Smart Phone: మరో నయా స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసిన ఒప్పో.. ధర, ఫీచర్ల వివరాలివే..!
భారతదేశంలో స్మార్ట్ ఫోన్ల హవా రోజురోజుకూ పెరుగుతుంది. ముఖ్యంగా యువత స్మార్ట్ ఫోన్లంటే ప్రత్యేక క్రేజ్ ఉంది. ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని చాలా కంపెనీలు నయా ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేస్తూ ప్రత్యర్థి కంపెనీలకు గట్టి పోటినిస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ ఒప్పో తన కే సిరీస్‌ను అప్‌గ్రేడ్ చేస్తే కే 13 ఎక్స్ 5 జీ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఒప్పో ఇటీవల భారతదేశంలో కే సిరీస్‌లో తాజా స్మార్ట్‌ఫోన్‌గా కే13ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ ఎంఐఎల్-ఎస్‌టీడీ-810 హెచ్ సర్టిఫికేషన్‌తో ఆకట్టుకుంటుంది. తీవ్రమైన వేడి, తేమ, షాక్ నిరోధకత వంటి కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో సమర్థంగా పరీక్షించాలమని కంపెనీ ప్రతినిధులు క్లెయిమ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఫోన్ ఐపీ 65 రేటింగ్‌తో వస్తుంది. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఈ ఫోన్ ప్రత్యేకత. అలాగే ఈ ఫోన్ 1000 నిట్‌ల వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ముఖ్యంగా సెగ్మెంట్-ఫస్ట్ స్ప్లాష్ టచ్ టెక్నాలజీ ఆకట్టుకుంటుంది. ఈ ఫీచర్ వల్ల ఫోన్ తడి చేతులతో లేదా స్క్రీన్ తడిగా ఉన్నప్పటికీ దాని టచ్‌స్క్రీన్‌ను ఆపరేట్ చేయడానికి వీలుగా ఉంటుందని కంపెనీ తెలిపింది. కే13 ఎక్స్ 5జీ ఆండ్రాయిడ్ 15 తో వస్తుంది. అలాగే మూడేళ్లపాటు మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తుంది.
ఒప్పో కే 13 ఎక్స్ 5 జీ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్ఓసీతో తో 8 జీబీ ర్యామ్‌తో పనిచేస్తుంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 2 ఎంపీ పోర్ట్రెయిట్ కెమెరా, ముందు భాగంలో 8 ఎంపీ కెమెరాతో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ కేవలం 7.99 ఎంఎం మందంతో మృదువైన, సౌకర్యవంతమైన పట్టు కోసం వెనుక మరియు దాని ఫ్రేమ్ చుట్టూ మ్యాట్ ఫినిషింగ్‌తో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ బాక్స్‌లో 45 వాట్స్ ఫాస్ట్ చార్జర్‌తో 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.
ఒప్పో కే 13 ఎక్స్ 5 జీ స్మార్ట్ ఫోన్ మిడ్‌నైట్ వైలెట్, సన్‌సెట్ పీచ్ రంగులలో లభిస్తుంది. అలాగే 4 జీబీ + 128 జీబీ మోడల్ ధర రూ.11,999, 6 జీబీ + 128 జీబీ మోడల్ ధర రూ. 12,999, 8 జీబీ + 256 జీబీ మోడల్ ధర రూ. 14,999గా ఉంది. ఈ ఫోన్ ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఒప్పో ఇండియా ఆన్‌లైన్ స్టోర్స్ నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంది.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..