Amazon Great Freedom Sale: అదిరిపోయే ఆఫర్లు.. కళ్లు చెదిరే డిస్కౌంట్లు.. సేల్ ఎప్పుడు స్టార్ట్ అంటే..?
మీరు కొత్త వస్తువులు లేదా కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే వెంటనే సెలక్ట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సేల్ సమయంలో మీరు వేలాది ఉత్పత్తులపై బంపర్ డిస్కౌంట్లను పొందవచ్చు.

అమెజాన్ మరో సేల్ తీసుకొచ్చింది. ఇటీవలే ప్రైమ్ డే సేల్ నిర్వహించిన అమెజాన్ ఇప్పుడు గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌తో కస్టమర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన తేదీలను ప్రకటించింది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్ సహా చాలా వస్తువులపై భారీ డిస్కౌంట్స్‌ను అందించనుంది. కొత్త వస్తువులు, కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. అమెజాన్ సేల్‌లో మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఎప్పటిలాగే అమెజాన్ ప్రైమ్ సభ్యులు ఈసారి కూడా సేల్‌ను 12 గంటల ముందే యాక్సెస్ చేయొచ్చు. స్మార్ట్‌ఫోన్‌లు, గ్యాడ్జెట్స్, ల్యాప్‌టాప్‌లు సహా వేలాది ఉత్పత్తులను తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది.
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ డేట్లు ఇవే..
అమెజాన్ సేల్ ఆగస్టు 1 నుండి ప్రారంభమవుతుంది. కానీ ప్రైమ్ సభ్యులు 12 గంటల ముందుగానే సేల్ యాక్సెస్ పొందుతారు. సేల్ కోసం అమెజాన్‌లో ప్రత్యేక పేజీని సిద్ధం చేశారు. సేల్ సమయంలో మీరు ట్రెండింగ్ డీల్స్, రాత్రి 8 గంటల డీల్స్, బ్లాక్‌బస్టర్ డీల్స్, ఎక్స్‌ఛేంజ్‌తో బ్లాక్‌బస్టర్ డీల్స్ వంటి ప్రయోజనాలను పొందచ్చని సంస్థ చెబుతోంది.
సేల్‌లో అదనపు డిస్కౌంట్స్ ఎలా..?
అమెజాన్ ఈ సేల్ కోసం ఎస్బీఐతో చేతులు కలిపింది. మీరు సేల్ సమయంలో ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో బిల్లు చెల్లిస్తే, మీకు 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. డిస్కౌంట్ ప్రయోజనం పూర్తి చెల్లింపు, ఈఎంఐ లావాదేవీలపై అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ కాకుండా ఎక్స్‌ఛేంజ్ ఆఫర్, వడ్డీ లేని ఈఎంఐ ప్రయోజనాన్ని పొందుతారు.
అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్
అమెజాన్‌లో షాపింగ్‌కు సంబంధించి రకరకాల ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ముందస్తు యాక్సెస్ కోరుకుంటే ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ ప్లాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ కోసం మీరు ఏడాదికి రూ.399 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌తో మీరు ఫ్రీ డెలివరీ, సేమ్ డెలివరీ, ముందస్తు యాక్సెస్, అమెజాన్ పే క్రెడిట్ కార్డ్‌తో షాపింగ్‌పై 5శాతం క్యాష్‌బ్యాక్ వంటి ప్రయోజనాలను పొందుతారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




