AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: ఒకే వాట్సాప్.. ఐదో ఫోన్లలో వాడుకోవచ్చు.. కొత్త అప్ డేట్ అదిరిపోయిందిగా..

ఇప్పటి వరకూ వాట్సాప్ ను ఒక ఫోన్లో ఒక అకౌంట్ మాత్రమే వినియోగించుకునే వీలుంది. ఈ ప్రతికూలత వల్ల వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఇప్పుడు మరో కొత్త అప్ డేట్ లో కంపానియన్ మోడ్ ను అందిస్తోంది. అంటే దీని సాయంతో నాలుగు అదనపు డివైజ్ లను లింక్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఒక వాట్సాప్ ఖాతా మొత్తం ఐదు ఫోన్లలో వాడుకోవచ్చన్నమాట!

WhatsApp: ఒకే వాట్సాప్.. ఐదో ఫోన్లలో వాడుకోవచ్చు.. కొత్త అప్ డేట్ అదిరిపోయిందిగా..
Whatsapp
Madhu
| Edited By: Ram Naramaneni|

Updated on: Dec 09, 2023 | 10:20 PM

Share

వాట్సాప్.. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ లలో ఇది నంబర్ వన్ అని చెప్పాలి. ప్రస్తుతం వాట్సాప్ లేని ఆండ్రాయిడ్ ఫోన్ ఉండదంటే అతిశయోక్తి కాదు. సామాన్య వ్యక్తి నుంచి బిజినెస్ మ్యాన్ వరకూ, విద్యార్థి నుంచి ఉద్యోగుల వరకూ అందరికీ ఇదే ఆధారం. కుటుంబాలు, స్నేహితులతో కనెక్ట్ అయి ఉండటానికి ఇదే ప్రధాన వనరుగా ఉంది. ఈ స్థాయి ఖాతాదారులను కాపాడుకుంటూ.. ఇంకా విస్తరించుకునేందుకు వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్ డేట్లు, ఫీచర్లు అందిస్తోంది. ఇదే క్రమంలో 2021లో వేరే డివైజ్ లకు లింక్ చేసుకునే వెసులుబాటును అందించింది. ఇది బహుళ పరికరాలలో యాప్‌ని ఉపయోగించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. కానీ ఇప్పటి వరకూ వాట్సాప్ ను ఒక ఫోన్లో ఒక అకౌంట్ మాత్రమే వినియోగించుకునే వీలుంది. ఈ ప్రతికూలత వల్ల వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఇప్పుడు మరో కొత్త అప్ డేట్ లో కంపానియన్ మోడ్ ను అందిస్తోంది. అంటే దీని సాయంతో నాలుగు అదనపు డివైజ్ లను లింక్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఒక వాట్సాప్ ఖాతా మొత్తం ఐదు ఫోన్లలో వాడుకోవచ్చన్నమాట! గూగుల్ పిక్సల్ వంటి ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ వాట్సాప్ కంపానియన్ మోడ్ ను సెటప్ చేసుకోవచ్చు.

వాట్సాప్ కంపానియన్ మోడ్ అంటే..

ఈ మోడ్ ఏంటంటే అనేక పరికరాల్లో ఒకే వాట్సాప్ ఖాతాను వినియోగించేందుకు ఇది వీలు కల్పిస్తుంది. చాట్‌లు, కాంటాక్ట్ లు, గ్రూప్స్ అన్నీ కూడా ఆయా పరికరాలలో సింక్రనైజ్ అవుతాయి. మీ వాట్సాప్ ఖాతాకు గరిష్టంగా ఐదు పరికరాలను లింక్ చేయవచ్చు.

ఇలా సెటప్ చేసుకోండి..

