AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samsung 4K UHD TV: 4కే రిజల్యూషన్‌తో శామ్సంగ్ నుంచి చవకైన స్మార్ట్ టీవీ లాంచ్.. సూపర్ స్మార్ట్ ఫీచర్లతో ట్రెండింగ్..

ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆండ్రాయిడ్ యాప్ లతో టీవీలు ఆకర్షిస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్లు, అధిక పిక్చర్, సౌండ్ క్లారిటీతో థియేటర్ అనుభవాన్ని ఈ స్మార్ట్ టీవీలు అందిస్తున్నాయి. దీంతో స్మార్ట్ టీవీలకు మార్కెట్ల్ డిమాండ్ మళ్లీ పెరిగింది. ఇదే క్రమంలో ప్రముఖ టెక్ దిగ్గజం శామ్సంగ్ మరో అడుగు ముందుకేసింది. అతి తక్కువ ధరలోనే సరికొత్త క్రిస్టల్ విజన్ 4కే టీవీని మన దేశంలో లాంచ్ చేసింది.

Samsung 4K UHD TV: 4కే రిజల్యూషన్‌తో శామ్సంగ్ నుంచి చవకైన స్మార్ట్ టీవీ లాంచ్.. సూపర్ స్మార్ట్ ఫీచర్లతో ట్రెండింగ్..
Samsung Crystal Vision 4k Tv
Follow us
Madhu

|

Updated on: Aug 05, 2023 | 5:15 PM

ఒకప్పుడు ఇంట్లో ఎంటర్‌టైన్‌మెంట్ కావాలంటే జనాలకు టీవీలే ఆధారం. అయితే స్మార్ట్ ఫోన్ల రాక, పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన ఇంటర్నెట్ తో టీవీల వాడకం తగ్గిపోయింది. అయితే అందివస్తున్న ఆధునిక సాంకేతికతను జోడించిన టీవీల ఉత్పత్తి దారులు వాటి కూడా స్మార్ట్ బాట పట్టించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆండ్రాయిడ్ యాప్ లతో టీవీలు ఆకర్షిస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్లు, అధిక పిక్చర్, సౌండ్ క్లారిటీతో థియేటర్ అనుభవాన్ని ఈ స్మార్ట్ టీవీలు అందిస్తున్నాయి. దీంతో స్మార్ట్ టీవీలకు మార్కెట్ల్ డిమాండ్ మళ్లీ పెరిగింది. ఇదే క్రమంలో ప్రముఖ టెక్ దిగ్గజం శామ్సంగ్ మరో అడుగు ముందుకేసింది. అతి తక్కువ ధరలోనే సరికొత్త క్రిస్టల్ విజన్ 4కే టీవీని మన దేశంలో లాంచ్ చేసింది. ఈ శామ్సంగ్ కొత్త స్మార్ట్ టీవీలో మల్టీ-వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్, ఇన్‌బిల్ట్ ఐఓటీ హబ్ వంటి అధునాతన ఫీచర్లను జోడించింంది. ఈ స్మార్ట్ టీవీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

శామ్సంగ్ క్రిస్టల్ విజన్ 4కే యూహెచ్‌డీ టీవీ..

శామ్సంగ్ నుంచి లాంచ్ కొత్త 4కే టీవీ మూడు పరిమాణాల్లో అందుబాటులో ఉంది. 43-అంగుళాలు, 55-అంగుళాలు, 65-అంగుళాలతో ఆకర్షణీయమైన డిజైన్ ను కలిగి ఉంది. 3 సైడ్ బిజెల్ డిజైన్ తో వస్తుంది. వీటిలో ప్యూర్ కలర్, వన్ బిలియన్ ట్రూ కలర్ తో అద్భుతమైన వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. క్రిస్టల్ ప్రాసెసర్ 4కేతక్కువ-రిజల్యూషన్ కంటెంట్ 4కేకి అప్‌స్కేల్ చేస్తుంది. దీని డిస్ప్లే హెచ్ డీఆర్ తో వస్తుంది. స్మార్ట్ వర్క్, గేమింగ్ , స్మార్ట్ వాచింగ్ వంటి మోడ్‌లతో పాటు ఆటో లో లేటెన్సీ మోడ్ (ఏఎల్ఎల్ఎం), మోషన్ ఎక్స్‌లరేటర్ వంటి ఫీచర్‌లను పొందుతారు.

అదిరే సౌండ్ క్లారిటీ..

డాల్డీ డిజిటల్ ప్లస్, ఓటీఎస్ లైట్ (ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ లైట్) లకు సపోర్టు ఇస్తుంది. ఇది 3డీ అనుభవాన్ని పొందేలా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అల్గారిథమ్‌లను ఉపయోగిస్తుంది. అడాప్టివ్ సౌండ్ కూడా ఉంది. ఇది వీక్షిస్తున్న కంటెంట్ ఆధారంగా ఆడియోను సర్దుబాటు చేస్తుంది. మెరుగైన ఆడియో అనుభవం కోసం సౌండ్‌బార్‌తో కనెక్ట్ చేసుకునేందుకు క్యూ సింఫనీ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కొత్త టీవీ అలెక్సా, బిక్స్ బై వాయిస్ అసిస్టెంట్‌లకు మద్దతు ఇస్తుంది. అన్ని స్మార్ట్ పరికరాలను సులభంగా జత చేయడానికి ప్రశాంతమైన బోర్డింగ్‌తో కూడిన ఐఓటీ హబ్, పర్యావరణం ఆధారంగా ప్రకాశాన్ని సర్దుబాటు చేసే ఐఓటీ-ఎనేబుల్డ్ సెన్సార్‌తో వస్తుంది.

టీవీ స్లిమ్‌ఫిట్ క్యామ్‌కు కూడా మద్దతు ఇస్తుంది , ఇది టీవీ ద్వారా వీడియో కాల్‌లను నిర్వహించడంలో మీకు సహాయపడుతుంది. ఇది టైజన్ ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది. శామ్సంగ్ టీవీ ప్లస్ కు యాక్సెస్‌ను కలిగి ఉంది. ఇది సోలార్ సెల్ మోట్‌తో వస్తుంది. ఇది గది లైట్ల ద్వారా ఛార్జ్ అవుతుంది.

ధర, లభ్యత..

శామ్సంగ్ క్రిస్టల్ విజన్ 4కే టీవీ2023 ప్రారంభ ధర రూ. 33,990గా ఉంది. ఫ్లిప్ కార్ట్, శామ్సంగ్ షాప్ ద్వారా ఆగస్టు నాలుగో తేదీ నుంచి వక్రయాలను అందుబాటులో ఉంది. మీరు ఈ టీవీని కొనుగోలు చేయాలనుకొంటే రూ. 3000 వరకూ క్యాష్ బ్యాక్ ఇస్తారు.12 నెలల్ నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. ఈ టీవీకి రెండేళ్ల వారంటీ కూడా ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..