Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటర్నెట్ చరిత్రలోనే విప్లవాత్మక మార్పు.. ఇకపై సిమ్ కార్డ్ అక్కర్లేదు.. మీ వైఫై నీతోనే..!

ఎంత మొబైల్ డేటా ఉన్న వైఫైలో ఉన్న ఆ సుఖమే వేరు. హై స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ డేటాతో వైఫై ని ఆస్వాదిస్తారు. ఇంట్లో, ఆఫీసులో కామన్‌ గాని మనకి వైఫై అందుబాటులో ఉంటుంది. ఇక ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పరిచయం ఉన్న వ్యక్తులైతే వాళ్ల వైఫై యూస్ చేసుకుంటాం. ఏదైనా హోటల్ కి వెళ్ళినప్పుడు అక్కడున్న వైఫై ని వాడుకుంటాం.. ఇక ఫ్రీగా వచ్చే పబ్లిక్ వైఫైపై ఆధారపడుతూ ఉంటాం.

ఇంటర్నెట్ చరిత్రలోనే విప్లవాత్మక మార్పు.. ఇకపై సిమ్ కార్డ్ అక్కర్లేదు.. మీ వైఫై నీతోనే..!
Unicord Charging Cable
Follow us
Rakesh Reddy Ch

| Edited By: Balaraju Goud

Updated on: Jun 07, 2025 | 4:14 PM

ఎంత మొబైల్ డేటా ఉన్న వైఫైలో ఉన్న ఆ సుఖమే వేరు. హై స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ డేటాతో వైఫై ని ఆస్వాదిస్తారు. ఇంట్లో, ఆఫీసులో కామన్‌ గాని మనకి వైఫై అందుబాటులో ఉంటుంది. ఇక ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పరిచయం ఉన్న వ్యక్తులైతే వాళ్ల వైఫై యూస్ చేసుకుంటాం. ఏదైనా హోటల్ కి వెళ్ళినప్పుడు అక్కడున్న వైఫై ని వాడుకుంటాం.. ఇక ఫ్రీగా వచ్చే ఎయిర్‌పోర్ట్ వైఫై, రెస్టారెంట్ వైఫై, బస్టాండ్, రైల్వే స్టేషన్, షాపింగ్ మాల్స్ ఎక్కడికి వెళ్లినా మొదట వెతికేది వైఫై కోసమే.. వీటికి తోడు ఇప్పుడు ఫ్రీ వైఫై జోన్స్ అంటూ ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు సేఫ్!

సెక్యూరిటీ లేని ప్రాంతాల్లో వైఫై యూస్ చేయడం వల్ల మీ మొబైల్ లో ఉన్న సెన్సిటివ్ డేటా మొత్తం చోరీకి గురవుతుంది. మీ బ్యాంక్ డీటెయిల్స్, మీ పాస్‌వర్డ్‌స్, మీ వాట్సాప్ చాట్, మీ కాంటాక్ట్స్ ఇలా అన్ని వైఫై నుంచి సేకరించే అవకాశం ఉంటుంది. ఫ్రీ వైఫై అంటూ ఊరించే వారు ఊరికే ఏది గుర్తు పెట్టుకోండి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి! మొబైల్ డేటా వాడుకుందాం అంటే కొన్ని ప్రాంతాల్లో సిగ్నల్ సరిగ్గా ఉండదు, ఇంక మొబైల్ డేటా కొంచెం ఖరీదు కూడా ఎక్కువ. వీటన్నిటికీ తోడు ఫ్యామిలీతో బయటకు వెళితే అది మరొక సమస్య.

