Smart Phone: స్టైలిష్ లుక్‌తో స్టన్నింగ్ ఫీచర్స్‌తో రియల్ మీ ఫోన్.. ధర ఎంతో తెలుసా?
ఇటీవల కాలంలో యువత అధికంగా స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. ముఖ్యంగా భారతదేశంలో చాలా మంది బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్స్‌ను ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్స్ అధునాత ఫీచర్స్‌తో రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ రియల్ మీ సీ-75 పేరుతో అధునాతన ఫీచర్స్‌తో భారతదేశంలో కొత్త స్మార్ట్ ఫోన్‌ను రిలీజ్ చేసింది.

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ రియల్ మీ సీ-75 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయడంతో తన సీ-సిరీస్ స్మార్ట్ ఫోన్స్‌ను విస్తరించింది. సరసమైన ధరలోనే వచ్చే ఈ రియల్ మీ స్మార్ట్ ఫోన్ హెచ్‌డీ ప్లస్ డిస్ ప్లేతో వస్తుంది. అలాగే మీడియా టెక్ చిప్ సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్-15 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పని చేస్తుంది. అలాగే 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతగా ఉంటుంది. రియల్ మీ సీ-75 రెండు వేరియంట్లలో వస్తుంది.
4 జీబీ + 128 జీబీ వేరియంట్ స్మార్ట్ ఫోన్ దర రూ.12,999గా ఉంటే 6 జీబీ + 128 జీబీ వేరియంట్ ధర రూ. 13,999గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ లిల్లీ వైట్, మిడ్నైట్ లిల్లీ, పర్పుల్ బ్లోసమ్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ రియల్ మీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్ కార్ట్, రిటైల్ దుకాణాల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ 720×1604 పిక్సెల్ రిజల్యూషన్తో 6.67 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్ ప్లేతో వస్తుంది.120 హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేటుతో వచ్చే ఈ స్మార్ట్ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. అలాగ ఈ ఫోన్ మెమరీను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2 టీబీ వరకు విస్తరించుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో వస్తుంది.
రియల్ మీ సీ-75 స్మార్ట్ ఫోన్ 32 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐపీ64 రేటింగ్‌తో వస్తుందిఈ స్మార్ట్ఫోన్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో వస్తుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి