Spam Calls Block: స్పామ్ కాల్స్ వేధిస్తున్నాయా? ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఫోన్‌లో వాటిని బ్లాక్ చేసేయండిలా..!
విసిగిస్తున్న కాల్స్ నుంచి చాలా మంది ఆ నంబర్లను బ్లాక్ చేస్తూ ఉంటారు. అయితే తరచూ నంబర్లు మార్చి చేయడంతో బ్లాక్ చేయడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. మన పరిస్థితిని అర్థం చేసుకోకుండా వచ్చే స్పామ్ కాల్స్ వల్ల చాలా మంది ఇరిటేషన్‌కు గురవుతారు. అయితే ఒక్కోసారి స్పామ్ కాల్స్ చేసేవారు మనల్ని మాటల్లో పెట్టి వివిధ మెసేజ్‌లను యాక్సెప్ట్ చేయించి మన డేటాను తస్కరించే అవకాశం ఉంది.
మారుతున్న టెక్నాలజీ ప్రకారం ఫోన్ వాడకం అనేది తప్పనిసరైంది. ప్రతి ఇంట్లో రెండు నుంచి మూడు ఫోన్లు ఉంటున్నాయి. అయితే ఫోన్ మాట్లాడడం ఎంత సౌకర్యంగా ఒక్కోసారి మీటింగ్స్‌లో ఉన్నప్పుడు వచ్చే స్పామ్ కాల్స్ లేదా ప్రమోషనల్ కాల్స్ ఇబ్బంది పెడుతున్నాయి. విసిగిస్తున్న కాల్స్ నుంచి చాలా మంది ఆ నంబర్లను బ్లాక్ చేస్తూ ఉంటారు. అయితే తరచూ నంబర్లు మార్చి చేయడంతో బ్లాక్ చేయడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. మన పరిస్థితిని అర్థం చేసుకోకుండా వచ్చే స్పామ్ కాల్స్ వల్ల చాలా మంది ఇరిటేషన్‌కు గురవుతారు. అయితే ఒక్కోసారి స్పామ్ కాల్స్ చేసేవారు మనల్ని మాటల్లో పెట్టి వివిధ మెసేజ్‌లను యాక్సెప్ట్ చేయించి మన డేటాను తస్కరించే అవకాశం ఉంది. ఇన్ని ఇబ్బందుకు గురి చేసే స్పామ్ కాల్స్‌ను రక్షణ కోసం కొన్ని చర్యలు తీసుకుంటే సరిపోతుంది. మన ఫోన్‌లో కొన్ని సెట్టింగ్స్ మారిస్తే స్పామ్ కాల్స్ నుంచి బయటపడవచ్చు. టెక్ నిపుణులు సూచించే ఆ సింపుల్ టెక్నిక్స్ ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
ఆండ్రాయిడ్ ఫోన్స్ సెట్టింగ్స్ మార్పు ఇలా
మీ ఆండ్రాయిడ్ పరికరంలో ఫోన్ యాప్‌ను తెరవాలి. సాధారణంగా స్క్రీన్ కుడి ఎగువ మూలలో ఉండే మూడు-చుక్కల మెనుని ఎంచుకోండి. మెను నుంచి “సెట్టింగ్‌లు”కి ఎంచుకోండి. అక్కడ “బ్లాక్ చేసిన కాంటాక్ట్స్” కోసం చూసి, దానిని ఎంచుకోండి. “గుర్తించబడని కాలర్ల నుంచి కాల్‌లను బ్లాక్ చేయి”పై టోగుల్ చేయండి. అంతే తెలియని నంబర్‌ల నుంచి ఇక మనల్ని ఇబ్బంది పెట్టవు
ఐఫోన్‌లో సెట్టింగ్స్ మార్పు ఇలా
మీ ఐఫోన్‌లోని ఫోన్ యాప్‌ని తెరవాలి. మీరు బ్లాక్ చేయాలనుకుంటున్న నంబర్‌ను గుర్తించి దాని ప్రక్కన ఉన్న సమాచార బటన్‌ను నొక్కాలి. సమాచార బటన్ సర్కిల్‌లో ఉన్న చిన్న అక్షరం ఐ ద్వారా సూచిస్తుంది. అనంతంర కిందికి స్క్రోల్ చేసి, ఈ కాలర్‌ని నిరోధించు అని వచ్చే ఎంపికను ఎంచుకోవాలి. నిర్దిష్ట నంబర్ నుంచి కాల్‌లను బ్లాక్ చేయడానికి “ఈ కాలర్‌ని నిరోధించు”పై నొక్కాలి. మీరు కేవలం సెట్టింగ్‌లకు వెళ్లి ఫోన్ సైలెన్స్ ఎంపికను తెలియని కాలర్‌లకు ఎంచుకుుని ఈ ఫీచర్‌ని ఆన్ చేయడం ద్వారా ఐఫోన్‌లో తెలియని కాలర్‌లను దూరం పెట్టవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..