Smart Phone Resale: మీ పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తున్నారా? ధరను ప్రభావితం చేసే అంశాలివే..!

ప్రతి మనిషికి ఓ స్మార్ట్ ఫోన్ అనే చందంగా పరిస్థితి తయారైంది. అయితే కొత్త ఒక వింత పాత ఒక రోత అనే నానుడి ప్రకారం ఎవరికి వారు ఏడాదికో, రెండేళ్లకో స్మార్ట్ ఫోన్ మార్చాలని కోరుకుంటూ ఉంటారు. అయితే చాలా మంది అప్పటికే వాడుతున్న స్మార్ట్ ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసి కొత్త ఫోన్‌ను కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ఒక్కోసారి మనం వాడే స్మార్ట్ ఫోన్‌కు చాలా తక్కువ ధర వస్తూ ఉంటుంది.

Smart Phone Resale: మీ పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తున్నారా? ధరను ప్రభావితం చేసే అంశాలివే..!
Smartphones
Follow us

|

Updated on: Jun 04, 2023 | 6:30 PM

ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీ కారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో స్మార్ట్ ఫోన్ అనేది నిత్యావసర వస్తువుగా మారింది. ముఖ్యంగా కరోనా లాక్‌డౌన్ దెబ్బకు ఆన్‌లైన్ క్లాసులు, వర్క్ ఫ్రమ్ హోం కల్చర్ పెరగడంతో కచ్చితంగా ప్రతి మనిషికి ఓ స్మార్ట్ ఫోన్ అనే చందంగా పరిస్థితి తయారైంది. అయితే కొత్త ఒక వింత పాత ఒక రోత అనే నానుడి ప్రకారం ఎవరికి వారు ఏడాదికో, రెండేళ్లకో స్మార్ట్ ఫోన్ మార్చాలని కోరుకుంటూ ఉంటారు. అయితే చాలా మంది అప్పటికే వాడుతున్న స్మార్ట్ ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసి కొత్త ఫోన్‌ను కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ఒక్కోసారి మనం వాడే స్మార్ట్ ఫోన్‌కు చాలా తక్కువ ధర వస్తూ ఉంటుంది. గతంలో ఆన్‌లైన్ సైట్స్‌ ద్వారా ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే మంచి ధర వచ్చేది. అయితే క్రమేపి వారు కూడా ఫోన్ కండిషన్‌కు అనుగుణంగా అప్పటికప్పుడు ధర నిర్ణయిస్తున్నారు. మీ స్మార్ట్‌ఫోన్ గరిష్ట పునఃవిక్రయం విలువను పొందడానికి మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని ప్రాథమిక దశలను ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

స్మార్ట్ ఫోన్ కొనుగోలు సమయం

మీ స్మార్ట్‌ఫోన్ ధరను నిర్ణయించే ముఖ్యమైన అంశాలలో ఒకటి పరికరం కొనుగలోలు సమయం. కాబట్టి మీరు నిజంగా మీ స్మార్ట్‌ఫోన్‌ను విక్రయించాలనుకుంటే పాత స్మార్ట్‌ఫోన్ ఎప్పడు కొన్నారు? దానిలోని వెర్షన్ ఏంటో క్షుణ్ణంగా పరిశీలించాలి. ముఖ్యంగా ఫోన్ మార్చాలనుకునే వారు ఎక్కువ కాలం వేచి ఉండకుండా ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే మంచి ధర వచ్చే అవకాశం ఉంటుంది. 

ఫోన్ ఫంక్షనింగ్

మీ స్మార్ట్‌ఫోన్ విలువను నిర్ణయించే మరో ముఖ్యమైన అంశం పరికరానికి జరిగిన నష్టం. ఈ నష్టాలను రెండు ప్రధాన రకాలుగా వర్గీకరించవచ్చు. బాడీ నష్టం, ఫంక్షనల్. అందుకే మంచి నాణ్యమైన కవర్ కేస్‌ను ఉపయోగించడం ఎల్లప్పుడూ మంచిది. ఎందుకంటే ఇది పరికరాన్ని డెంట్‌లు, గీతలు, రంగు మారకుండా కాపాడుతుంది. పరికరం అజాగ్రత్తగా ఉపయోగించబడిందని సూచిస్తున్నందున డెంట్‌లు మంచివిగా పరిగణించరు. కాబట్టి ధర తగ్గిపోతుంది.

ఇవి కూడా చదవండి

తప్పుడు భాగాలు

మొబైల్‌లోని తప్పు భాగాలు స్మార్ట్‌ఫోన్ పునఃవిక్రయం విలువపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. ఉదాహరణకు, పని చేయని వాల్యూమ్ బటన్లు లేదా నాన్-ఫంక్షనల్ ఎస్టీ కార్డ్ స్లాట్‌లు పరిగణనలోకి తీసుకుంటారు. ఇవి స్మార్ట్ ఫోన్ విలువపై ప్రభావాన్ని చూపుతాయి. 

ఇతర ఉపకరణాలు

స్మార్ట్‌ఫోన్‌ను విక్రయించేటప్పుడు దానితో అందించిన అన్ని ఉపకరణాలు మీ వద్ద ఉన్నాయని నిర్ధారించుకోండి.  ఉదాహరణకు, కొన్ని పరికరాలు టైప్ సీ నుంచి 3.5 ఎంఎం ఆడియో జాక్ కనెక్టర్‌లతో వస్తాయి. అటువంటి ఉపకరణాలు ఏవైనా పోతే ఇది మీ స్మార్ట్‌ఫోన్ పునఃవిక్రయం విలువను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..