సెటప్ ప్రక్రియ ఇప్పటికే ఉన్న లింక్డ్ డివైజ్‌ల ఫంక్షన్‌ను పోలి ఉంటుంది. అయితేఈ వాట్సాప్ కంపానియన్ మోడ్ ప్రత్యేకంగా స్మార్ట్‌ఫోన్‌ల కోసం రూపొందించబడినందున ఆ ప్రక్రియకన్నా కొంచెం భిన్నంగా ఉంటుంది. ఈ ఫీచర్ అధికారికంగా ఏప్రిల్ 25, 2023న విడుదల అయ్యింది.

ఇవి కూడా చదవండి

మీరు కంపానియన్ మోడ్‌ని సెటప్ చేసే ముందు, మీరు యాప్ ను లేటెస్ట్ వెర్షన్ కు అప్ డేట్ చేయండి. అందుకోసం గూగుల్ స్లే స్టోర్ నుంచి గానీ, ఐఓఎస్ వినియోగదారులు అయితే యాప్ స్టోర్ నుంచి గానీ ఇది డౌన్ లోడ్ చేసుకొని ఇన్ స్టాల్ చేసుకోండి. ఆండ్రాయిడ్ వినియోగదారులు వాట్సాప్ వెబ్‌సైట్‌లో కూడా ఏపీకేని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఆ తర్వాత దానిలో ప్రిఫర్డ్ ల్యాంగ్వేజ్ ను ఎంచుకొని కంటిన్యూపై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ నంబర్ ఎంటర్ చేయమని మిమ్మల్ని అడుగుతుంది. అయితే ఆ స్టెప్ ను వదిలేసి, ఓవర్ ఫ్లో మెనూను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న అకౌంట్ ను లింక్ చేయాలనుకుంటే లింక్ టు ఎగ్జిస్టింగ్ అకౌంట్ పై క్లిక్ చేయండి. ఈ యాప్ లో క్యూఆర్ కోడ్ మీకు కనిపిస్తుంది.

ఒకే అకౌంట్ ను వివిధ ఫోన్లలో లింక్ చేయడం ఇలా..

  • మీ ప్రధాన ఫోన్లో వాట్సాప్ ను ఓపెన్ చేయాలి.
  • ఓవర్ ఫ్లో మెనూ పై క్లిక్ చేయాలి.
  • లింక్డ్ డివైజెస్ పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత గ్రీన్ లింక్ ఏ డివైజ్ బటన్ పై క్లిక్ చేయండి.
  • మీ ఫోన్లో క్యూఆర్ కోడ్ డిస్ ప్లే అవుతుంది.

అలా కాకుండా లింక్ విత్ ఫోన్ నంబర్ ఇన్ స్టిడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కూడా చేయొచ్చు. అందుకోసం మీ సెకండరీ ఫోన్లో వాట్సాప్ వెబ్ ఓపెన్ చేసి, మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి. అప్పుడు మీకు వన్ టైం పాస్ కోడ్ వస్తుంది. అది ఎంటర్ చేస్తే రెండో ఫోన్లో కూడా మీ కాంటాక్ట్స్ సింక్రనైజ్ అవుతాయి.

ఒకే వాట్సాప్ ఐదు ఫోన్లలో..

రెండు (లేదా అంతకంటే ఎక్కువ) ఫోన్‌ల నుంచి సందేశాలను మీరు చూడొచ్చు. కంపానియన్ మోడ్‌తో, మీరు ఒకేసారి ఐదు ఫోన్‌లలో వాట్సాప్ ని ఉపయోగించవచ్చు. సిమ్ కార్డ్ లేకుండా కూడా వాట్సాప్ మీ సెకండరీ ఫోన్‌లో పనిచేస్తుండటం ఇక్కడ విశేషం. మీరు మీ సెకండరీ ఫోన్‌లో వాట్సాప్ అందించే మెసేజ్‌లు, ఇమేజ్‌లు, వీడియోలను పంపడం, స్వీకరించడం వంటి అనేక ఫీచర్లను ఆస్వాదించవచ్చు. మీరు మీ సెకండరీ ఫోన్ నుంచి వాట్సాప్ వాయిస్, వీడియో కాల్‌లను కూడా చేయవచ్చు, స్వీకరించవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..