల్టర్, కూలింగ్ కాయిల్స్ ఉంటాయి. ఈ యూనిట్‌ను మొత్తంగా ఎవాపరేటర్‌గా పిలుస్తారు ఇది గదిలోపల ఉంటుంది. ఇక బయట ఉండే విభాగంలో కంప్రెజర్, మోటార్, ఫ్యాన్, డిస్జార్జ్, కండెన్సర్ ఉంటాయి. ఈ రెండు యూనిట్లకు కనెక్షన్‌గా సక్షన్ లైన్, లిక్విడ్ లైన్ ఉంటాయి.

ఇక విండో ఏసీ విషయానికొస్తే ఇందులో ఒకే యూనిట్ ఉంటుంది. సహజంగా దీనిని కిటీకి లేదా కాస్త గోడను తొలగించి ఏర్పాటు చేస్తారు. ఇందులో ఏసీ సగ భాగం ముందు ఉంటుంది. మిగిలిన సగ భాగం బయటకు ఉంటుంది. ఈ ఏసీని ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్లలేము. అలాగే ఎక్కువ స్థలం అవసరపడుతుంది. ఇక ధర విషయానికొస్తే స్ప్లిట్‌ ఏసీలతో పోల్చితే విండో ఏసీ ధర తక్కువగా ఉంటుంది. అయితే విండో ఏసీలు ఎక్కువగా శబ్ధం వస్తుంది, అదే స్ల్పిట్ ఏసీలో అయితే శబ్ధం తక్కువగా ఉంటుంది.

ఇక మెయింటెనెన్స్‌ విషయానికొస్తే.. విండో ఏసీకి మెయింటెనెన్స్‌ తక్కువగా ఉంటుంది. అదే స్ల్పిట్ ఏసీ విషయంలో మాత్రం మెయింటెనెన్స్ ఎక్కువగా ఉంటుంది. అయితే విండో ఏసీతో పోల్చితే, స్ల్పిట్‌ ఏసీలు ఎక్కువ చల్లదనాన్ని అందిస్తాయి. అలాగే స్ల్పిట్‌ ఏసీలోనే అడ్వాన్స్‌ ఫీచర్స్‌ ఉంటాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..