World Sparrows Day: మీకు ఇది తెలుసా.. పిచ్చుకల కోసం ప్రత్యేక దినోత్సవం.. అది ఎప్పుడంటే..?
పిచ్చుకల కిలకిల రాగాలు కానరావడంలేదు.. పర్యావరణ పరిరక్షణ, వైవిద్య జీవనానికి దోహదపడే పిచ్చుకలు, పిట్టలు కనిపించడం లేదు. కారణం సెల్ ఫోన్ టవర్స్ ఎఫెక్ట్.. రేడియేషన్ ప్రభావంతో పక్షుల సంతతి అంతరించి పోతుంది. అయితే కనుమరుగవుతున్న పిచ్చుకల కోసం ఓ యువకుడు సంకల్ప దీక్షకు పూనుకున్నాడు. దీంతో కరీంనగర్ నగరంలో అనంతుల రమేష్ నిలయం పిట్టలకు అవాసంగా మారింది.

పిచ్చుకల కిలకిల రాగాలు కానరావడంలేదు.. పర్యావరణ పరిరక్షణ, వైవిద్య జీవనానికి దోహదపడే పిచ్చుకలు, పిట్టలు కనిపించడం లేదు. కారణం సెల్ ఫోన్ టవర్స్ ఎఫెక్ట్.. రేడియేషన్ ప్రభావంతో పక్షుల సంతతి అంతరించి పోతుంది. అయితే కనుమరుగవుతున్న పిచ్చుకల కోసం ఓ యువకుడు సంకల్ప దీక్షకు పూనుకున్నాడు. దీంతో కరీంనగర్ నగరంలో అనంతుల రమేష్ నిలయం పిట్టలకు అవాసంగా మారింది.
కరీంనగర్ లోని కిసాన్ నగర్ చెందిన అనంతుల రమేష్ ఇంటి ఆవరణలో ఎటు చూసినా పిచ్చుకలు కనిపిస్తుంటాయి. వాటి కోసం అతను ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. మొదట ఒక్కటి, రెండు పక్షులు ఇంటి అవరణకు వచ్చేవి. వాటికి గూడు లేక, ఆహారం లేక ఇబ్బంది పడ్డాయి. వాటిని రమేష్ గమనించాడు. దీంతో పిచ్చుకల కోసం ప్రత్యేక గూళ్లు ఏర్పాటు చేశాడు. వాటి దాహం తీర్చేందుకు చిన్న చిన్న నీటి తొట్టులను అమర్చాడు. మరీ ముఖ్యంగా ఎండాకాలంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడు ఈ పక్షి ప్రేమికుడు.
పిచ్చుకలకు కావాల్సిన ఆహారం కూడా ఏర్పాటు చేశాడు. కరీంనగర్ లోని ఇంటి ఆవరణలో చెట్లు కూడా ఉండటంతో క్రమంగా వీటి సంఖ్య పెరిగిపోయింది. వేసవి కాలంలో నీటి సమస్య రాకుండా చిప్పలు ఏర్పాటు చేసి నీళ్ళు పోసి పెడుతున్నాడు. దీంతో పిచ్చుకలన్నీ అక్కడికే వస్తున్నాయి. దాదాపుగా 300 నుంచీ 400 వరకు పిచ్చుకలు ఈ ఇంటి అవరణలో కనిపిస్తాయి. వీటికి ఆహారంగా వివిధ రకాల గింజలను అందిస్తున్నారు. కొన్ని పక్షులు సహజంగానే రమేష్ ఇంట్లో గూళ్లు ఏర్పాటు చేసుకున్నాయి. రమేష్ కూడా వాటి కోసం డబ్బాలు ఏర్పాటు చేసి వాటిలో.. ఆహారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఉదయం ఆరు గంటలకు ఈ ఇంటి నిండా ఎటు చూసినా పక్షులే దర్శనమిస్తున్నాయి. కిలకిలరాగాలతో సందడి చేస్తుంటాయి. వాటి అరుపులతో ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. వివిధ ప్రాంతాలకు వెళ్లిన తరువాత.. సాయంత్రం ఆరు తరువాత… మళ్లీ గూటికి చేరుకుంటాయి. ఈ ప్రాంతంలో అతనిని పిచ్చుకల రమేష్ అనే పేరు ముద్ర పడిపోయింది.
కిలకిలరాగాలతో పిట్టలు రమేష్ ఇంట్లో సందటి చేస్తున్నాయి. పాఠశాల విద్యార్థులు పిచ్చుకలను చూడటానికి కోసం ప్రత్యేకంగా రమేష్ ఇంటికి వస్తున్నారు. సెల్ఫోన్లలో పిచ్చుకల ఫోటోలు తీసుకుని మురిసిపోతున్నారు. కాసేపు ఈ ప్రాంతంలో సరదాగా గడుపుతున్నారు. పిచ్చుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశానని రమేష్ చెబుతున్నారు. వాటికి ఆహారంతో పాటు.. నీటిని అందిస్తున్నానని చెబుతున్నారు. కాగా వేసవి కాలంలో పిచ్చుకల కోసం అధికంగా తాగు నీటిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు రమేష్. ఈ ప్రాంతం లో వీటి సంఖ్య రోజు రోజు రోజుకూ పెరుగుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నాడు. పిచ్చుకలు ఇంట్లోకి వస్తే చాలా సంతోషంగా ఉంటుందని రమేష్ చెబుతున్నారు.
మానవుడి మనుగడ కొన్ని రకాల పిట్టలతో ముడి పడి ఉంది. అలాంటి పిట్టలు, పిచ్చుకలు అంతరించిపోతున్నాయి. రేడియేషన్ ప్రభావంతో కనిపించకుండా పోయాయి. నీరు ఆహారం దొరకక చనిపోతున్నాయి. ఎప్పుడూ సందడిగా ఉండే పిచ్చుకలు కనిపించడమే అరుదు.. కానీ కరీంనగర్ కిసాన్ నగర్ కు చెందిన యువకుడు అనంతుల రమేష బర్డ్ లవర్‌గా మారడం సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. తన ఇంటినే పిట్టలకు ఆవాసంగా మార్చిన రమేష్ ను పలువురు అభినందిస్తున్నారు. ఇంటిలో పిట్ట గూళ్ళు, జాలితో స్థావరం ఏర్పాటు చేసి పిట్టలకు కావాల్సిన వసతులు అందిస్తున్నాడు. దీంతో వాటి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. రమేష్ ఇంట్లో పిట్టల సందడి వాతావరణం నెలకొంది. అంతరించిపోతున్న పక్షులను పాడుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని రమేష్ కోరుతున్నాడు. సమ్మర్ లో ప్రతి ఇంటి ముందు పక్షుల కోసం నీళ్లు పెట్టి కాస్త తిండి గింజలు వేస్తే పక్షులను కాపాడుకున్న వాళ్ళం అవుతామని పక్షి ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
