Whatsapp: మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌తో వస్తోన్న వాట్సాప్.. ఇకపై గ్రూప్‌లో ఎంత మందిని యాడ్ చేసుకోవచ్చంటే..
ప్రతీ ఒక్క స్మార్ట్‌ఫోన్‌లో కచ్చితంగా ఉండే యాప్స్‌లో వాట్సాప్ ఒకటి. అంతలా వాట్సాప్ జీవితంలో ఓ భాగమైపోయింది. కొంగొత్త ఫీచర్లతో ఎప్పటికప్పుడు యూజర్లను ఆకట్టుకుంటోన్న వాట్సాప్ ప్రత్యర్థి...

ప్రతీ ఒక్క స్మార్ట్‌ఫోన్‌లో కచ్చితంగా ఉండే యాప్స్‌లో వాట్సాప్ ఒకటి. అంతలా వాట్సాప్ జీవితంలో ఓ భాగమైపోయింది. కొంగొత్త ఫీచర్లతో ఎప్పటికప్పుడు యూజర్లను ఆకట్టుకుంటోన్న వాట్సాప్ ప్రత్యర్థి కంపెనీల పోటీని సైతం ఎదుర్కొని నిలదొక్కుకుంటోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తున్న వాట్సాప్ తాజాగా మరో ఆసక్తికర ఫీచర్‌ను పరియం చేయనుంది. సాధారణంగా ఏదైన ఒక వాట్సాప్ గ్రూప్‌లో 512 మంది వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ పరిమితిని పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఆప్షన్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురాన్నారు. ఈ ఆప్షన్ అందుబాటులోకి వస్తే ఇకపై గ్రూప్ అడ్మిన్ ఏకంగా 1024 మందిని గ్రూప్‌లో చేర్చుకోవచ్చు. వాబేటా ఇన్ఫో ఈ విషయాన్ని తెలుపుతూ ఓ ట్వీట్ చేసింది. తాజా అప్‌డేట్ ప్రాకం గ్రూప్ అడ్మిన్లు తమ గ్రూప్‌లో 1024 మందిని యాడ్ చేసే అవకాశం ఉందని తెలిపింది. గతంలో కంటే ఇది రెట్టింపని తెలిపింది.



WhatsApp is releasing larger groups up to 1024 participants!
Some lucky beta testers on WhatsApp beta for Android and iOS can add up to 1024 participants to their groups!https://t.co/qDbG3AWaIu pic.twitter.com/oI8Dtg30RK
— WABetaInfo (@WABetaInfo) October 8, 2022
ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో ఈ అప్‌డేట్‌ను తీసుకురానున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ అప్‌డేట్‌తో పాటు వాట్సాప్ ఇది వరకే డిలీట్ వర్ ఎవ్రీ వన్ సమయాన్ని పెంచుతూ ఓ అప్‌డేట్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అలాగే సెక్యూరిటీ ఫీచర్స్‌లో భాగంగా మరికొన్ని అప్‌డేట్స్ అందించింది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..