అదిరిపోయే ఫీచర్లతో… మార్కెట్లోకి వన్ ప్లస్ 7టీ ప్రో!
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ ప్లస్ దూకుడు పెంచింది. తాజాగా వన్ ప్లస్ 7 సిరీస్‌లో వచ్చిన వన్ ప్లస్ 7టీకి కొనసాగింపుగా ‘వన్ ప్లస్ 7టీ ప్రొ’ పేరుతో మరో కొత్త ఫోన్‌ను తీసుకువచ్చింది. అంచనాలను నిజం చేస్తూ అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చేసింది వన్ ప్లస్ 7టీ ప్రో. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంతో వచ్చిన మొదటి ఫోన్ ఇదే. వివరాల్లోకెళితే… వన్ ప్లస్ 7టీలో లాగా కాకుండా వన్ ప్లస్ […]
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ ప్లస్ దూకుడు పెంచింది. తాజాగా వన్ ప్లస్ 7 సిరీస్‌లో వచ్చిన వన్ ప్లస్ 7టీకి కొనసాగింపుగా ‘వన్ ప్లస్ 7టీ ప్రొ’ పేరుతో మరో కొత్త ఫోన్‌ను తీసుకువచ్చింది. అంచనాలను నిజం చేస్తూ అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చేసింది వన్ ప్లస్ 7టీ ప్రో. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంతో వచ్చిన మొదటి ఫోన్ ఇదే. వివరాల్లోకెళితే…
వన్ ప్లస్ 7టీలో లాగా కాకుండా వన్ ప్లస్ 7టీ ప్రోలో 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఒక్కటి మాత్రమే అందుబాటులో ఉంది. దాని ధరను రూ.53,999గా నిర్ణయించారు. వన్ ప్లస్ 7టీ ప్రో కేవలం హేజ్ బ్లూ కలర్ వేరియంట్ లో మాత్రమే లభించనుంది. దీనికి సంబంధించిన సేల్ అక్టోబర్ 12న మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, వన్ ప్లస్ అధికారిక వెబ్ సైట్, వన్ ప్లస్ ఆఫ్ లైన్ స్టోర్లలో ప్రారంభం కానుంది. దేశంలో ఉన్న 8 వన్ ప్లస్ ఎక్స్ క్లూజివ్ స్టోర్లలో ఒక్క రోజు ముందుగా అంటే అక్టోబర్ 11న మధ్యాహ్నం 12 గంటలకు ఒక స్పెషల్ సేల్ నిర్వహించనున్నారు. ఆన్ లైన్ లో ఎటువంటి స్పెషల్ సేల్ ను నిర్వహించబోవడం లేదు.
వన్ ప్లస్ 7టీ ప్రో లో 6.67 అంగుళాల AMOLED డిస్ ప్లే అందించారు. దీని రిజల్యూషన్ 3120×1440 పిక్సెల్స్ గా ఉంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కావడం విశేషం. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే, ఇందులో అత్యంత వేగవంతమైన క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్ ను ఉపయోగించారు. వన్ ప్లస్ 7టీలా కాకుండా ఇందులో వెనకవైపు మూడు కెమెరాలను నిలువుగా అమర్చారు. వీటిలో ప్రధాన కెమెరాగా 48 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న సోనీ ఐఎంఎక్స్586 సెన్సార్ ను ఉపయోగించారు. 16 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ తో 117 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ వరకు కవర్ చేయవచ్చు.
అలాగే టెలిఫొటో లెన్స్ సామర్థ్యం 8 మెగా పిక్సెల్ గా ఉంది. ఇక సెల్ఫీ ప్రియుల కోసం 16 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న సోనీ ఐఎంఎక్స్471 పాపప్ సెల్ఫీ కెమెరాను అందించారు. ఇందులో 4085 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని అందించారు. Warp Charge 30T ఫీచర్ కూడా ఉండటంతో చార్జింగ్ అత్యంత వేగంగా ఎక్కుతుంది. ఇక ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్ లాక్, డాల్బీ అట్మాస్, హెచ్ డీఆర్ 10+ వంటి ఫీచర్లను కూడా ఇందులో అందించారు. దీనికి సంబంధించిన అమ్మకాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.