Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samsung Offers: శామ్‌‌సంగ్ నుంచి స్టన్నింగ్ డీల్స్..ఏకంగా 65శాతం డిస్కౌంట్స్..!

సమ్మర్ వచ్చిందంటే కొనుగోలుదారులకు పండగే. ఎందుకంటే అన్ని కంపెనీలు సమ్మర్ స్పెషల్ ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ, స్మార్ట్ వాచ్ వంటి వస్తువులను అప్ గ్రేడ్ చేసుకునేందుకు సమ్మర్ లో ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంటారు. మీరు కూడా అలాంటి ఆలోచనల్లోనే ఉంటే మీ వెయింటింగ్ కు ఇక ఫుల్ స్టాప్ పెట్టేయండి.

Samsung Offers: శామ్‌‌సంగ్ నుంచి స్టన్నింగ్ డీల్స్..ఏకంగా 65శాతం డిస్కౌంట్స్..!
Samsung
Follow us
Srinu

|

Updated on: May 06, 2025 | 5:00 PM

ప్రముఖ టెక్ దిగ్గజం ఈ ఏడాది టాప్ డీల్స్ ను అందించేందుకు కొత్త ఫెస్టివల్ సేల్ ను ప్రారంభించింది. మండే వేసవిలో కూల్ కూల్ ఆఫర్లను అందిస్తోంది. శామ్సంగ్ తన అతి పెద్ద సమ్మర్ సేల్ ‘ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్’ ను ప్రకటించింది. ఈ సేల మే ఒకటో తేదీన ప్రారంభమైంది. ఈ ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్ లో అన్ని గృహోపకరణాలు, స్మార్ట్ ఫోన్లు, పలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై అదిరే డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు ఈ సేల్ ను సద్వినియోగం చేసుకోవాలనుకుంటే శామ్సంగ్ అధికారిక వెబ్ సైట్ తో పాటు శామ్సంగ్ షాప్ యాప్, శామ్సంగ్ ఎక్స్ క్లూజివ్ స్టోర్ లకు వెళ్లాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

స్మార్ట్ ఫోన్ ఆఫర్లు ఇవి..

మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే.. మీరు ఇదే సరైన సమయం. ఎంచుకున్న శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లపై 41% వరకు తగ్గింపును ఫ్యాబ్ గ్రాబ్ సేల్ అందిస్తోంది. వీటిలో ప్రసిద్ధ మోడళ్లు ఉన్నాయి. శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్6, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6, గెలాక్సీ ఎస్25 అల్ట్రా, ఎస్25+, ఎస్25, గెలాక్సీ ఎస్24 అల్ట్రా, ఎస్24, ఎస్24 ఎఫ్ఈ, గెలాక్సీ ఏ56 5జీ, ఏ36 5జీ, ఏ55 5జీ, ఏ35 5జీ, గెలాక్సీ ఎం16, ఎం06, గెలాక్సీ ఎఫ్16, ఎఫ్06. వీటిపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాక మీరు వీటి కొనుగోలుపై సులభమైన నో-కాస్ట్ ఈఎంఐ ఎంపికలను కూడా పొందవచ్చు. ఫోల్డబుల్స్ కోసం 24 నెలల వరకు, ఎస్ సిరీస్ ఫోన్‌లకు 12 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ అందుబాటులో ఉంటుంది.

ట్యాబ్లెట్స్, ల్యాప్ టాప్స్..

కేవలం స్మార్ట్ ఫోన్లపై మాత్రమే కాక ఎంపిక చేసిన టాబ్లెట్‌లు, యాక్సెసరీలు, ధరించగలిగే వస్తువులపై కూడా శామ్‌సంగ్ 65% వరకు ధరలను తగ్గిస్తోంది. మీరు గెలాక్సీ ట్యాబ్ ఎస్10ఎఫ్ఈ ని కొనుగోలు చేస్తే, మీకు రూ. 2,999 విలువైన 45వాట్ల ఛార్జర్ ఉచితంగా లభిస్తుంది. అలాగే ల్యాప్‌టాప్ ప్రియులు గెలాక్సీ బుక్4, బుక్5 సిరీస్ లపై 35శాతం వరకూ తగ్గింపు పొందవచ్చు. అంతేకాక ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై రూ.17,490 వరకు క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

గృహోపకరణాలపై ఆఫర్లు ఇవి..

  • టీవీలు.. శామ్సంగ్ ప్రీమియం నియో క్యూఎల్ఈడీ 8కే, ఓఎల్ఈడీ, క్యూఎల్ఈడీ, ది ఫ్రేమ్, క్రిస్టల్ 4కే యూహెచ్డీ టీవీలు కూడా 48శాతం వరకూ తగ్గింపుతో ఆఫర్లో ఉన్నాయి. ది ఫ్రేమ్ టీవీని ఇప్పుడు కొనుగోలు చేయడం వలన మీకు రూ. 11,000 వరకు తక్షణ కార్ట్ డిస్కౌంట్, అలాగే ఎంపిక చేసిన మోడళ్లపై రూ. 5,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభిస్తుంది.
  • ఎయిర్ కండీషనర్లు.. శామ్సంగ్ విండ్ ఫ్రీ ఏసీలు 58% వరకు తగ్గింపుతో లభిస్తాయి. మీరు రెండు లేదా అంతకంటే ఎక్కువ యూనిట్లను కొనుగోలు చేస్తే అదనంగా 5% తగ్గింపు పొందవచ్చు.
  • ఇంకా రిఫ్రిజిరేటర్లపై 43% వరకు, వాషింగ్ మెషీన్లపై 43% వరకు, మైక్రోవేవ్ ఓవెన్ లపై 39% వరకు, మానిటర్లపై 60% వరకు, పై కూడా భారీ తగ్గింపులు ఉన్నాయి. కొనుగోలుదారులు శామ్సంగ్ “బై మోర్, సేవ్ మోర్” ఆఫర్ ను వినియోగిస్తే.. 22.5% (గరిష్టంగా రూ. 25,000) వరకు బ్యాంక్ క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి