AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samsung Fab Grab Fest: శామ్సంగ్‌ సమ్మర్‌ డీల్స్‌.. టాప్‌ లేపుతున్నాయ్‌.. ఏకంగా 77శాతం డిస్కౌంట్స్‌

ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ బ్రాండ్‌ శామ్సంగ్‌ కూడా ఈ జాబితాలో చేరి సమ్మర్‌ సేల్‌ను ప్రకటించింది. ఫ్యాబ్‌ గ్రాబ్‌ ఫెస్ట్‌ పేరుతో ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు వెల్లడించింది. శామ్సంగ్‌ యాప్‌తో పాటు, శామ్సంగ్‌ అధికారిక వెబ్‌ సైట్, శామ్సంగ్‌ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లలో విస్తృత శ్రేణి ఉత్పత్తులపై భారీ తగ్గింపులతో పాటు క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను అందిస్తోంది. ఈ ఆఫర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Samsung Fab Grab Fest: శామ్సంగ్‌ సమ్మర్‌ డీల్స్‌.. టాప్‌ లేపుతున్నాయ్‌.. ఏకంగా 77శాతం డిస్కౌంట్స్‌
Samsung Store
Madhu
|

Updated on: May 05, 2024 | 4:53 PM

Share

అన్ని ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ప్లాట్‌ఫారంలలో ఆఫర్ల జాతర కొనసాగుతోంది. ప్రముఖ స్టోర్లు, పేరుగాంచిన ఈ-కామర్స్‌ వెబ్‌ సైట్లు ప్రత్యేక సమ్మర్‌ సేల్స్‌ ప్రకటించి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ బ్రాండ్‌ శామ్సంగ్‌ కూడా ఈ జాబితాలో చేరి సమ్మర్‌ సేల్‌ను ప్రకటించింది. ఫ్యాబ్‌ గ్రాబ్‌ ఫెస్ట్‌ పేరుతో ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు వెల్లడించింది. శామ్సంగ్‌ యాప్‌తో పాటు, శామ్సంగ్‌ అధికారిక వెబ్‌ సైట్, శామ్సంగ్‌ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లలో విస్తృత శ్రేణి ఉత్పత్తులపై భారీ తగ్గింపులతో పాటు క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను అందిస్తోంది. ఈ ఆఫర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

శామ్సంగ్‌ ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్..

గ్యాడ్జెట్లపై ఆఫర్లు.. ‘ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్’ సందర్భంగా వినియోగదారులు గెలాక్సీ ఎస్‌ సిరీస్, గెలాక్సీ జెడ్‌ సిరీస్‌ గెలాక్సీ ఏ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ మోడళ్లలో ఎంపిక చేసిన వేరియంట్‌లపై 64 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. గెలాక్సీ టాబ్లెట్‌లు, ఉపకరణాలు, వేరబుల్స్‌ పై 77 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంటాయి. గెలాక్సీ బుక్‌4 సిరీస్ ల్యాప్‌టాప్‌ల ఎంపిక చేసిన మోడల్‌ల కొనుగోలుపై, కస్టమర్‌లు 24 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు.

స్మార్ట్‌ టీవీలపై ఆఫర్లు.. నియో క్యూఎల్‌ఈడీ 8కే, నియో క్యూఎల్‌ఈడీ, ఓఎల్‌ఈడీ, ద ఫ్రేమ్‌ టీవీ, క్రిస్టల్‌ యూహెచ్‌డీ సిరీస్‌ వంటి శామ్సంగ్‌ స్మార్ట్‌ టీవీల మోడళ్లపై ఎంపిక చేసిన వాటిపై గరిష్టంగా 43 శాతం తగ్గింపు ఉంటుంది. వీటిపై 20,000 వరకు బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌ను సైతం పొందవచ్చు. అదనంగా, కస్టమర్‌లు అన్ని టీవీల కొనుగోలుపై ఎక్స్‌ఛేంజ్ బోనస్‌గా రూ. 5000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు .

గృహోపకరణాలపై ఆఫర్లు.. 2024 రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్‌లు, మానిటర్లు, ఎయిర్ కండీషనర్‌లు వంటి అనేక డిజిటల్ ఉపకరణాలపై తగ్గింపులు, మునుపెన్నడూ చూడని తగ్గింపు ధరలను అందిస్తుంది.

  • ‘బై మోర్ సేవ్ మోర్’ ప్లాట్‌ఫారమ్‌తో, కస్టమర్‌లు శామ్సంగ్‌ యాప్‌, శామ్సంగ్‌ షాప్ యాప్ ద్వారా రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉత్పత్తుల కొనుగోలుపై అదనంగా ఐదు శాతం ఆదా చేసుకోగలుగుతారు. ‘బై మోర్ సేవ్ మోర్’ ప్లాట్‌ఫారమ్ వినియోగదారులను సామ్‌సంగ్ ఉత్పత్తుల హోస్ట్‌పై బండిల్డ్ ఆఫర్‌లను ఆస్వాదించడానికి అనుమతిస్తుంది.
  • కస్టమర్‌లు సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్‌లు, సొగసైన ఫ్రెంచ్-డోర్ రిఫ్రిజిరేటర్‌లు, బహుముఖ ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్‌లు వంటి విస్తృత శ్రేణి ప్రీమియం ఉపకరణాలపై 48 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. మూడు లేదా అంతకంటే ఎక్కువ ఎంచుకున్న ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా బెస్పోక్ ఏఐ ప్యాకేజీతో వారి వంటగది అనుభవాన్ని మెరుగుపరచుకోవచ్చు. అదనపు 10 శాతం తగ్గింపును పొందగలరు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..