AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reliance Jio: రూ.15వేలకే ల్యాప్ టాప్.. రిలయన్స్ సరికొత్త ఆవిష్కరణ.. లాంచింగ్ ఎప్పుడంటే..

ముఖ్యంగా విద్యారంగంలో ల్యాప్ టాప్ లను అధికంగా వినియోగిస్తున్నారు. అయితే వీటి ధరలు ఎక్కువగా ఉంటుండంతో విద్యార్థుల తల్లిందండ్రులు సెకండ్ హ్యాండ్ ల్యాప్ టాప్ ల వైపు మొగ్గచూపుతున్నారు. అవి కూడా దాదాపు రూ. 10వేల నుంచి ప్రారంభమై రూ. 20వేల వరకూ ఉంటుంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంది. అత్యంత చవకైన ల్యాప్ టాప్ లను తీసుకురావాలని ప్రణాళిక చేసింది. రూ. 15,000 ధరలో ల్యాప్ టాప్ ను మార్కెట్లోకి తేవాలని ప్రయత్నాలు ప్రారంభించింది.

Reliance Jio: రూ.15వేలకే ల్యాప్ టాప్.. రిలయన్స్ సరికొత్త ఆవిష్కరణ.. లాంచింగ్ ఎప్పుడంటే..
Jio Cloud Pc
Madhu
| Edited By: |

Updated on: Nov 19, 2023 | 5:18 PM

Share

ఇటీవల కాలంలో ల్యాప్ టాప్ ల వినియోగం బాగా పెరిగింది. కరోనా అనంతరం అన్ని రంగాలు డిజిటల్ బాట పట్టడంతో వీటికి డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా విద్యారంగంలో ల్యాప్ టాప్ లను అధికంగా వినియోగిస్తున్నారు. అయితే వీటి ధరలు ఎక్కువగా ఉంటుండంతో విద్యార్థుల తల్లిందండ్రులు సెకండ్ హ్యాండ్ ల్యాప్ టాప్ ల వైపు మొగ్గచూపుతున్నారు. అవి కూడా దాదాపు రూ. 10వేల నుంచి ప్రారంభమై రూ. 20వేల వరకూ ఉంటుంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంది. అత్యంత చవకైన ల్యాప్ టాప్ లను తీసుకురావాలని ప్రణాళిక చేసింది. రూ. 15,000 ధరలో ల్యాప్ టాప్ ను మార్కెట్లోకి తేవాలని ప్రయత్నాలు ప్రారంభించింది. జియో క్లౌడ్ ల్యాప్ టాప్ పేరిట వీటిని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే యాసర్, హెచ్ పీ, లెనోవో వంటి సంస్థలతో చర్చలు ప్రారంభించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

క్లౌడ్ లో స్టోరేజ్..

ఈ ల్యాప్ ట్యాప్ లో ప్రాసెసర్, స్టోరేజ్ ప్రత్యేకంగా ఉండదు. రెండూ జియో క్లౌడ్ లో ఇమిడి ఉంటాయి. ల్యాప్ టాప్ ఓ డంబ్ టెర్మినల్ ఏర్పడి వేగవంతమైన పనితీరును కనబరుస్తుంది. దీంతో వినియోగదారులు అన్ని సేవలను వేగంతో యాక్సెస్ చేయడానికి ఇది ఉపకరిస్తుంది. అంతేకాక ల్యాప్ టాప్ ధరను అమాంతం పెంచేసే మెమరీ స్టోరేజ్, ప్రాసెసర్ లు రెండూ క్లౌడ్ ద్వారా సమకూర్చుకోవచ్చు కాబట్టి మొత్తం ల్యాప్ టాప్ ధరను ఇది తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

రిలయన్స్ జియో ‘క్లౌడ్ ల్యాప్‌టాప్’ పూర్తి వివరాలు..

  • ప్రస్తుతం, ల్యాప్‌టాప్‌ను సొంతం చేసుకోవడానికి దాదాపు రూ. 50,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో పోల్చి చూస్తే, రిలయన్స్ జియో కేవలం రూ. 15,000కే లభిస్తోంది.
  • దేశంలోని ప్రముఖ టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ ఇప్పుడు అగ్రశ్రేణి ల్యాప్ టాప్ తయారీదారులైన యాసర్, హెచ్ పీ, లెనోవో వంటి కంపెనీలతో చర్చలు జరుపుతోంది. రానున్న కొన్ని నెలల్లోనే ల్యాప్‌టాప్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.
  • ప్రతిపాదిత క్లౌడ్ పీసీ కోసం హెచ్ పీ క్రోమ్ బుక్ ఇప్పటికే ట్రయల్స్ నిర్వహిస్తోందని తెలుస్తోంది. ఇది జియో నుంచి రెండవ ల్యాప్‌టాప్. జూలైలో, జియో బుక్ ను రూ. 16,499 కి అందుబాటులోకి తీసుకొచ్చింది.
  • జియో బుక్ జియో ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి ఉండగా.. కొత్త పరికరం విండోస్ తో సహా ఇతర ఆపరేటింగ్ సిస్టమ్‌లలో రన్ అవుతుందని భావిస్తున్నారు.
  • రాబోయే పీసీ కోసం రిలయన్స్ నెలవారీ సభ్యత్వాన్ని అందిస్తుంది; సబ్‌స్క్రిప్షన్‌లో భాగంగా, అనేక ఫీచర్లు దానితో జతచేయబడతాయి. అయితే మరింత ప్రత్యేకమైన వాటిని అదనపు ధరకు కొనుగోలు చేయవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..