ఒకేసారి 6500 ఈ కామర్స్ వెబ్‌సైట్లు హ్యాక్!

ప్రపంచవ్యాప్తంగా ఈ కామర్స్ వ్యాపారాలు నిర్వహిస్తున్న 6500 వెబ్‌సైట్లు ఒకే ఒక్క దెబ్బతో హ్యాక్ అయ్యాయి. వాటిలో తమ డెబిట్ క్రెడిట్ కార్డు వివరాలు సేవ్ చేసుకున్న అనేక మంది కస్టమర్ల సమాచారం ప్రమాదంలో పడింది. సహజంగా ఒక వెబ్‌సైట్ హ్యాకింగ్ కి గురవటం మనం చూస్తూ ఉంటాం. అయితే వివిధ వెబ్ సైట్లని హోస్టింగ్ చేసే హోస్టింగ్ సర్వర్ హాకింగ్ కు గురయితే దాని ద్వారా నిర్వహించబడుతున్న అన్ని వెబ్ సైట్లు ప్రమాదంలో పడతాయి. తాజాగా […]

ఒకేసారి 6500 ఈ కామర్స్ వెబ్‌సైట్లు హ్యాక్!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Oct 10, 2019 | 4:06 PM

ప్రపంచవ్యాప్తంగా ఈ కామర్స్ వ్యాపారాలు నిర్వహిస్తున్న 6500 వెబ్‌సైట్లు ఒకే ఒక్క దెబ్బతో హ్యాక్ అయ్యాయి. వాటిలో తమ డెబిట్ క్రెడిట్ కార్డు వివరాలు సేవ్ చేసుకున్న అనేక మంది కస్టమర్ల సమాచారం ప్రమాదంలో పడింది. సహజంగా ఒక వెబ్‌సైట్ హ్యాకింగ్ కి గురవటం మనం చూస్తూ ఉంటాం. అయితే వివిధ వెబ్ సైట్లని హోస్టింగ్ చేసే హోస్టింగ్ సర్వర్ హాకింగ్ కు గురయితే దాని ద్వారా నిర్వహించబడుతున్న అన్ని వెబ్ సైట్లు ప్రమాదంలో పడతాయి. తాజాగా ఇలాగే జరిగింది. Volusion అనేది ఇ-కామర్స్ వెబ్‌సైట్లని హోస్ట్ చేసే ఒక పాపులర్ ప్లాట్ ఫారం. అయితే తాజాగా ఇది హ్యాక్ కావటం వలన ప్రపంచవ్యాప్తంగా దాంట్లో తమ సొంత ఆన్లైన్ స్టోర్స్ నిర్వహిస్తున్న అనేకమంది వెబ్‌సైట్లు ప్రమాదంలో పడ్డాయి.

ఆయా వెబ్‌సైట్లలోకి తమ కొనుగోలు పూర్తయిన తర్వాత ఖాతాదారులు క్రెడిట్ మరియు డెబిట్ కార్డు సమాచారం ఎంటర్ చేసి, బిల్లింగ్ కి పూనుకునే సమయంలో ఆ డేటా మొత్తాన్నీ హ్యాకర్లు తస్కరించడం జరుగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో వినియోగదారుల యొక్క సెన్సిటివ్ డేటాని దొంగిలించే విధంగా హ్యాకర్లు ప్రమాదకరమైన కోడ్ వెబ్‌సైట్లలో చొప్పించడం జరిగింది. Magecart Attack అనే పేరుతో పిలువబడే ఈ ప్రమాదకరమైన కోడ్ మనం ఏటీఎం మెషిన్స్ విషయంలో అనేక సందర్భాల్లో చూసిన ఏటీఎం స్కిమ్మర్ల మాదిరిగానే వినియోగదారుల కార్డుల డేటాని సేకరించడం జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 6593 ఈ కామర్స్ వెబ్‌సైట్లు ఈ ప్రమాదం బారిన పడ్డాయి. ఒకవేళ వీటిలో మీరు దేంట్లో అయినా కొనుగోలు చేసి ఉన్నట్లయితే కచ్చితంగా మీ డేటా ప్రమాదంలో పడుతుంది. అధికశాతం వెబ్సైట్లు యూఎస్ లో నివసిస్తున్న వారికి చెందినవి కావడం గమనార్హం. కాబట్టి భారతీయ వినియోగదారులు కొంతవరకు ఊపిరి పీల్చుకోవచ్చు గానీ, ఒకవేళ అక్కడ నివసిస్తున్న వారు ఎవరైనా ఈ ప్రమాదంలో పడితే మాత్రం కచ్చితంగా మీ కార్డ్ బ్లాక్ చేయించుకోవడం మంచిది.