Smart Phone: ఆ రెండు రియల్ మీ ప్రొడెక్ట్స్ విక్రయాలు షురూ..నయా ఫోన్ ఫీచర్లు తెలిస్తే మతిపోతుందంతే..!
భారతదేశంలో రియల్ మీ ప్రొడెక్ట్స్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. స్మార్ట్ ఫోన్స్‌తో పాటు స్మార్ట్ గ్యాడ్జెట్స్‌ను ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఇటీవల రియల్‌మీ రెండు కొత్త గాడ్జెట్‌లను ప్రకటించింది. రియల్‌మీ సీ73 5జీ స్మార్ట్‌ఫోన్‌తో పాటు రియల్‌మే బడ్స్ టీ200ఎక్స్‌ను రిలీజ్ చేసింది. ఈ ప్రొడెక్ట్స్ జూన్ 6 నుంచి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్స్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు ప్రొడెక్ట్‌ల ఫీచర్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

రియల్ మీ సీ 73 స్మార్ట్ ఫోన్స్‌తో పాటు టీ 200 ఎక్స్ ప్రొడెక్ట్స్ విడుదల తన పోర్ట్ ఫోలియోను విస్తరించిందని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు ప్రొడెక్స్ రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ యాప్ ద్వారా కొనుగోలు చేయవచ్చని రియల్ ప్రకటించింది. ముఖ్యంగా రియల్ మీ సీ73 5 జీ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లు అంటే 64 జీబీ + 128 జీబీ, 4 జీబీ + 128 జీబీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటాయి. బేస్ వేరియంట్ ధర రూ. 10,499, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 11,499. కొనుగోలుదారులు ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా రూ. 500 తగ్గింపును కూడా పొందవచ్చు. ఈ తగ్గింపులతో ఈ ఫోన్ బేస్ వేరియంట్ రూ. 9,999, మరో వేరియంట్ రూ. 10,999కి తగ్గుతుంది. ఈ ఫోన్ క్రిస్టల్ పర్పుల్, జాడే గ్రీన్, ఒనిక్స్ బ్లాక్ అనే మూడు రంగుల్లో లభిస్తుంది.
రియల్ మీ సీ73 5 జీ ఫోన్ 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో ఐపీ 64 రేటింగ్‌తో వస్తుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ద్వారా వచ్చే ఈ ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ముఖ్యంగా ఈ ఫోన్ 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్‌ను యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ ద్వారా 15 వాట్స్ వద్ద ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రియల్ మీ యూఐ 6.0 పై నడుస్తుంది. బ్లూటూత్ 5.3, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, జీపీఎస్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటివి ఈ ఫోన్ ప్రత్యేకతలుగా ఉన్నాయి.
అలాగే రియల్ మీ టీ 200 ఎక్స్ ఇయర్‌బడ్‌ల బడ్స్ విషయానికి వస్తే వీటి ధర రూ.1,599గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా మరో రూ.200 తగ్గింపుతో వినియోగదారులు బడ్జెట్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్‌లను రూ.1,399 వరకు కొనుగోలు చేయవచ్చు. ఈ బడ్స్ మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. మూన్‌లైట్ వైట్, ఫ్రాస్ట్ బ్లూ, ప్యూర్ బ్లాక్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు సౌండ్ క్వాలిటీ, లాంగ్ స్టాండింగ్ బ్యాటరీ లైఫ్‌పై దృష్టి సారించి రూపొందించామని కంపెనీ ప్రతినిధులు చెబతున్నారు. ప్రతి ఇయర్‌బడ్ 12.4 ఎంఎం డైనమిక్ డ్రైవర్‌ను కలిగి ఉంది. ఇది బాస్‌ను మెరుగుపరచడదంతో పాటు స్పష్టమైన ఆడియోను అందించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఇయర్ బడ్స్‌ను పూర్తిగా ఛార్జ్ చేస్తే మీరు 48 గంటల వరకు మొత్తం ప్లేబ్యాక్‌ను పొందవచ్చని కంపెనీ స్పష్టం చేస్తుంది.