ఇక వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు ప్రపంచంలోనే అతి చిన్న వైఫై ని ప్రవేశపెట్టింది గ్లోబల్ మీ అనే సంస్థ. ఎంత చిన్న వైఫై అంటే కేవలం మీరు చార్జింగ్ చేసుకునే చార్జింగ్ కేబుల్ మీ వైఫై రూటర్ కూడా.. నమ్మలేకపోతున్నారా ఇది నిజం. మీ చార్జింగ్ కేబుల్ మధ్యలోనే ఒక చిన్న ఎక్విప్‌మెంట్‌లో వైఫై ని ఫిక్స్ చేశారు. ఎలాంటి సిమ్ కార్డ్ అవసరం లేదు, ఈ సిమ్ అవసరం లేదు. ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్లిన ఈ గ్లోబల్ మీ యూనికార్డు ద్వారా ఇంటర్నెట్ సేవల్ని పొందవచ్చు. ఇందుకోసం డేటా ప్లాన్ మాత్రం కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ఈ యూనికార్డు చార్జింగ్ కేబుల్ కి అటువైపు ఇటువైపు సి టైప్ పిన్ ఉంటుంది. ఒకవైపు పవర్ కి కనెక్ట్ చేస్తే గ్లోబల్ ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుంది. పవర్ ఉన్నంతసేపు హై స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తూనే ఉంటుంది. ఒకేసారి 10 నుంచి 15 డివైస్ లకు హై స్పీడ్ ఇంటర్నెట్ అందించే సామర్థ్యం ఈ బుల్లి వైఫై కి ఉంది. అంతేకాదు ఈ కేబుల్ తో చార్జింగ్ పెట్టుకోవచ్చు, డేటా ట్రాన్స్‌ఫర్ కూడా చేసుకోవచ్చు. మీ సొంత వైఫై ని ఎక్కడ కావాలంటే అక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. మొబైల్ నెట్‌వర్క్ పనిచేయని ప్రాంతాల్లో కూడా వెబ్ సర్ఫింగ్ కోసం కావలసిన ఇంటర్నెట్ ని ఇది అందిస్తుంది. అంటే మీరు ఇమెయిల్ మెసేజెస్ ఈజీగా పంపించుకోవచ్చు.

ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న ఈ యూనికార్డు ధర కూడా కేవంలం 5,000 రూపాయలు మాత్రమే. మీ సొంత వైఫై ని ఎక్కడ కావాలంటే అక్కడ పూర్తి సెక్యూరిటీతో జస్ట్ ఈ కేబుల్ ద్వారా ఏర్పాటు చేసుకోవచ్చు.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

తొలి మహిళా ఆర్టీసీ డ్రైవర్‌గా గిరిజన బిడ్డ రికార్డ్..!
తొలి మహిళా ఆర్టీసీ డ్రైవర్‌గా గిరిజన బిడ్డ రికార్డ్..!
పెళ్లి చేసుకోను.. కానీ నాకు పార్ట్‌నర్ కావాలి..
పెళ్లి చేసుకోను.. కానీ నాకు పార్ట్‌నర్ కావాలి..
IND vs NZ: 15 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం..
IND vs NZ: 15 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం..
కళ్ల ముందే స్నేహితుడు చనిపోయాడని పురుగుల మందు తాగాడు.. చివరకు..
కళ్ల ముందే స్నేహితుడు చనిపోయాడని పురుగుల మందు తాగాడు.. చివరకు..
ఈ విదేశీ పర్యటనతో చరిత్ర సృష్టించబోతున్న ప్రధాని మోదీ!
ఈ విదేశీ పర్యటనతో చరిత్ర సృష్టించబోతున్న ప్రధాని మోదీ!
టీమిండియా ఛీ కొట్టింది.. కట్‌చేస్తే సెంచరీతో సెలెక్టర్లకు కౌంటర్
టీమిండియా ఛీ కొట్టింది.. కట్‌చేస్తే సెంచరీతో సెలెక్టర్లకు కౌంటర్
మరో ఘోర విషాదం.. కేదార్‌నాథ్‌లో కుప్పకూలిన హెలికాఫ్టర్!
మరో ఘోర విషాదం.. కేదార్‌నాథ్‌లో కుప్పకూలిన హెలికాఫ్టర్!
పోలీసులా వచ్చి కాల్పులు జరిపిన దుండగుడు.. అమెరికాలో దారుణం..
పోలీసులా వచ్చి కాల్పులు జరిపిన దుండగుడు.. అమెరికాలో దారుణం..
రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులతో జోరు వానలు!
రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులతో జోరు వానలు!
అడవి శేష్‌కు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ..
అడవి శేష్‌కు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ..