AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OnePlus Nord CE5: అతి పెద్ద బ్యాటరీ.. అదిరే ఫీచర్లు.. జూన్‌లో ఆ వన్‌ప్లస్ ఫోన్ విడుదల

మన దేశంలో స్మార్ట్ ఫోన్ల మార్కెట్ ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలతో కళకళలాడుతోంది. లేటెస్టు ఫీచర్లు, ఆకట్టుకునే లుక్ తో ఒకదాన్ని మించి మరొకటి విడుదలవుతున్నాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా, అన్ని రకాల ఫీచర్లతో అందుబాటులోకి వస్తున్నాయి. ప్రముఖ బ్రాండ్ అయిన వన్ ప్లస్ తన మోడళ్లను మార్కెట్ లో విస్తరించకుంటూ పోతోంది. ఈ మేరకు నార్డ్ సీఈ5 ఫోన్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేసింది. ఈ ఫోన్ ధర, ఇతర వివరాలను తెలుసుకుందాం.

OnePlus Nord CE5: అతి పెద్ద బ్యాటరీ.. అదిరే ఫీచర్లు.. జూన్‌లో ఆ వన్‌ప్లస్ ఫోన్ విడుదల
Oneplus Nord Ce 5
Nikhil
|

Updated on: May 07, 2025 | 4:30 PM

Share

మన దేశంలో వన్ ప్లస్ నార్డ్ సీఈ5 స్మార్ట్ ఫోన్ జూన్ లో విడుదల కావొచ్చని భావిస్తున్నారు. దీని ధర రూ.25 వేలు ఉండే అవకాశం ఉంది. గతేడాది వన్ ప్లస్ నుంచి సీఈ 4 ఫోన్ విడుదలైంది. దానికి కొనసాగింపుగా సీఈ 5 తీసుకువచ్చినట్టు సమాచారం. ఇప్పటికే టెలి కమ్యూనికేషన్స్, డిజిటల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ అథారిటీ (టీడీఆర్ఏ), బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఎస్ఐ)లలో ఈ ఫోన్ మోడల్ కనిపించింది. మన దేశంలో మోడల్ నంబర్ సీపీహెచ్ 2717 కింద బీఐఎస్ లిస్టింగ్ కావడంతో దీని విడుదల ఖాయమని తెలుస్తోంది.

మన దేశంలో మే నెలలోనే వన్ ప్లస్ నార్డ్ సీఈ 5 స్మార్ట్ ఫోన్ విడుదల అవుతుందని మార్కెట్ నిపుణులు భావించారు. కానీ తాజా పరిస్థితులను పరిశీలిస్తే ఒక నెల తర్వాత అంటే జూన్ లో విడుదల చేయనున్నట్టు సమాచారం. ఈ ఫోన్ ధర, ఫీచర్లు, ప్రత్యేకతలకు సంబంధించి అనేక వార్తలు వెలువడ్డాయి. వాటి ప్రకారం.. వన ప్లస్ కొత్త ఫోన్ లో 6.7 అంగుళాల పూర్తి హెచ్ డీ ప్లస్ ఓఎల్ఈడీ డిస్ ప్లే ఏర్పాటు చేశారు. మీడియా టెక్ డైమెన్సిటీ 8350 చిప్ సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. రోజు వారీ పనులతో పాటు తేలిక పాటి గేమింగ్ కు కూడా చాాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా దీనిలో 7100 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. దీంతో చార్జింగ్ సమస్య లేకుండా చక్కగా వినియోగించుకోవచ్చు. ఈ పరికరం 80 డబ్ల్యూ చార్జింగ్ కు మద్దతు ఇస్తుంది. ఇప్పటి వరకూ వచ్చిన వన్ ప్లస్ ఫోన్లలో అతి పెద్ద బ్యాటరీ ఇదే కావడం విశేషం.

కెమెరా విషయానికి వస్తే 50 మెగా పిక్సల్ ప్రైమరీ సెన్సార్, 8 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఏర్పాటు చేశారు. సెల్పీలు, వీడియోల కోసం ముందు భాగంలో 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ, ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ బ్లాస్టర్, హైబ్రిడ్ సిమ్ స్లాట్, సింగిల్ స్పీకర్ తదితర ఫీచర్లు ఉంటాయి. అందరికీ ఆకట్టుకునే కొత్త డిజైన్ లో వన్ ప్లస్ నార్డ్ సీఈ 5 ఫోన్ ను తీసుకువస్తున్నారు. ఐ ఫోన్ లలో కనిపించే పిల్ ఆకారపు కెమెరా మాడ్యూల్ తో అందుబాటులోకి రానున్నట్టు సమాచారం. పింక్ కలర్ లో ఈ ఫోన్ ఉంటుందని భావిస్తున్నారు. కాగా…సీఈ 5 తో పాటు నార్డ్ 5 ఫోన్ తయారీలో కంపెనీ బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి