AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మార్కెట్లోకి యాపిల్ బడ్జెట్ ఫోన్… ఎప్పుడంటే?

సాధారణంగా యాపిల్ ఫోన్లంటే కేవలం ధనవంతులకు మాత్రమే అనే అభిప్రాయం అందరిలో ఉంటుంది. అయితే ఆ అభిప్రాయాన్ని అబద్ధం చేస్తూ తక్కువ ధరలో ఐఫోన్ SEని యాపిల్ 2016లో లాంచ్ చేసింది. దీని ధర కేవలం రూ.19,999 మాత్రమే. ఆ ఫోన్ వచ్చి దాదాపు మూడేళ్లు గడిచిపోయిన అనంతరం దానికి తర్వాతి వెర్షన్ ఐఫోన్ SE2కు సంబంధించిన వార్తలు వచ్చాయి. ఈ ఫోన్ వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో(జనవరి-మార్చి) మార్కెట్లోకి రానుందని ప్రముఖ యాపిల్ అనలిస్ట్ మింగ్-చి […]

మార్కెట్లోకి యాపిల్ బడ్జెట్ ఫోన్... ఎప్పుడంటే?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 11, 2019 | 3:50 PM

Share

సాధారణంగా యాపిల్ ఫోన్లంటే కేవలం ధనవంతులకు మాత్రమే అనే అభిప్రాయం అందరిలో ఉంటుంది. అయితే ఆ అభిప్రాయాన్ని అబద్ధం చేస్తూ తక్కువ ధరలో ఐఫోన్ SEని యాపిల్ 2016లో లాంచ్ చేసింది. దీని ధర కేవలం రూ.19,999 మాత్రమే. ఆ ఫోన్ వచ్చి దాదాపు మూడేళ్లు గడిచిపోయిన అనంతరం దానికి తర్వాతి వెర్షన్ ఐఫోన్ SE2కు సంబంధించిన వార్తలు వచ్చాయి. ఈ ఫోన్ వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో(జనవరి-మార్చి) మార్కెట్లోకి రానుందని ప్రముఖ యాపిల్ అనలిస్ట్ మింగ్-చి కువో తెలిపారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఐఫోన్ 11లో ఉపయోగించిన ఏ13 చిప్ సెట్ ను ఇందులో కూడా ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఐఫోన్లలో ఉపయోగించే అత్యంత వేగవంతమైన చిప్ ఇదే. ఐఫోన్ 8 డిజైన్ మాదిరిగానే దీని డిజైన్ ఉండనుందని సమాచారం. దీని స్క్రీన్ సైజ్ 4.7 అంగుళాలుగా ఉండవచ్చు. ఇందులో 3 జీబీ ర్యామ్ కూడా ఉంటుందని, పనితీరు విషయంలో ఐఫోన్ 11కు ఏమాత్రం తీసిపోదని కువో పేర్కొన్నారు. అయితే ఇందులో ఫింగర్ ప్రింట్ అన్ లాక్ ఉంటుందో, ఫేస్ అన్ లాక్ ఉంటుందో మాత్రం ఇంకా తెలియరాలేదు. ఇక దీని ధర రూ.26,990గా ఉండొచ్చని అంచనా.

లుక్ విషయంలో ఈ ఫోన్ ఐఫోన్ నాచ్ తో ఉండి, ఐఫోన్ X మాదిరిగా ఉంటుందని కొందరు, 4.7 అంగుళాల డిస్ ప్లేతో ఐఫోన్ 8 తరహాలో ఉంటుందని కొందరు అంటున్నారు. అయితే ఇప్పటి దాకా లీకైన వివరాలు, ఫొటోలను బట్టి చూస్తే ఈ ఫోన్ 4.7 అంగుళాల స్క్రీన్ సైజ్ తో ఐఫోన్ X తరహాలో ఉండనున్నట్లు తెలిసింది.

అయితే ఈ ఫోన్ విషయమై ప్రజల్లో కొన్ని అంచనాలు ఉన్నాయి. ఇది లాంచ్ అయ్యే సమయానికి ఈ అంచనాలు మరింతగా పెరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. యాపిల్ కెమెరా విషయంలో ఇప్పటికే నిర్దేశించిన ప్రమాణాలను అందుకునే విధంగా కెమెరా ఉండాలి. తక్కువ ధర మొబైల్ కదా అని కెమెరాను అశ్రద్ధ చేస్తే మొదటికే మోసం తప్పదు. మరీ రూ.1.4 లక్షల విలువైన ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ తరహా కెమెరాలు లేకపోయినా మరీ తీసి పడేసేలా కూడా ఉండకూడదు. అలాగే ఫోన్లలో స్టైలింగ్ గురించి చూసుకునేవారికి అవసరమైనన్ని రంగుల్లో కూడా ఈ ఫోన్ అందుబాటులో ఉండటం ముఖ్యం. అంతే కాకుండా మిగతా ఐఫోన్ల తరహాలో సుదీర్ఘ జీవితకాలం కూడా ముఖ్యమే.

ఈ సెప్టెంబర్ లోనే యాపిల్ 6.4 అంగుళాల ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ ను, 5.8 అంగుళాల ఐఫోన్ 11 ప్రోను, 6.1 అంగుళాల ఐఫోన్ 11ను లాంచ్ చేసింది. ఇక ఈ ఐఫోన్ SE 2 వచ్చే ఏడాది ప్రారంభంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని కువో తెలిపారు. ఎందుకంటే యాపిల్ కు సంబంధించిన తర్వాతి వెర్షన్ ఫోన్లు ఎలాగో సెప్టెంబర్-అక్టోబర్ మధ్యలో లాంచ్ అవుతాయి. వాటికి, ఈ ఐఫోన్ ఎస్ఈకి మధ్య కాస్త గ్యాప్ ఉండాలి కాబట్టి ఈ బడ్జెట్ ఐఫోన్ గురించిన శుభవార్త మనం త్వరలోనే వినవచ్చు.