AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gmail: నెక్స్ట్ జెనరేషన్ ఈ-మెయిల్స్‌పై గూగుల్ దృష్టి.. ఆ సమస్యలకు ఏఐతో చెక్..!

పెరుగుతున్న టెక్నాలజీ అఫీషియల్ మెసేజ్‌లకు అందరూ ఈ-మెయిల్స్ వాడుతున్నారు. ముఖ్యంగా కంపెనీల వ్యాపార ప్రకటనలతో పాటు ఇతర ప్రచారాలకు కూడా ఈ-మెయిల్స్ వినియోగిస్తున్నారు. కానీ ఇటీవల టెక్నాలజీ రంగంలో ఏఐ శాసిస్తుంది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ జెనరేషన్ ఈ-మెయిల్స్‌పై గూగుల్ ద‌ృష్టి సారిస్తుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Gmail: నెక్స్ట్ జెనరేషన్ ఈ-మెయిల్స్‌పై గూగుల్ దృష్టి.. ఆ సమస్యలకు ఏఐతో చెక్..!
Gmail
Nikhil
|

Updated on: Jun 07, 2025 | 5:00 PM

Share

ఏఐ పురోగతి భవిష్యత్‌లో టెక్నాలజీ రంగంలో గొప్ప మార్పులను తీసుకువస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ తన ఈ-మెయిల్స్ విషయంలో కీలక చర్యలు తీసుకుంటుంది గూగుల్ డీప్‌మైండ్ అధిపతి డెమిస్ హస్సాబిస్ తన బృందంతో కలిసి నెక్స్ట్ జెనరేషన్ ఈ-మెయిల్స్‌పై పనిచేస్తున్నట్లు వెల్లడించారు. రోజువారీ ఈ-మెయిల్‌లను క్రమబద్ధీకరించడంతో పాటు అత్యంత సాధారణమైన వాటికి ప్రత్యుత్తరం ఇవ్వడం, ముఖ్యమైన సందేశాన్ని తప్పిపోయినందుకు క్షమాపణ చెప్పాల్సిన అవసరాన్ని నివారించడం వంటి పనులను పరిష్కరిస్తుందని చెబుతున్నారు. హస్సాబిస్ ఎస్ఎక్స్‌డబ్ల్యూ లండన్ ఉత్సవంలో ఏఐకు సంబంధించిన అసాధారణ వృద్ధి, సామర్థ్యం గురించి మాట్లాడుతూ ఏఐ ప్రభావం స్వల్పకాలంలో అతిగా హైప్ చేశారని, కానీ ఏఐ సమాజంలో లోతైన దీర్ఘకాలిక మార్పులకు దారితీస్తుందని ఆయన అన్నారు. కాబట్టి ప్రపంచంలోని ఈ-మెయిల్ బ్యాక్‌లాగ్‌లపై పని చేయడానికి దీనిని ఉపయోగిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. 

ముఖ్యంగా ఈ-మెయిల్స్‌ను అర్థం చేసుకుని, మీ శైలిలో సమాధానం చెప్పడంతో చిన్నపాటి నిర్ణయాలు తీసుకుని ఆ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. గూగుల్ జీ-మెయిల్‌లో తీసుకొచ్చే ఏఐ ఫీచర్స్ వినియోగదారులకు కొత్త అనుభూతిని ఇస్తాయని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా మీ దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్న ఇతర అల్గోరిథంల నుంచి మీ దృష్టిని కాపాడుతుంది. ముఖ్యంగా ఏజీఐ అభివృద్ధితో విస్తృత శ్రేణి పనులను ఏకకాలంలో నిర్వహించవచ్చని స్పష్టం చేస్తున్నారు. 

ఏజీఐ వల్ల కలిగే అనర్థాల గురించి కొనసాగుతున్న ఆందోళనలతో కంపెనీలు, దేశాల మధ్య పోటీగా మారుతున్న దాని అభివృద్ధిపై సహకరించాలని ఆయన అమెరికా, చైనాలకు పిలుపునిచ్చారు. కనీసం శాస్త్రీయ స్థాయిలో, భద్రతా స్థాయిలో అంతా కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. ఏజీఐ సర్వీసులు దాదాపు ఐదు నుంచి పది సంవత్సరాల్లో అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఏజీఐ రాక ఒక కొత్త పారిశ్రామిక విప్లవం కంటే తక్కువ కాదని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉద్యోగాలపై ఏఐ ప్రభావం గురించి తీవ్రమైన ఆందోళనలు ఉన్నాయి. కాబట్ట రాబోయే రోజుల్లో కాలేజీ స్థాయిలోనే ఏఐ వినియోగం, అభివ‌ృద్ధి గురించి విద్యార్థులకు తగిన తర్ఫీదును ఇవ్వాలని ఆయన సూచించారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..