AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samsung S24 Ultra: అదిరే ఆఫర్.. శామ్‌సంగ్ ఫోన్‌పై రూ.50వేల డిస్కౌంట్.. ఎక్కడ కొనాలంటే..?

స్పెషల్ సేల్స్‌లో ఈ కామర్స్ సంస్థలు భారీ డిస్కౌంట్స్ ఇస్తుంటాయి. సాధారణ రోజుల్లో ఆఫర్లు చాలా తక్కువ. కానీ ఒక ఫోన్ మాత్రం సుమారు రూ.50వేల డిస్కౌంట్‌తో వస్తుంది. శామ్‌సంగ్ S24 అల్ట్రా వంటి ప్రీమియం ఫోన్ కావడం విశేషం. ప్రీమియం ఫోన్ కోసం చూసేవారికి ఇది బెస్ట్ ఆఫర్..

Samsung S24 Ultra: అదిరే ఆఫర్.. శామ్‌సంగ్ ఫోన్‌పై రూ.50వేల డిస్కౌంట్.. ఎక్కడ కొనాలంటే..?
Samsung S24 Ultra
Krishna S
|

Updated on: Jul 26, 2025 | 3:53 PM

Share

ప్రస్తుతం ఏది కొనాలన్న ఆన్‌లైన్‌ లోనే.. షాపులకు వెళ్లి కొనడం జనాలు తగ్గించేశారు. అంతేకాకుండా వివిధ యాప్స్ మంచి మంచి ఆఫర్స్ ఇస్తుండడంతో ఆన్‌లైన్‌లో కొనడానికే ఆసక్తి చూపుతున్నారు. ఫోన్స్ విషయానికి వస్తే ఆన్‌లైన్‌లో సూపర్ ఆఫర్స్ ఉంటాయి. స్పెషల్ సేల్స్ పెట్టి భారీ డిస్కౌంట్స్ ఇస్తుంటాయి ఈ కామర్స్ సంస్థలు. సేల్ కాకుండా నార్మల్ రోజుల్లోను కొన్ని ఆఫర్స్ అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం శామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే డిస్కౌంట్ ఇస్తోంది. ఐదు, పది వేలు కాదు ఏకంగా రూ.50వేల డిస్కౌంట్ తో ఈ ఫోన్ లభిస్తుంది.  ఈ ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.79,990కే అందుబాటులో ఉంది. దాని లాంచ్ ధర కంటే ఇది రూ.50,009 తక్కువ. మీరు ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. ఇది బెస్ట్ ఆప్షన్.

ఫోన్‌పై రూ.50,000 డిస్కౌంట్..

ఫ్లిప్ కార్ట్‌లో శామ్‌సంగ్ S24 అల్ట్రా 12GB/256GB మోడల్‌ రూ.1,29,999కి లాంచ్ అయ్యింది. కానీ ఇప్పుడు ఆ ఫోన్ రూ.79,990కి అందుబాటులో ఉంది. ఈ తగ్గింపు టైటానియం బ్లాక్ వేరియంట్‌కు మాత్రమే వర్తిస్తుందని గమనించాలి. మిగితా కలర్స్ ఫోన్స్‌కు సంబంధించి ధరలు భిన్నంగా ఉన్నాయి. శామ్‌సంగ్ S24 అల్ట్రా టైటానియం గ్రే రూ.80,499, టైటానియం వైలెట్ రూ.81,890, టైటానియం ఎల్లో రూ.1,19,999 గా ఉన్నాయి.

S24 అల్ట్రా ఫీచర్స్

శామ్‌సంగ్ S24 అల్ట్రా స్పెసిఫికేషన్లు కూడా బాగున్నాయి. AI ఆధారిత ఫీచర్లు, శక్తివంతమైన ప్రాసెసర్, మెరుగైన కెమెరా సిస్టమ్, స్టైలిష్ డిజైన్, బలమైన బిల్డ్ క్వాలిటీ ఉన్నాయి. ఫాస్ట్ పనితీరు, సాఫ్ట్ మల్టీటాస్కింగ్ కోసం ఈ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఉంది. S24 అల్ట్రాలో 200MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, 10MP 3x ఆప్టికల్ జూమ్, 50MP 5x ఆప్టికల్ జూమ్ లెన్స్‌లతో కూడిన క్వాడ్-లెన్స్ కెమెరా సెటప్ ఉంది. S24 అల్ట్రా 6.8-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది 2600 nits గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉంది మరియు ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్‌లో అనేక ఏఐ ఆధారిత ఫీచర్లు ఉన్నాయి. వీటిలో లైవ్ ట్రాన్స్‌లేషన్, సర్కిల్ టు సెర్చ్, జెనరేటివ్ ఎడిటింగ్ వింటి ఉన్నాయి.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..