Smartphones: ఫీచర్స్‌లో ముచ్చటగా మూడు ఫోన్ల పోటాపోటీ..రూ.50 వేలల్లో ది బెస్ట్ ఫోన్ ఏదంటే..?
భారతదేశంలోని యువత స్మార్ట్ ఫోన్ వాడకాన్ని అమితంగా ఇష్టపడుతున్నారు. చాలా మంది యువకులు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తే కొందరు మాత్రం నలుగురిలో ప్రత్యేకంగా కనిపించేందుకు ప్రీమియం స్మార్ట్ ఫోన్స్‌ను వినియోగిస్తన్నారు. అయితే దేశంలో రూ.50 వేలలోపు ధరలో మూడు ప్రధాన కంపెనీల స్మార్ట్ ఫోన్లు పోటీపడుతున్నారు. ఈ ప్రధాన ఫోన్స్ మధ్య ప్రధాన తేడాలను తెలుసుకుందాం.

భారతదేశంలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ అయిన వన్‌ప్లస్ ఇటీవల తన మొట్టమొదటి కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్ ప్లస్ 13ఎస్‌ను రిలీజ్ చేసింది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్, అనేక ఏఐ ఫీచర్లతో వచ్చే ఈ ఫోన్ ధరను రూ.49,999 నిర్ణయించారు. దీంతో ఈ ఫోన్ సామ్‌సంగ్ గెలాక్సీ ఏ56, గూగుల్ పిక్సెల్ 9ఏ ఫోన్లకు గట్టి పోటీనిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ మూడు ఫోన్ల మధ్య ప్రధాన తేడాలను తెలుసుకుందాం.
పెర్ఫార్మెన్స్
- సామ్‌సంగ్ గెలాక్సీ ఏ-56 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ ఎమోఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ద్వారా ప్రొటెక్షన్‌తో వస్తుంది.
- పిక్సెల్ 9ఏ ఫోన్ 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓఎల్ఈడీ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ డిస్‌ప్లే రక్షణ కోసం పాత కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3ని ఉపయోగిస్తుంది.
- వన్‌ప్లస్ 13 ఎస్ 6.32 అంగుళాల 1.5కే ఎల్‌టీపీఓ ఎమోఎల్ఈడీ డిస్‌ప్లేను హెచ్‌బీఎంలో 1600 నిట్స్ బ్రైట్‌నెస్, డాల్బీ విజన్‌కు మద్దతుతో ప్యాక్ చేస్తుంది. అధిక-నాణ్యత ప్యానెల్ కంటెంట్‌ను సర్దుబాటు చేస్తుంది. ఇది మెరుగైన బ్యాటరీ సామర్థ్యాన్ని అందిస్తుంది.
ప్రాసెసర్లు
గెలాక్సీ ఏ-56 ఎక్సినోస్ 1580 ప్రాసెసర్‌తో వస్తుంది. అలాగే గూగుల్ ఫోన్ టెన్సార్ జీ4 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ రెండు ప్రాసెసర్లు ఏ ప్రమాణాల ప్రకారం చూసినా మంచివే అయినా ఈ సంవత్సరం లాంచ్ అయిన చాలా ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లకు శక్తినిచ్చే వన్ ప్లస్ 13ఎస్‌లోని ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వస్తుంది.
బ్యాటరీ
గెలాక్సీ ఏ-56 45 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అదే సమయంలో పిక్సెల్ 9ఏ 23 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 7.5 వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,100 ఎంఏహెచ్ సెటప్‌ను కలిగి ఉంది. వన్ ప్లస్ ఫోన్ 5,850mAh బ్యాటరీ సెటప్‌తో మాత్రమే కాకుండా బాక్స్ లోపల సరఫరా చేయబడిన 80 వాట్స్ ఛార్జర్‌తో వస్తుంది. అయితే వన్‌ప్లస్ 13ఎస్‌లో వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు.
కెమెరా
పిక్సెల్ 9ఏ ఫోన్ ఓఐఎస్‌తో కూడిన 48 ఎంపీ సామ్‌సంగ్ జీఎన్8 ప్రైమరీ షూటర్, సోనీ ఐఎంఎక్స్ 712 సెన్సార్ తో కూడిన 13 ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో వస్తుంది. ముందు భాగంలో 4కే 30 ఎఫ్‌పీఎస్ వీడియో రికార్డింగ్ కు మద్దతు ఇచ్చే 13 ఎంపీ సెల్ఫీ షూటర్ ఉంది. గెలాక్సీ ఏ 56లో ఓఐఎస్‌తో కూడిన 50ఎంపీ ప్రైమరీ షూటర్, 12 ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 5 ఎంపీ మాక్రో సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో సెల్ఫీల కోసం 12 ఎంపీ కెమెరాతో వస్తుంది. వన్‌ప్లస్ 13 ఎస్‌లో 50 ఎంపీ సోనీ లైట్ 700 ప్రైమరీ సెన్సార్, ఓఐఎస్‌తో, 50 ఎంపీ 2x టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకత.